శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 నియంత్ర‌ణకు త‌క్కువ ధ‌రలో వైరుసిడ‌ల్ శస్త్రచికిత్స మాస్క్‌లు..

- ఈ దిశ‌గా ప‌రిశోధ‌న‌లు చేస్తున్న ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల బృందం
- తోడ్పాటును అందిస్తున్న కేంద్ర శాస్ర్త‌,సాంకేతిక శాఖకు చెందిన సెర్బ్‌

Posted On: 04 APR 2020 5:14PM by PIB Hyderabad

 కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఉప‌యుక్తంగా ఉండేలా ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తల బృందం మేటి రక్షణ పూత క‌లిగిన (పీపీఈ) వైరుసిడ‌ల్ శస్త్రచికిత్స మాస్క్‌ల‌ను త‌క్కువ ధ‌ర‌లోనే అందుబాటులోకి తెచ్చే ప్ర‌య‌త్నాల‌కు శ్రీ‌కారం చుట్టింది. త‌క్కువ ధ‌ర‌కే పీపీఈ మాస్క్‌లు, వైద్య దుస్తుల‌ను అందుబాటులోకి తెచ్చేలా ఈ శాస్త్రవేత్తల బృందం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు కేంద్ర శాస్ర్త‌, సాంకేతిక శాఖ నేతృత్వంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (సెర్బ్‌) తోడ్పాటు అందిస్తోంది. యాంటీ-సూక్ష్మజీవుల లక్షణాలను కలిగిన సాధారణ పాలిమర్ల‌తో పాటు మేటి యాంటీ-వైరల్ అణువులు క‌లిగిన ప‌దార్థాల క‌ల‌యిక‌తో ర‌క్ష‌ణ పూత‌ను త‌యారు చేసి పీపీఈ మాస్క్‌ల‌తో పాటు ఇత‌ర‌ వైద్య దుస్తుల‌ను త‌యారు చేసేలా ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. వీటిని కూడా త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి తెచ్చేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. కోవిడ్ నియంత్ర‌ణ‌కు పోరాడుతున్న వైద్యులు, నర్సులు త‌మ త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా కొన్నికొన్నిసారు వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్పుడు అద‌న‌పు భ‌ద్ర‌త పూత‌తో అందుబాటులోకి తేనున్న ఇలాంటి మాస్క్లు వారికి మరింత భ‌ద్ర‌త‌ను క‌లిగించే అవ‌కాశం ఉంది. త‌క్కువ ధ‌ర‌కు ఇవి అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో వీటిని ప్ర‌జ‌ల భ‌ద్ర‌త నిమిత్తం రానున్న రోజుల్లో వీటిని భారీస్థాయిలో ఉత్ప‌త్తి చేసేందుకూ వీలుప‌డ‌నుంది. ఈ వైరుసిడల్ పూత క‌లిగిన మాస్క్‌లు, ఇత‌ర వైద్య దుస్తులు బ్యాక్టీరియా, వైరస్‌లు అంటుకోకుండా ఉంటాయి. సూక్ష్మజీవుల వ్య‌తిరేక లక్షణాలను కలిగిన సాధారణ పాలిమర్ల‌ను ఇందులో వాడ‌నున్నందున ఇవి క‌రోనా వైర‌స్ తో స‌హా ఇన్‌ప్లూయాంజ వంటి ఇత‌ర వైర‌స్‌ల‌ను అస్థిరపరచడానికి మరియు / లేదా తటస్తప‌రిచి వాటిని ధ‌రించిన వారికి మ‌రింత అదనపు రక్షణను అందించేందుకు వీలుప‌డుతుంది. ఈ ప‌రిశోధ‌క బృందంలో ప్రొఫెస‌ర్ ఎం.ఎల్‌.ఎన్‌.రావుతో పాటు అసోసియేట్ ప్రొఫెస‌ర్లు డాక్ట‌ర్ ఆశీష్ కె పాత్ర, నాగ్మా ప్ర‌వీణ్ త‌దిత‌రులు ఉన్నారు. మూడు నెల‌ల్లో ప్రాథ‌మిక న‌మూనాను అందుబాటులోకి తెచ్చేలా
ఈ బృందం ప‌నిచేస్తోంది. త‌ద‌నంత‌రం రానున్న రోజుల్లో మేటి ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం క‌లిగిన ప‌రిశ్ర‌మలు లేదా అంకుర సంస్థ‌ల వారి భాగ‌స్వామ్యంతో వీటిని భారీస్థాయిలో అందుబాటులో తెచ్చేలా చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ప్ర‌స్తుతం ఎక్కువగా ఉపయోగించే వివిధ రకాల మాస్క్లు వ్యాధికారక మరియు ఏరోసోల్‌లను వడపోత మరియు నిలువ‌రించేందుకు ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని, ఫాబ్రిక్‌పై యాంటీ-సూక్ష్మజీవుల మరియు యాంటీ-వైరల్ పదార్థాలతో కూడిన మాస్క్‌లు క్లిష్టమైన వాతావరణాలలో ప‌ని చేసే వారికి ఎంత‌గానో ఉపయోగపడుతాయ‌ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. జీవిత కాలాన్ని పెంపొందించేందుకు ఇలాంటివి ఎంత‌గానో తోడ్ప‌డుతాయ‌న్నారు. తిరిగి వినియోగించుకునేందుకు, సుర‌క్షితంగా నిర్వ‌హించేందుకు, వాడిన త‌రువాత సుర‌క్షితంగా పారవేయ‌డానికి కూడా ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఇలాంటి మాస్క్‌లు త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులోకి రానున్నందున‌ మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.


(Release ID: 1611167) Visitor Counter : 134