శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 నివారణ కోసం ముక్కు ద్వారా వెళ్లే జెల్ అభివృద్ధి చేయడానికి నిధుల కల్పనకు డిఎస్ టి ఆమోదం

Posted On: 08 APR 2020 11:42AM by PIB Hyderabad

“ఇతర రక్షణ చర్యలతో పాటుగా ముక్కు ద్వారా ఉపయోగించే ఈ జెల్ కూడా అందుబాటులోకి తేవడం వల్ల మన రక్షణకు మరో కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది” అని డిఎస్ టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.
8, ఏప్రిల్ 2020

కోవిడ్-19కి కారణం అయ్యే నోవెల్ కరోనా వైరస్ ను పట్టుకుని ఇన్ యాక్టివేట్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారుచేసేందుకు ఐఐటి బొంబాయికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో సైన్సెస్, బయో ఇంజనీరింగ్ శాఖకు (డిబిబి) కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు (డిఎస్ టి)  అనుబంధంగా పని చేస్తున్న సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (సెర్బ్) మద్దతు ఇస్తోంది.

కరోనా వైరస్ కు ప్రధాన ప్రవేశ ద్వారంగా భావించే ముక్కు రంధ్రాల్లో అవరోధాలు తొలగించగల సమర్థత ఉన్న జెల్ ను అభివృద్ధి చేయడానికి ఐఐటి బొంబాయికి చెందిన బయోసైన్సెస్, బయో ఇంజనీరింగ్ శాఖ బృందానికి ఈ నిధులు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఇది ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సహాయకారిగా ఉండడమే కాకుండా కోవిడ్-19 కమ్యూనిటీ విస్తరణను కూడా అరికడతాయి. తద్వారా వ్యాధి నిర్మూలనకు సహాయకారి అవుతుంది.

కోవిడ్-19 స్వభావరీత్యా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కావడం వల్ల ఆ వ్యాధి చికిత్సలో పోరాటం సాగిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలాగే వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించకుండా దాన్ని గుర్తించడం సాధ్యం కాని వ్యాధి కావడం, వ్యాధి వ్యాప్తికి అధిక రిస్క్ ఉండడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం.

కోవిడ్-19కి ప్రధాన కారణం అయిన సార్స్-కోవ్-2 వైరస్ ను వ్యాప్తిని పరిమితం చేయడానికి ఈ బృందం రెండంచెల వ్యూహం అనుసరిస్తోంది. వైరస్ లు వాటిని తేలిగ్గా అందుకునే కణాల్లోకి వ్యాపించడాన్ని నివారించడం తొలి వ్యూహం అయితే వైరస్ లు ఎప్పటికీ యాక్టివ్ గానే ఉంటాయి గనుక వాటిని ఇన్ యాక్టివేట్ చేయడం తప్పనిసరి.

అలాగే పట్టుబడిన వైరస్ లను డిటర్జెంట్ల తరహాలో ఇన్ యాక్టివేట్ చేసే బయొలాజికల్ మాలిక్యూళ్ల వైరస్ లలోకి పంపడం రెండో వ్యూహం. ఇది గనుక సిద్ధం అయితే ముక్కు రంధ్రాల్లోకి పంపే జెల్స్ అభివృద్ధి చేయడం సాధ్యం అవుతుంది.

“కోవిడ్ పై ముందుండి పోరాటం జరుపుతున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఇతర సిబ్బందికి 200 శాతం సంపూర్ణ రక్షణ ఎంతో అవసరం. ముక్కు ద్వారా ఉపయోగించే ఈ జెల్ ను కూడా ఇతర రక్షణ విధానాలతో పాటుగా ఉపయోగించడం వల్ల వారి రక్షణలో మరో ఆయుధం అందినట్టవుతుంది” అని డిఎస్ టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.

బొంబాయి ఐఐటికి చెందిన బయో సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ కిరణ్ కొండాబగిల్, ప్రొఫెసర్ రింటీ బెనర్జీ, ప్రొఫెసర్ అశుతోష్ కుమార్, ప్రొఫెసర్ షమిక్ సేన్ ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటారు. ఈ బృందానికి వైరాలజీ, స్ర్టక్చరల్ బయాలజీ, బయోఫిజిక్స్, బయో మెటీరియల్స్, డ్రగ్ డెలివరీలో నైపుణ్యాలున్నాయి. వారు కృషి చేస్తున్న టెక్నాలజీ 9 నెలల్లో అందుబాటులోకి వస్తుంది.
  

(మరింత సమాచారానికి సంప్రదించండి. Prof. Kiran Kondabagil, kirankondabagil@iitb.ac.in, Mob: 9619739630.)(Release ID: 1612225) Visitor Counter : 137