రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఔష‌ధి ప‌రియోజ‌న (పిఎంబిజెపి) కింద పేషెంట్లు, వ‌యోధికుల‌కు మందులు, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను ఇంటివ‌ద్దే అంద‌జేస్తున్న స్వాస్థ్ కే సిపాహి

Posted On: 07 APR 2020 4:24PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఔష‌ధి  కేంద్రాల‌కు చెందిన‌,  స్వాస్థ్‌కే సిపాహి గా పిలుచుకునే  ఫార్మ‌సిస్టులు పేషెంట్లు, వ‌యోధికుల‌కు భార‌త ప్ర‌భుత్వానికి  చెందిన‌, ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఔష‌ధి ప‌రియోజ‌న (పిఎంబిజెపి) కింద ఇంటివ‌ద్ద‌కే మందులు , అత్య‌వ‌స‌ర సేవ‌లు అందిస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి జ‌న ఔష‌ధి కేంద్రాల (పిఎంజెఎకె) ల‌లో భాగంగా వారు అందుబాటు ద‌ర‌ల‌లో నాణ్య‌మైన జ‌న‌రిక్ మంందుల‌ను , అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను దేశ ప్ర‌జ‌ల‌కు, వ‌యోధికుల‌కు వారి ఇంటివ‌ద్ద‌కే చేరవేస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా వారు ఈ ప‌నిచేస్తున్నారు. ప్ర‌భుత్వం సూచించిన సామాజిక దూరం పాటించే కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తునిస్తూ వారు ఈ ప‌నిచేస్తున్నారు.
 భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ర‌సాయ‌నాలు, ఎరువుల మంత్రిత్వ‌శాఖ కింద గ‌ల డిపార్టెమంట్ ఆఫ్ ఫార్మాసూటిక‌ల్స్‌కు చెందిన పిఎంజెకెలు బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్‌యు ఆఫ్ ఇండియా (బిపిపి) కింద పిఎంజెకెలు ప‌నిచేస్తున్నాయి. వీటి ల‌క్ష్యం, నాణ్య‌మైన‌,ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను అందుబాటుధ‌ర‌లో ఎవ‌రికైనా అందుబాటులో ఉండేట్టు  చూడ‌డం. ప్ర‌స్తుతం 6300కు పైగా పిఎంజెఎకెలు దేశ‌వ్యాప్తంగా 726 జిల్లాల‌లో ప‌నిచేస్తున్నాయి.
 క‌రోనావైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు భార‌త‌ప్ర‌భుత్వం 2020 ఏప్రిల్ 14 వ‌ర‌కు 21 రోజుల లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది.
ఇలాంటి ప‌రిస్థితుల‌లో అన్ని పిఎంజెఎకెలు అత్య‌వ‌స‌ర మందులను అందుబాటులో ఉంచి వాటిని వారి ఇళ్ల వ‌ద్దే అందించే ఏర్పాటు చేస్తున్నాయి. బిపిపిఐ తెలిపిన‌ట్టుగా, ఇటీవ‌ల ఒక స్వాస్థ్ కే సిపాహి త‌మ అనుభ‌వాన‌లు పంచుకున్నారు. ఒక వ‌యోధికురాలైన మ‌హిళ వార‌ణాసి,ప‌హాడియాలోని పిఎంబిజెకె కు ఫోన్ చేసి స‌హాయం కోరిన‌ట్టు తెలిపారు.ఆ ఫార్మ‌సిస్టు చెప్పిన దాని ప్ర‌కారం , ఆ మ‌హిళ భ‌ర్త‌తో క‌లిసి వార‌ణాసిలో ఉంటోంది. వారి వ‌ద్ద రోజువారీ మందులు అయిపోయాయి. త‌న ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు రోజువారీ వాడాల్సిన మందులు త‌ప్ప‌క‌ అవ‌స‌రం. ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఫార్మ‌సిస్టు వారికి స‌హాయం చేయ‌కుండా ఉండ‌లేక‌పోయారు. అత‌ను మందులు తీసుకుని వారి ఇంటివ‌ద్ద‌కు చేర్చారు. అప్ప‌టి నుంచి మ‌న ఫార్మ‌సిస్టులు మందుల‌ను అనారోగ్యానికి గురైన వారు, వ‌యోధికుల‌కు ఇంటివ‌ద్ద‌కే వెళ్లి అంద‌జేస్తున్నారు.
గురుగ్రామ్‌లోని ఒక కేంద్ర గిడ్డంగి, గువహతి , చెన్నైలోని రెండు ప్రాంతీయ గిడ్డంగులు , 50 మంది పంపిణీదారులు దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలకు మందులు మిగులు  సరఫరా ఉండేలా కృషి చేస్తున్నారు.
ఔషధాల సరఫరాను నియంత్రించడానికి, ఏదైనా  స్టాక్ అయిపోయే పరిస్థితిని నివారించడానికి బలమైన ఎస్ ఎ పిఆధారిత ఎండ్ టు ఎండ్ పాయింట్ ఆఫ్ సేల్స్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు.   జ‌న్ ఔష‌ధి స‌మీప కేంద్రాన్ని సాధార‌ణ ప్ర‌జ‌లు గుర్తించ‌డానికి , అలాగే అందులోని మందులు, వాటి ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌డానికి “జ‌న్ ఔష‌ధి సుగం” మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులో. ఉంది. దీనిని  గూగుల్ ప్లే స్టోర్ , ఐ-ఫోన్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ‌న జ‌నౌష‌ధి ప‌రియోజ‌న (పిఎంబిజెపి) సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ఇందుకు స‌మాచారం అంద‌జేస్తున్నారు. ఇది ప్ర‌జ‌లను క‌రోనా వైర‌స్ నుంచి కాపాడ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఫేస్ బుక్ , ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో @pmbjpbppi ఫాలో కావ‌డం ద్వారా తాజాస‌మాచారం తెలుసుకోవ‌చ్చు(Release ID: 1612053) Visitor Counter : 275