జౌళి మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో జనపనార మిల్లులు మూసివేయడం వల్ల ఎదురైన ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ సంక్షోభం నుంచి బయట పడేందుకు హెచ్.డి.పి.ఈ/పి.పి. బ్యాగ్ ల పరిమితిని 1.8 లక్షల బేళ్ళ నుంచి 2.62 లక్షల బేళ్ళకు విస్తరించిన వస్త్ర మంత్రిత్వ శాఖ
జనపనారను ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలకు జనపనార విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ సహకారం అందించడం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన మంత్రిత్వ శాఖ

జనపనార రైతులు మరియు కార్మికుల ప్రయోజనాలు కాపాడే విషయంలో మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది

Posted On: 07 APR 2020 7:40PM by PIB Hyderabad

వస్త్ర మంత్రిత్వ శాఖ గరిష్టంగా అనుమతించ దగిన పరిమితికి మించి 2020 మార్చి 26న 1.80 లక్షల బేళ్ళకు అదే విధంగా 2020 ఏప్రిల్ 6న 0,82 లక్షల బేళ్ళకు వెరసి మొత్తం 2.62 లక్షల బేళ్ళ హెచ్.డి.పి.ఈ/పి.పి. బ్యాగ్ లకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ -19 నేపథ్యంలో దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ విషయంలో ఉద్భవిస్తున్న సంక్షోభం నుంచి ఉపశమన చర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా జనపనార మిల్లులు మూసివేయడం వల్ల గోధుమ రైతుల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ప్యాకింగ్ అందించడం ద్వారా వారికి సహకారాన్ని అందించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

2020 ఏప్రిల్ మధ్యలో ధాన్యాలు ప్యాకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నందున గోధుమ రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టింది. ఏదేమైనా, లాక్ డౌన్ వ్యవధి ముగిసిన తర్వాత జనపనార మిల్లుల్లో జనపనార సంచుల ఉత్పత్తి పునఃప్రారంభమైనప్పుడు, ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ కోసం జనపనార సంచులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందనే నిబంధనతో ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. లాక్ డౌన్ వ్యవధిలో జనపనార రైతులకు విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ సహాయాలను అందించమని జనపనార ఉత్పత్తి చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు వస్త్ర మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ యాక్ట్ (జెపిఎం), 1987 లోని నిబంధనల ప్రకారం జనపనార రైతులు మరియు కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది జనపనార సంచులలో ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ కోసం నూరు శాతం  శాతం ప్రయోజనాలను అందిస్తుంది.

కోవిడ్ -19 నేపథ్యంలో ఏర్పడిన లాక్ డౌన్ జనపనార మిల్లుల్ని ప్రభావితం చేసింది. తద్వారా జనపనార సంచుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.  పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (పి.డి.ఎస్)లో నిమగ్నమై ఉన్న స్టేట్ ప్రొక్యూర్ మెంట్ ఏజన్సీలు (ఎస్.పి.ఏ) మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) అవసరాలను తీర్చగలిగే స్థితిలో జనపనార మిల్లర్లు లేనందున, ప్రభుత్వం ముందుగానే ఈ చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ లో ఇబ్బందులు అధిగమించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసింది.

రబీ కోతల నేపథ్యంలో రైతులు మరియు వారి ఉత్పత్తుల పై ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో భారీ పరిమాణంలో ప్యాకేజింగ్ సంచులు అవసరం. ఆహార ధాన్యాలు ప్రధానంగా జె.పి.ఎం. చట్టు ప్రకారం జనపనార సంచుల్లో ప్యాక్ చేయబడతాయి. కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా జనపనార మిల్లులు అవసరమైన స్థాయిలో సంచులను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. అందువల్ల గోధుమ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనివార్యం.(Release ID: 1612097) Visitor Counter : 133