పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 161 టన్నుల సరకు రవాణా చేసిన లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు
లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజూ లైఫ్‌లైన్ ఉడాన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు
Posted On:
05 APR 2020 4:51PM by PIB Hyderabad
లైఫ్‌లైన్ ఉడాన్ కింద 116 విమానాలను ఎయిర్ ఇండియా, అలయెన్స్ ఎయిర్, ఐఎఫ్, పవన్ హన్స్, ప్రైవేటు విమానయాన సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇందులో 79 విమానాలను ఎయిర్ ఇండియా , అలయెన్స్ ఎయిర్ నడిపాయి. ఇప్పటివరకు రవాణా చేసిన సరకు 161 టన్నులు. లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు తిరిగిన గగనతల దూరం 1,12,178 కిలోమీటర్లు. అంతర్జాతీయగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్ ఇండియాలు కీలక మందుల సరఫరాకు సంబంధించి ఇండియా- చైనాల మధ్య కార్గో ఎయిర్ బ్రిడ్జి ఏర్పాటుకు చైనాతో సన్నిహితంగా కలసి పనిచేశాయి. ఇండియా,చైనాల మధ్య తొలి కార్గో విమానాన్ని 2020 ఏప్రిల్ 4న నడిపారు. ఇది 21 టన్నుల కీలక మందులను చైనాకు సరఫరా చేసింది.
లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలను పౌరవిమానయాన మంత్రిత్వశాఖ , కోవిడ్ -19 పై పోరులో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్యపరమైన సరకుల రవాణాకు నడుపుతోంది.
లైఫ్‌లైన్ ఉడాన్ విమానాల సరకు చేరవేతకు సంబంధించిని వివరాలు కింది విధంగా ఉన్నాయి.
---------------
(TABLE))
నెం తేది ఎయిర్ ఇండియా అలయెన్ప్ ఐఎఎఫ్ ఇండిగో స్పైస్‌జెట్ మొత్తం
-----------
నెం
|
తేది
|
ఇండియా
|
అలయెన్ప్
|
ఐఎఎఫ్
|
ఇండిగో
|
స్పైస్‌జెట్
|
మొత్తం
|
1
|
26.3.2020
|
2
|
-
|
-
|
-
|
2
|
4
|
2
|
27.3.2020
|
4
|
9
|
-
|
-
|
-
|
13
|
3
|
28.3.2020
|
4
|
8
|
-
|
6
|
-
|
18
|
4
|
29.3.2020
|
4
|
10
|
6
|
-
|
-
|
20
|
5
|
30.3.2020
|
4
|
-
|
3
|
-
|
-
|
7
|
6
|
31.3.2020
|
9
|
2
|
1
|
-
|
-
|
12
|
7
|
01.4.2020
|
3
|
3
|
4
|
-
|
-
|
10
|
8
|
02.4.2020
|
4
|
5
|
3
|
-
|
-
|
12
|
9
|
03.4.2020
|
8
|
-
|
2
|
-
|
-
|
10
|
10
|
04.4.2020
|
4
|
3
|
2
|
-
|
-
|
9
|
మొత్తం
|
46
|
40
|
22
|
6
|
2
|
116
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఈశాన్య ప్రాంతం,కొండప్రాంత రాష్ట్రాలు, దీవులపై ప్రత్యేక దృష్టిపెట్టడం జరిగింది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఐఎఎఫ్‌లు పరస్పరం సన్నిహిత సమన్యయంతో లద్దాక్, దిమాపూర్, ఇంఫాల్, గౌహతి, పోర్ట్ బ్లయిర్‌లలోని చిట్టచివరి ప్రాంతం వరకు సరకులు అందించేందుకు చర్యలు తీసుకున్నాయి.
ఈ సరకు రవాణాలో ఎక్కువ భాగం తేలిక బరువు కలిగిన మాస్క్‌లు, గ్లోవ్‌లు, ఇతరాలు ఉన్నాయి. ఇవి టన్నుకు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. పాసింజర్ సీట్ల ప్రాంతంలో, ఓవర్ హెడ్ కాబిన్‌లలో కూడా తగిన జాగ్రత్తలతో కార్గోను తీసుకువెళ్ళేందుకు అనుమతి తీసుకున్నారు. విమానాశ్రయాలనుంచి , విమానాశ్రయాలకు సరకు రవాణాలో పలు సవాళ్లు ఉన్నప్పటికీ అలాగే కార్గోను రోడ్డు మార్గంలో సరఫరాకు పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్పత్తి పరమైన ఇబ్బందులు, విమానయాన సిబ్బంది తరలింపు వంటి వాటిని అధిగమించి వీటిని నడుపుతున్నారు.
లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలకు సంబంధించిన ప్రజా సమాచారాన్ని లైఫ్ లైన్ ఉడాన్ వెబ్‌సైట్ లో రోజూ అప్ లోడ్ చేస్తున్నారు. లైఫ్ లైన్ ఉడాన్ విమానాలను సమన్వయం చేసేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ ఐసి),పౌరవిమానయాన మంత్రిత్వశాఖలు ఒక పోర్టల్ ను అభివృద్ధి చేశాయి. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ( website www.civilaviation.gov.in)లో లైఫ్‌లైన్ ఉడాన్‌కు సంబంధించిన లింక్ అందుబాటులో ఉంది.
దేశీయ కార్గో ఆపరేటర్లైన స్పైస్ జెట్, బ్లూ డార్ట్, ఇండిగో లు వాణిజ్యపరంగా కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్ జెట్ 24 మార్చి 2020 నుంచి 4 ఏప్రిల్ 2020 వరకు స్పైస్ జెట్ 166 కార్గో విమానాలు నడుపుతోంది. ఇందులో 46 అంతర్జాతీయ కార్గో విమానాలు. బ్లూ డార్ట్ 52 దేశీయ కార్గో విమానాలు సుమారు 50,086 కిలోమీటర్ల దూరం 761 టన్నులను 25 మార్చి 2020 నుంచి 4 ఏప్రిల్ 2020 వరకు నడిపింది. ఇండిగో 2020 ఏప్రిల్ 3-4 తేదీలలో 8 కార్గో విమానాలను 6,103 కిలోమీటర్ల దూరం నడిపి 3 టన్నుల సరకు చేరేవేసింది. ఇందులో వైద్య సరఫరాలను ప్రభుత్వం కోసం ఉచితంగా రవాణా చేసినది కూడా ఉంది.
(Release ID: 1611383)
Visitor Counter : 187
Read this release in:
Marathi
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada