మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారికి సంబంధించిన వివిధ సంస్థలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు/ వివిధ శాఖలు కొవిడ్-19పై పోరాటానికై ప్రధానమంత్రి కేర్స్ నిధికి రు.38.91 కోట్లకు పైగా విరాళం అందజేత

కొవిడ్-19పై చేస్తున్న పోరాటానికి సహకరిస్తున్న వీరి కృషిని ప్రసంశించిన మానవాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిషాంక్’

Posted On: 05 APR 2020 5:48PM by PIB Hyderabad

మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారికి సంబంధించిన 28 సంస్థలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు/ వివిధ శాఖలు కొవిడ్-19పై పోరాటానికై ప్రధానమంత్రి  కేర్స్ నిధికి  రు.38.91 కోట్లకు పైగా విరాళం అందజేసాయి.  కొవిడ్- 19పై భారత్ చేస్తున్న పోరాటానికి తమ వంతు సహాయంగా విరాళాలు అందజేసిన వారిని మానవాభివృద్ధి  శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ’నిషాంక్’ ప్రసంశించారు. మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ కొవిడ్-19పై పోరాటానికి పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.

కాగా, కేంద్ర మానవాభివృద్ధి శాఖ మంత్రి తన ఒక నెల జీతాన్ని మరియు ఎంపిలాడ్స్ నుండి ఒక కోటి రూపాయలను ప్రధానమంత్రి కేర్స్ నిధికి విరాళంగా ప్రకటించారు మరియు అలాగే తమ పరిధిలోని అన్నివిభాగాలను తమ వంతు విరాళాన్ని అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేసారు.

వివిధ శాఖలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు అందజేసిన విరాళాల వివరాల కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.



(Release ID: 1611415) Visitor Counter : 135