ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 ను ఎదుర్కోవ‌డంలో స‌న్న‌ద్ధ‌త‌ను వ్య‌క్తిగ‌తంగా ప‌రిశీలించేందుకు డాక్ట‌ర్ ఆర్‌.ఎం.ఎల్‌, స‌ఫ్ద‌ర్ జంగ్ ఆస్ప‌త్రుల‌ను సంద‌ర్శించిన కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ రోగుల‌తో మాట్లాడిన మంత్రి

ఆర్ ఎం.ఎల్ లోని ట్రామా కేంద్రం కోవిడ్ -19 ఐసొలేష‌న్ ప్ర‌త్యేక వార్డుగా ప‌నిచేయ‌నుంది.
స‌ఫ్ద‌ర్ జంగ్ ఆస్ప‌త్రిలోని సూప‌ర్ స్పెషాలిటీ బ్లాక్ ను కోవిడ్ -19 ప్ర‌త్యేక మేనేజ్‌మెంట్ సెంట‌ర్‌గా మార్పు

Posted On: 03 APR 2020 4:51PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వర్ధ‌న్ ఏప్రిల్ 3న డాక్ట‌ర్ ఆర్‌.ఎం.ఎల్‌, స‌ఫ్ద‌ర్ జంగ్ ఆస్ప‌త్రుల‌ను వ్య‌క్తిగ‌తంగా సంద‌ర్శించి  కోవిడ్ -19 ని ఎదుర్కోవ‌డంలో స‌న్న‌ద్ధ‌త‌ను పరిశీలించారు.
డాక్టర్ ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి, ఫ్లూ కార్నర్, ఎమర్జెన్సీ కేర్ సెంటర్, ట్రామా సెంటర్ బ్లాక్, కరోనా స్క్రీనింగ్ సెంటర్‌ల‌ను సందర్శించారు. ఈ కేంద్రాల పనితీరును పరిశీలించిన తరువాత, స్క్రీనింగ్ ప్రక్రియ  వేగంగా జ‌రుగుతుండ‌డం ప‌ట్ల‌ ఆరోగ్య మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
 రోజూ భారీ సంఖ్యలో నమూనాలను ప‌రీక్షిస్తున్న‌ మైక్రోబయాలజీ విభాగాన్ని కూడా మంత్రి సందర్శించారు, అక్కడనమూనాలు స్వీకరించే  శాస్త్రీయ పరీక్షల ప్రక్రియను నిశ‌తంగా ప‌రిశీలించారు.  త‌గిన ఇన్ఫెక్షన్ నియంత్ర‌ణ‌ ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నందుకు  డిపార్ట్‌మెంట్‌ను ఆయన ప్రశంసించారు. ఈ ప్రొటోకాల్స్ పాటిస్తున్నందువ‌ల్ల  పరీక్ష ఫలితాల్లో ఖచ్చితత్వంతో పాటు ప్రామాణికత ఉంటుంది. నానాటికీ పెరుగుతున్న ఐసోలేషన్ పడకల  అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని,  డాక్టర్ ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని ట్రామా కేంద్రం   COVID-19 ఐసోలేషన్ ప్ర‌త్యేక వార్డుగా పనిచేస్తుందని డాక్టర్ హర్ష్ వర్ధన్పేర్కొన్నారు.
అనంతరం, డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు, అక్కడ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి సమీక్షించారు. ఈ సూప‌ర్ స్పెషాలిటీ బ్లాక్‌ను 400 ఐసోలేషన్ బెడ్లు , 100 ఐసియు బెడ్ల‌తో కూడిన అత్యాధునిక కోవిడ్ -19 ఐసోలేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌గా మార్చారు.
ఈ రెండు ఆస్ప‌త్రుల‌లో పేషెంట్ల‌కు చికిత్స‌, నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి స‌వివ‌ర స‌మీక్ష నిర్వ‌హ‌స్తూ డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్‌, డాక్ట‌ర్లు, న‌ర్సులు,, ఆస్ప‌త్రి సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది ప్ర‌త్యేకంగా కోవిడ్ -19 పేషెంట్ల‌కు సేవ‌లు అందించ‌డంలో నిరంత‌ర‌, అత్య‌వ‌స‌ర చికిత్స‌, సేవ‌లు అందిస్తున్నార‌ని అన్నారు. ఉన్న‌త ఫ‌లితాలు ఇవ్వ‌గ‌ల వైద్య స‌దుపాయాల‌లో త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవాల‌ని ఆయ‌న వారికి సూచించారు.
దేశంలో కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధించ‌డంలో  ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఆయన చర్చించారు. వారు చేస్తున్న కృషి అంతా మాన‌వాళి సేవ‌లో భాగ‌మ‌ని  అందుల‌వ‌ల్ల వారు త‌మ సేవ‌ను కొన‌సాగించాల‌ని సూచించారు. దేశంలోని వైద్యులు,ఇత‌ర ఆరోగ్య‌రంగ నిపుణులు అంకిత‌భావంతో సాగిస్తున్న కృషికి న‌మ‌స్క‌రిస్తున్నానని , ఇలాంటి ఆరోగ్య‌రంగ నిపుణులు ఉన్నందుకు దేశం గ‌ర్వ‌ప‌డుతోంద‌ని ఆయ‌న అన్నారు.
  కోవిడ్ -19 మహమ్మారి దాదాపు ప్రపంచాన్ని చుట్టుముట్టింద‌ని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నిరంత‌ర‌ పర్యవేక్షణ , మార్గదర్శకత్వం , ఆరోగ్య‌రంగ నిపుణుల‌ సత్వర చర్యలు, వారి మద్దతు కారణంగా ఈ మ‌హ‌మ్మారిని భారతదేశంలో సమర్థవంతంగా క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు మంత్రి చెప్పారు..
 క్ర‌మం త‌ప్ప‌కుండా చేతులు శుభ్రం చేసుకోవ‌డం వంటి పరిశుభ్రత కు సంబంధించిన‌ ప్రాథమిక  జాగ్ర‌త్త‌లు  పాటించడం, ముఖం మరియు కళ్ళు తాకకుండా ఉండ‌డం , సామాజిక దూరం  పాటించడం ద్వారా కోవిడ్ -19 మ‌హ‌మ్మారిపై పోరాటం చేయ‌వ‌చ్చు.. గౌరవ ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈ రోజు దేశ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన సందేశంలో  ఈ ముఖ్యమైన జాగ్రత్తలను పునరుద్ఘాటించారని ఆయన గుర్తుచేశారు. అన్నారు.
 లాక్ డౌన్ అనేది కోవిడ్ -19 ప్రభావాన్ని నిరోధించ‌డానికి మ‌న‌కు దొరికినఅద్భుత అవకాశమ‌ని. ఎవ‌రికి వారు ఇంటికి ప‌రిమితం కావ‌డం అనేది స‌మిష్టిగా కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ఉప‌క‌రించే గొప్ప ఆయుధంగా చెప్పుకోవ‌చ్చున‌ని డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అన్నారు.


(Release ID: 1610912) Visitor Counter : 185