రైల్వే మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో సామాన్య ప్రజల వినియోగం కోసం చక్కెర, ఉప్పు మరియు వంట నూనెలను సరఫరా చేయడానికి హామీ ఇచ్చిన భారతీయ రైల్వే

23 మార్చి నుండి 4 ఏప్రిల్ 2020 వరకు 1342 వాగన్ల చక్కెర, 958 వాగన్ల ఉప్పు మరియు378 వాగన్ల/టాంకుల వంట నూనెలను రవాణా చేసిన భారతీయ రైల్వే

Posted On: 05 APR 2020 3:27PM by PIB Hyderabad

కొవిడ్ -19 లాక్డౌన్ సమయంలో సామన్య ప్రజానీకానికి చక్కెర, ఉప్పు మరియు వంట నూనెల సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారతీయ రైల్వే హామీ ఇచ్చింది. ఈ సమయంలో  అత్యవసర వస్తువులను వాగన్లలోనికి ఎక్కించడం, రవాణా మరియు దించడం వంటి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి.

గత 13 రోజులుగా, 23 మార్చి  నుండి 4 ఏప్రిల్ 2020  వరకు భారతీయ రైల్వే వరకు 1342 వాగన్ల చక్కెర, 958 వాగన్ల ఉప్పు మరియు378 వాగన్ల/టాంకుల(1 వాగన్ 58-60 టన్నుల సరుకు కలిగి ఉంటుంది) వంట నూనెలను రవాణా చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

క్ర.సం.

తేది

చక్కెర వాగన్ల సంఖ్య

ఉప్పు వాగన్ల సంఖ్య

వంట నూనెల వాగన్ల సంఖ్య

1.

23.03.2020

42

168

-

2.

24.03.2020

-

168

50

3.

25.03.2020

42

42

-

4.

26.03.2020

42

42

-

5.

27.03.2020

42

42

-

6.

28.03.2020

126

42

50

7.

29.03.2020

210

42

42

8.

30.03.2020

252

8

-

9.

31.03.2020

293

84

-

10.

01.04.2020

210

-

-

11.

02.04.2020

-

133

64

12.

03.04.2020

41

103

122

13.

04.04.2020

42

84

50

 

మొత్తం

1342

958

378

సరుకు రవాణా, ఎక్కించడం, దించడం వంటి కార్యక్రమాలను అధికారు చాలా సునిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సరుకు ఎక్కించడం, దించడంలో కొన్ని చోట్ల ఎదుర్కొన్న సమస్యలను భారతీయ రైల్వే సమర్థవంతంగా పరిష్కరించింది. ఈ సరుకుల సరఫరాలో ఏదైన సమస్యలు వచ్చినట్లైతే వెంటనే పరిష్కరించడానికి భారతీయ రైల్వే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తగిన కృషి చేస్తున్నది.



(Release ID: 1611342) Visitor Counter : 202