వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆహార ధాన్య సరఫరాలను పెంచనున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

మార్చి 24న లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 352 రైలు సరుకు రవాణా బోగీల్లో 9.86 లక్షల మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను మోసుకెళ్ళాయి, ఈ ఒక్క రోజే 53 సరుకు రవాణా బోగీలు లోడయ్యాయి

Posted On: 05 APR 2020 7:06PM by PIB Hyderabad

లాక్ డౌన్ సమయంలోనూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) దేశవ్యాప్తంగా గోధుమలు, బియ్యం సరఫరాను నిరంతరాయంగా జరిగేలా చూస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఏ) కింద ప్రతి లబ్ధి దారుడికి నెలకు 5 కేజీల ఆహార ధాన్యం అవసరాన్ని తీర్చడానికి ఎఫ్.సి.ఐ. పూర్తిగా సిద్ధంగా ఉంది. దీనితో పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 81.35 కోట్ల మందికి వచ్చే 3 నెలల వరకూ ఒక్కొక్కరికీ 5 కిలోల ఆహార ధాన్యం సరఫరా అదనపు డిమాండ్ తీర్చేందుకు కూడా సిద్ధంగా ఉంది.2020 మార్చి 31 నాటికి 56.75 మిలియన్ల మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలకు కలిగి ఉంది. ఇందులో 30.7 మిలియన్ మిలియన్ టన్నుల బియ్యం, 26.06 మిలియన్ మిలియన్ టన్నుల గోధుమలను కలిగి ఉంది.

అనేక సవాళ్ళతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా గోధుమలు మరియు బియ్యం సరఫరా వేగాన్ని పెంచడం ద్వారా ఆహారధాన్యాల విషయంలో పెరుగుతున్న డిమాండ్ ను తీర్చే సామర్థ్యాన్ని ఎఫ్.సి.ఐ. తీర్చగలదు. ఈ రోజు మొత్తం రోజే 53 సరుకు రవాణా బోగీలు లోడయ్యాయిఅంటే 2020 ఏప్రిల్ 1 నాటికి సుమారు 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం నిల్వ ఉంది. లౌక్ డౌన్ చేసిన నాటి నుంచి అంటే 2020 మార్చి 24 నాటికి ఎఫ్.సి.ఐ. సుమారుగా 9.86 లక్షల మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు గల 352 సరకు రవాణా బోగీలను తరలించింది.

మార్కెట్లో సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఎంపిక చేయబడిన రోలర్ పిండి మిల్లులు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి గోధుమలను అందించడానికి ఎఫ్.సి.ఐ. ఓపెన్ మార్కెట్ సేల్స్ స్క్రీమ్ (ఓ.ఎం.ఎస్.ఎస్) కింద ఈ – వేలం నిర్వహిస్తోంది. 2020 మార్చి 31న జరిగిన చివరి ఈ –వేలంలో 1.44 లక్షల మిలియన్ టన్నుల గోధుమలకు బిడ్లు వచ్చాయి.

కోవిడ్ -19 వ్యాప్తి దృష్ట్యా సాధారణ ఈ-వేలం కాకుండా రోలర్ పిండి మిల్లులు మరియు ఇతర గోధుమ ఉత్పత్తుల తయారీ అవసరాలను తీర్చడానికి జిల్లా న్యాయాధికారులు లేదా కలెక్టర్లు ఓ.ఎం.ఎస్.ఎస్. రిజర్వు ధర వద్ద నేరుగా ఎఫ్.సి.ఐ. డిపోల నుంచి సరఫరా చేయడానికి అధికారం పొందారు. ఇప్పటి వరకు, ఈ మార్గం ద్వారా ఈ క్రింది రాష్ట్రాల్లో 79,027 మెట్రిల్ టన్నుల గోధుమలను కేటాయించారు.

క్రమ సంఖ్య

రాష్ట్రం

పరిమాణం (మిలియన్ టన్నుల్లో)

i

ఉత్తర ప్రదేశ్

35675

ii

బీహార్

22870

iii

హిమాచల్ ప్రదేశ్

11500

iv

హర్యానా

4190

v

పంజాబ్

2975

vi

గోవా

1100

vii

ఉత్తరాఖండ్

375

viii

రాజస్థాన్

342

 

 

బియ్యం కోసం ఈ-వేలం నిర్వహించారు. గతం ఈ-వేలంలో 77,000 మెట్రిక్ టన్నుల బిడ్లు తెలంగా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకోబడ్డాయి.

దీంతో పాటు, అత్యవసర పరిస్థితిని పరిశీలిస్తే, ఓ.ఎం.ఎస్.ఎస్. కింద  బియ్యం తీసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వబడింది. ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కేటాయింపునకు మించిన అవసరాలను తీర్చేందుకు ఈ-వేలంలో లేకుండా కేజీకి రూ. 22.50 చొప్పున పి.ఎం. గరీబ్ కళ్యాణ్ యోజన కోసం అదనపు కేటాయింపులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 93,387 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వారి అభ్యర్థనల ప్రకారం ఈ క్రింది 6 రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది.

క్రమ సంఖ్య

రాష్ట్రం

పరిమాణం (మిలియన్ టన్నుల్లో)

i

తెలంగాణ

50000

ii

అస్సాం

16160

Iii

మేఘాలయ

11727

Iv

మణిపూర్

10000

V

గోవా

4500

Vi

అరుణాచల్ ప్రదేశ్

1000


(Release ID: 1611458) Visitor Counter : 180