ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 చర్యలపై తాజా సమాచారం
Posted On:
03 APR 2020 6:43PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడం, నియంత్రించేందుకు గాను భారత సర్కారు ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి వివిధ చర్యలను చేపట్టింది. వీటిని అనునిత్యం సర్కారు తప్పకుండా అత్యున్నత స్థాయిలో పర్యవేక్షణ జరుపుతోంది.
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దేశ వ్యాప్తంగా కోవిడ్-19పై పోరుకు గత సంసిద్ధత స్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. నవ్య కరోనా వైరస్ సంక్రమణ ప్రమాదం అధికంగా ఉన్న వర్గాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ కరోనాను కట్టడి చేసేందుకు గాను పౌర సమాజం/ స్వచ్ఛంద సంస్థలు/ ప్రైవేటు రంగం, రెడ్ క్రాస్ సంస్థలు అందించగలిగే తోడ్పాటు పాత్రను గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ అనిశ్చిత సంక్షోభ సమయాల్లో దేశం అపూర్వమైన క్రమశిక్షణ మరియు సామూహిక స్ఫూర్తిని చూపించిందని ప్రశంసించారు. లాక్డౌన్‌లో రానున్న రోజులు చాలా కీలకమని వ్యాఖ్యానించిన ప్రధాని సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు మరియు లాక్డౌన్ అమలుకు ప్రతి పౌరుడు తన వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గాను వైద్యులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలు సాహసోపేతంగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. ఈ నేపథ్యంలో వారి పనికి అడ్డంకులు కలిగించేలా ప్రవర్తించవద్దని ఆయన రోగులు, వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ కార్మికుల పట్ల కొందరు దురుసుగా ప్రవర్తించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి వారు నిరంతరం కృషిచేస్తూ దేశానికి సేవ చేస్తున్నారని మంత్రి అన్నారు. వైద్యులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలను మంత్రి కరోనా వారియర్స్ అంటూ మంత్రి కొనియాడారు. వారి సహకారాన్ని ప్రధానమంత్రి కూడా ప్రశంసించారని అన్నారు. వీరి సేవ వల్లనే కోవిడ్-19 వైరస్ నుంచి ఇప్పటివరకు దాదాపు 156 రోగులు కోలుకున్నారని మంత్రి అన్నారు.
కోవిడ్-19 కేసుల విషయమై ఐసీయూ కేర్ మరియు వెంటిలేషన్ వ్యూహాలపై వైద్యులకు ఆన్‌లైన్ శిక్షణను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు కరోనా వైరస్ రోగులను జాగ్రత్తగా చూసుకోవడానికి నర్సులకు మరో ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ఎయిమ్స్ నిర్వహిస్తోంది. అన్ని వెబ్‌నార్ల షెడ్యూళ్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ https://www.mohfw.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
- శుక్రవారం సాయంత్రం నాటికి అధికారిక సమాచారం మేరకు దేశంలో 2301 ధ్రువీకరించబడిన కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యయని.. 56 మరణాలు సంభవించాయని పేర్కొంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత 156 మంది ఆసుపత్రుల నుండి కోలుకొని తమతమ ఇండ్లకు వెళ్లిపోయారని తెలిపింది.
- కోవిడ్-19కి సంబంధించి ప్రామాణికమైన మరియు నవీకరించబడిన సమాచారంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు & సలహాదారుల కోసం దయచేసి క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. కోవిడ్‌కు సంబంధించిన సాంకేతిక విషయ ప్రశ్నల్ని technicalquery.covid19[at]gov[dot]in మరియు ఇతర ప్రశ్నలకు ncov2019[at]gov[dot]in కు ఈ-మెయిల్ చేయవచ్చు.
కోవిడ్-19కి సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెంః 91-11-23978046 లేదా 1075కు (టోల్ ఫ్రీ) ఫోన్ చేయవచ్చు. దీనికి తోడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసి హెల్ప్‌లైన్ నంబర్లు https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf వద్ద అందుబాటులో ఉంచారు.
(Release ID: 1610844)
Visitor Counter : 238