హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై పోరులో భాగమైన 21 రోజుల దిగ్బంధం సమయంలో సామాజిక దూరం పాటిస్తూ పంటనూర్పిడి-విత్తనాలు చల్లే పనులు
కొనసాగించాల్సిందిగా రాష్ట్రాలకు దేశీయాంగ శాఖ సూచనపత్రం

Posted On: 03 APR 2020 7:12PM by PIB Hyderabad

 కోవిడ్‌-19పై పోరులో భాగంగా విధించిన 21 రోజుల జాతీయ దిగ్బంధం నుంచి వ్యవసాయ కార్యకలాపాలకు మినహాయింపునిస్తూ దేశీయాంగ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలకూ సూచనపత్రం పంపింది. ఈ మేరకు రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు, టోకు మండీల నిర్వహణ, పంటనూర్పిడి, నాట్లకు వినియోగించే యంత్రాల రాకపోకలు తదితరాలకు మినహాయింపు ఉంటుందని ఈ పత్రంలో పేర్కొంది. అయితే, అన్ని కార్యకలాపాల్లోనూ సామాజిక దూరం నిబంధనను తప్పనిసరిగా పాటించాలని దేశీయాంగ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్‌కుమార్‌ భల్లా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకూ లేఖ రాశారు.

*****(Release ID: 1610918) Visitor Counter : 15