రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కరోనా వైరస్(కొవిడ్-19)పై పోరాటానికి తన సహకారాన్ని కొనసాగించనున్న భారతీయ వాయుసేన.

Posted On: 07 APR 2020 6:29PM by PIB Hyderabad

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వైద్య సంబంధిత వస్తువుల ఏజెన్సీలు కరోనా వైరస్(కొవిడ్-19) కొరకు సరఫరా చేస్తున్న వివిధ మందులు, వైద్యపరికరాలను సరియైన సమయంలో సమర్థవంతంగా అందేటట్లు చేయండంలో భారతీయ వాయు సేన తన వంతు సహాయాన్ని కొనసాగిస్తున్నది.

గత కొన్ని రోజులుగా అత్యవసరమైన మందులు మరియ వస్తువులను  ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలైన  మణిపూర్, నాగాలాండక మరియు నాగాలాండ్ మరియు గాంగ్టాక్ వంటి సుదూర ప్రాంతాలకు, జమ్ము మరియు కాశ్మీర్ మరియు లఢక్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు  భారతీయ వాయు సేన తన విమానాల ద్వారా తరలిస్తున్నది.  06 ఏప్రిల్ 2020న  ఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్ ఐసిఎంఆర్ సిబ్బందిని మరియు 3500కిలోల వైద్య ఉపకరణాలను  చెన్నై నుండి భువనేశ్వర్కు ఒడిషా రాష్ట్రంలో కరోనా పరీక్షాశాలల ఏర్పాటుకోసం వాయు మార్గాన తరలించింది.

భారతీయ వాయు సేన ప్రత్యేకించి కొవిడ్-19పై పోరాటం కోసం వైద్య సంబంధిత ఉపకరాణాలు, ఔషధాలను  దూరప్రాంతాలకు త్వరితంగా చేరవేయడం కోసం ఆయా ప్రాంతాల్లో తన విమానాలను కేటాయించింది.



(Release ID: 1612090) Visitor Counter : 177