గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో
ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నేతృత్వంలో ఫేస్ మాస్క్‌ల ఉత్పత్తి
132 లక్షలకు పైగా ఫేస్ మాస్క్‌ల్ని తయారు చేసిన ఎస్‌హెచ్‌జీ బృందాలు
Posted On:
04 APR 2020 1:45PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(NRLM) క్రింద దేశంలోని 399 జిల్లాలను కలుపుకొని 24 రాష్ట్రాల్లో స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు ఫెస్ మాస్క్ ల ఉత్పత్తిని ప్రారంభించారు. గడిచిన 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాలలో 4281 స్వయం సహాయక బృందాలలోని 21,028 మంది సభ్యులు 25,41,440 మాస్కులను, తమిళనాడులోని 32 జిల్లాలలో 1927 స్వయం సహాయక బృందాలలోని 10,2780 మంది సభ్యులు 26,01,735 మాస్క్‌లను ఉత్పత్తి చేశారు. దీనికి తోడు బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ర్టాలలోని స్వయం సహాయక బృందాల వారు కూడా మాస్క్ల తయారీని చేపట్టారు. మొత్తం 14,522 స్వయం సహాయక బృందాలకు చెందిన దాదాపు 65,936 మంది సభ్యలు 132 లక్షల మాస్క్‌లను తయారు చేశారు. దేశ అవసరాలకు కావాల్సిన మాస్క్‌ల తయారీలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక,మహారాష్ట్ర, మిజోరాం, నాగాలాండ్, ఒడిషా, పాండిచ్చరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌లకు చెందిన ఎస్‌హెచ్‌జీల సభ్యులు పాలుపంచుకుంటున్నారు.
(Release ID: 1611053)
Visitor Counter : 204
Read this release in:
English
,
Gujarati
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam