రైల్వే మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న కృషికి తన వంతు సహాయంగా మాస్కలు, సానిటైజర్లు తయారు చేస్తున్న భారతీయ రైల్వే

1 ఏప్రిల్ 2020 నాటికి మొత్తం 287704 మాస్కులు మరియు 25806 లీటర్ల సానిటైజర్లను తయారు చేసిన భారతీయ రైల్వే

దేశంలోని అన్ని రైల్వే జోన్లూ వీటిని తయారు చేస్తున్నప్పటికీ మధ్య రైల్వే మరియు పశ్చిమ రైల్వే జోన్లు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నాయి

పనిలోనికి వచ్చే సిబ్బంది అందరికీ ఈ మాస్కులు మరియు సానిటైజర్లు అందుబాటులో ఉంచబడుతోంది; అలాగే కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవి అందుబాటులో ఉంటాయి

కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు భారతీయ రైల్వే తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా అన్ని రైల్వే జోన్లు, ఉత్పత్తి విభాగాలు మరియు పిఎస్యులు మాస్కులు మరియు సానిటైజర్లను తయారు చేస్తున్నాయి.

Posted On: 03 APR 2020 4:36PM by PIB Hyderabad

1 ఎప్రిల్ 2020 నాటికి భారతీయ రైల్వే తన అన్నిజోన్లు, ఉత్పత్తి విభాగాలు మరియు పిఎస్యూలలో మొత్తంగా 287704 మాస్కులు మరియు 25806 లీటర్ల సానిటైజర్లను తయారు చేసింది. వీటిని ఎక్కువ సంఖ్యలో  తయారు చేస్తూ కొన్ని రైల్వే జోన్లు ముందుకు దూసుకు వెళ్తున్నాయి, ఇందులో 22580 మాస్కులు మరియు 2693 లీటర్ల సానిటైజర్లతో మధ్య రైల్వే, 46313 మాస్కులు మరియు 700 లీటర్ల సానిటైజర్లతో పశ్చిమ రైల్వే, 26567 మాస్కులు మరియు 3100 లీటర్ల సానిటైజర్లతో ఉత్తర మధ్య రైల్వే మరియు 14800 మాస్కులు మరియు 2620 లీటర్ల సానిటైజర్లతో పశ్చిమ రైల్వే తమ ఉత్పత్తులతో భారత ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నాయి.

అత్యవసరమైన వస్తువులు మరియు సరుకు రవాణా కార్యక్రమాన్ని నిరంతరం  కొనసాగిన్నది భారతీయ రైల్వే, ఈ కార్యక్రమాలకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు కార్యము మరియు నిర్వహణా సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారు. వారి రక్షణ కొరకు మరియు ఉత్సాహపరిచేందుకు వారు పనిచేస్తన్న అన్ని ప్రదేశాల్లో ఈ క్రింది చర్యలు తీసుకోబడ్డాయి

i.                    పనిలోనికి వస్తున్న సిబ్బంది అందరికీ మాస్కులు మరియు సానిటైజర్లు అందుబాటులో ఉంచబడుతోంది. కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవి అందుబాటులో ఉంచబడుతున్నాయి.

ii.                  సిబ్బంది  పనిచేసే అన్ని ప్రదేశాల్లో సబ్బు, నీరు మరియు చేతులు కడుగుకొనుటకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి.  స్థానికు కనుగొన్న కొన్ని క్రొత్త ఆలోచనలతో చేతలతో తాకకుండానే చేతులు కడుగుకొనుటకు  అవసరమైన సౌకర్యాలను కల్పించబడినాయి.

iii.                సామాజిక దూరం పాటించవలసిందిగా సిబ్బంది అందరికీ స్పష్టంగా తెలియజేయబడింది, ఈ క్రమంలో ట్రాక్మెన్, లోకోమోటివ్ పైలట్ల వంటి సిబ్బంది అందిరికీ ఎప్పటికప్పుడు తగిన అవగాహన కల్పించబడుతోంది.


(Release ID: 1610791) Visitor Counter : 149