రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వైద్యరంగానికి సంబంధించని సిబ్బంది కోసం శిక్షణను తయారు చేసిన దక్షిణ నావికాదళం

Posted On: 04 APR 2020 7:37PM by PIB Hyderabad

కొవిడ్ -19పై  క్షేత్రస్థాయిలో పనిచేసే   దక్షిణ నావికాదళం ప్రాథమిక బృందం  యుద్ధ రంగ పరిచర్య సహాయకుల(బాటిల్ ఫీల్డ్ నర్సింగ్ అసిస్టెంట్స్(బిఎఫ్ఎన్ఏ)) కోసం శిక్షణను తయారు చేసింది, వైద్యరంగానికి చెందని ఈ సిబ్బంది అత్యవసర సమయంలో తమ సహాయ సహకారాలను అందిస్తారు.

ఈ ప్రాథమిక బృందంలో నావికాదళ వైద్య అధికారి,  ఐఎన్ఎస్ వెందురుతి మరియు ఐఎన్హెచ్ఎస్ సంజీవని కమాండింగ్ అధికారులు మరియు దళ శిక్షణాధికారులు ఈ బిఎఫ్ఎన్ఏ కార్యక్రమాన్ని ఈ చిన్న కార్యక్రమాన్ని రూపొందించి ఉపయోగించుకుంటున్నారు.

ప్రాథమిక భావనలైన చేతుల పరిశుభ్రత, పిపిఇని  తొలగించడం, జీవవైద్య వ్యర్థాల నిర్వహణ మరియు క్యాజువాలిటీ నిర్వహణ వంటివి ఈ సిబ్బంది నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అంటువ్యాధిని నివారించే మార్గాలను కూడా తెలియపరుస్తారు.

అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు వీలుగా వైద్యరంగానికి చెందని సబ్బందికి తగిన శిక్షణ ఇచ్చే కార్యర్రమం దక్షిణ నావికాదళం అన్ని విభాగాల్లోనూ చురుకుగాసాగుతోంది. ఇప్పటి వరకు దక్షిణ నావికాదళంలో 333 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో శిక్షణ పొందారు.



(Release ID: 1611220) Visitor Counter : 142