మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యార్థుల విద్యాసంవత్సర ప్రయోజనాలు కాపాడాలన్న కేంద్ర హెచ్ఆర్డి మంత్రి సలహా మేరకు ఆన్లైన్ బోధన-అభ్యాస ప్రక్రియకు చర్యలు చేపట్టిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్
Posted On:
05 APR 2020 7:36PM by PIB Hyderabad
కోవిడ్-19 ముప్పు తో లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడడానికి, వారి విద్యాసంవత్సరానికి ఎటువంటి భంగం కలగకుండా ఉండడానికి తగు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పొక్రియాల్ నిషాంక్ ఆ శాఖ పరిథిలో ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి గల విద్యాసంస్థల అధిపతులను ఆదేశించారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వివిధ ఆన్ లైన్, డిజిటల్ విధానాలతో విద్యాభ్యాసానికి చొరవ తీసుకుంది. విద్యార్థుల చెంతకు బోధన చేరేలా తమకున్న అన్ని వనరులను ఉపయోగించాలని ప్రాంతీయకార్యాలయాలకు సంఘటన్ సూచనలు ఇచ్చింది.
కేవీఎస్ ఉపాధ్యాయుల చొరవ :
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ విపత్కర పరిస్థితులకు స్పందించి తమ వంతు చొరవను చూపడానికి బాధ్యతాయుతంగా ముందుకు వచ్చారు. నాణ్యమైన బోధనా కాలాన్ని కోల్పోతున్నామన్న భావనను దూరం చేసి, విద్యార్థులకు డిజిటల్ వేదికల ద్వారా బోధన చేసే చర్యలు చేపట్టారు.
డిజిటల్ విధానంలో విద్యార్థులను బోధనా చట్రంలో ఉంచడానికి సంబంధిత ప్రిన్సిపాళ్లకు కేవీఎస్ కొన్ని కార్యాచరణ సూచనలు చేసింది. ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించేలా అవసరమైన ఒక బోధనా పద్ధతిని కూడా రూపొందించారు.
ఎన్ఐఓఎస్ వేదికగా బోధన :
ఎన్ఐఓఎస్ వేదికగా రికార్డెడ్, లైవ్ పాఠాల షెడ్యూల్ ని కేవీఎస్ రూపొందించింది. ఆ పాఠాలను ప్రాథమిక, సీనియర్ సెకండరీ తరగతుల వారికి స్వయంప్రభ పోర్టల్ ద్వారా ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభిస్తారు. సంబంధిత విద్యాలయాలకు ఈ సమాచారాన్ని పంపించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు విస్తృతంగా తెలియజేసే కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు వివిధ మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉండాలని సూచనలు వెళ్లాయి.
లైవ్ బోధనకు టీచర్ల నామినేషన్:
కొంతమంది ఎంపిక చేసిన ఉపాధ్యాయులను ఎన్ఐఓఎస్- స్వయంప్రభ పోర్టల్ ద్వారా నిర్వహించే లైవ్ బోధనా కార్యక్రమాలకు నామినేట్ చేసారు. బోధకులకు వచ్చే అనుమానాలు, ప్రశ్నలకు వీరు సమాధానము చెప్పేలా అందుబాటులో ఉంటారు. ఈ జాబితాని ఆర్.ఓ లకు పంపారు. ఈ నామినేటెడ్ ఉపాధ్యాయులు ఉదయం సమయంలో లైవ్ ప్రసారం ద్వారా బోధన చేయాల్సిన అంశాలను రూపొందించి ఏ రోజుకారోజు విద్యార్థుల సందేహాలను నివృతి చేస్తారు. ఒకవేళ సందేహాలేమి లేకపోతే బోధనాంశాలను తిరిగి చెబుతూ ప్రెజెంటేషన్ ద్వారా కానీ, వివిధ బోధన ఉపకరణాల ద్వారా కానీ వివరించే ప్రయత్నం చేస్తారు.
వివిధ వనరుల వినియోగం:
ఎన్ఐఓఎస్, ఎన్ సి ఈ ఆర్ టి ఆన్‌లైన్ పాఠాలతో పాటు టీవీ ప్రసారాల ద్వారా కూడా బోధన చేసే ఏర్పాట్లు చేసారు. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
1. మ్యాసివ్ ఓపెన్ ఆన్-లైన్ కోర్సు (ఎంఓఓసిఎస్): https://swayam.gov.in/nc_details/NIOS
2 ఉచితంగా డిటిహెచ్ ఛానెల్ ద్వారా ప్రసారం:DTH ఛానల్ నం. 27 (పాణిని)
https://www.swayamprabha.gov.in/index.php/program/current/27(సెకండరీ)
డిటిహెచ్ ఛానల్ నం. 28 (శారదా) https://www.swayamprabha.gov.in/index.php/channel_profile/profile/28 (సీనియర్ సెకండరీ)
3.యూట్యూబ్ ఛానెల్స్: https: //www.youtube.com/channel/UC1we0IrHSKyC7f30wE50_hQ (సెకండరీ )
https://www.youtube.com/channel/UC6R9rI-1iEsPCPmvzlunKDg (సీనియర్ సెకండరీ)
4. కిషోర్ మంచ్: స్వయంప్రభా ఛానెల్ నెంబర్ 31 కింద ఎన్ సి ఈ ఆర్ టి 24 X 7 డిటిహెచ్ ఛానల్. IX - XII తరగతులకు
వీటితో పాటు NROER, DIKSHA, SWAYAM PRABHA, NPTEL, e-pathshaala, వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఉచిత ఇ-రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి.
*****
(Release ID: 1611513)
Visitor Counter : 158