గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఎన్‌టీఎఫ్‌పీ వాణిజ్యం, గిరిజ‌నుల ప్ర‌యోజ‌నాల్ని కాపాడే చ‌ర్య‌లు చేప‌ట్టండి

అన్నిరాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌ల‌కు లేఖ‌లు రాసిన‌ ట్రైఫెడ్

Posted On: 03 APR 2020 1:14PM by PIB Hyderabad

కోవిడ్‌-19 (క‌రోనా) వైర‌స్‌ వ్యాప్తి నేప‌థ్యాన దేశ వ్యాప్తంగా అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న‌వేళ దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజ‌నుల‌ ప్ర‌యోజ‌నాలు కాపాడేలా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని గిరిజ‌నుల వ్యవ‌హారాల శాఖ నేతృత్వంలోని ట్రైబ‌ల్ కో-ఆప‌రేటివ్ మార్కెటింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్‌) అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను కోరింది. ఇదే విష‌య‌మై ట్రైఫెడ్ ఎండీ ప్ర‌వీర్ కృష్ణ అన్ని రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు చెందిన చీఫ్ సెక్రెట‌రీల‌కు (సీఎస్‌ల‌కు) లేఖ రాశారు. కోవిడ్‌-19 వ్యాప్తి కార‌ణంగా స‌మాజంలోని అన్ని విభాగాలతో పాటు వాణిజ్య మరియు పరిశ్రమల రంగాలు కూడా వివిధ స్థాయిలో ప్ర‌భావిత‌మ‌య్యాయ‌ని ఇందుకు గిరిజనులేమీ మినహాయింపు కాద‌ని అన్నారు. ప్ర‌స్తుతం దేశంలోని చాలా ప్రాంతాల‌లో క‌ల‌పేత‌ర అట‌వీ ఉత్ప‌త్తులు (ఎన్‌టీఎఫ్‌పీ) సీజ‌న్ పీక్ స్థాయికి చేరుకుంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో గిరిజనులను, అట‌వీ ఉత్ప‌త్త‌లను సేకిరించే వారిని రక్షించడానికి తీసుకోవలసిన కొన్ని ముందు జాగ్రత్త చర్యల గురించి ముందుగానే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయ‌న ఈ లేఖలో పేర్కొన్నారు. గిరిజ‌నుల ప్ర‌యోజనాలు కాపాండేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ట్రైఫెడ్ ఈ సంద‌ర్భంగా రాష్ర్టాల‌కు అందించింది. ఈ జాగ్ర‌త్త‌ల‌కు సంబంధించిన స‌మాచారం క్షేత్ర స్థాయిలో అట్ట‌డుగున ఉండే వారంద‌రికీ వీలైనంత త్వ‌ర‌గా చేరే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌తో స‌హా నోడ‌ల్ ఏజెన్సీల వారికి విజ్ఞ‌ప్తి చేశారు.  
కోవిడ్ -19 భ‌యాలు నెల‌కొన్న వేళ ఎన్‌టీఎఫ్‌పీ కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా చేయాల్సిన మ‌రియు చేయ‌కూడ‌ని ప‌నులుః
దేశ వ్యాప్తంగా ఉన్న అనూహ్య ప‌రిస్థితులను ఆస‌రాగా చేసుకొని కొంద‌రు మార్కెట్ శ‌క్తులు అట‌వీ ఉత్ప‌త్తులు సంగ్రాహ‌కులకు వివిధ మాయ‌మాట‌లు చెప్పి వారి నుంచి బ‌ల‌వంతంగా తక్కువ ధ‌ర‌కు ఎన్‌టీఎఫ్‌పీ ఉత్పత్తుల‌ను కొనుగోలు చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌కు దిగే అవ‌కాశం ఉంది. కావున ఎంఎఫ్‌పీ ప‌థ‌కాన్ని మ‌రింత ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల‌ని ట్రైఫెడ్ సీస్‌లు, నోడ‌ల్ ఎజెన్సీల‌ను కోరింది. ఇలాంటి కార్య‌క‌లాపాలు జ‌రిగేందుకు అవ‌కాశం ఉన్న ప్రాంతాల‌పై
ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌ని సూచించింది.
క‌ల‌పేత‌ర అట‌వీ ఉత్ప‌త్తుల‌(ఎన్‌టీఎఫ్‌పీ) సేక‌ర‌ణ ప‌నుల్లో పరిశుభ్రత గురించి గిరిజ‌నుల‌కు త‌గిన సలహాలు ఇవ్వాలి. అడ‌విలో సేక‌ర‌ణకు వెళ్లే ముందు, తిరిగి వ‌చ్చిన త‌రువాత కూడా గిరిజ‌నం తమ చేతులను శుభ్రపరుచుకొనేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలి.
ఎన్‌టీఎఫ్‌పీ ప్రాథ‌మిక ప్రాసెసింగ్ యూనిట్టు, వ‌న్ ధ‌న్ వికాస్ కేంద్రాల‌ వ‌ద్ద విధిగా హాండ్ సానిటైజ‌ర్ల‌ను ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రంలోకి ప్రాసెసింగ్ ప‌నుల నిమిత్తం వచ్చే వారు పని ప్రారంభించే ముందు విధిగా చేతులు శుభ్రపరుచుకొనేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ కేంద్రాల‌కు వ‌చ్చే వారు గుంపులు గుంపులుగా కూర్చోకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. వీరి మ‌ధ్య క‌నీసం రెండు మీట‌ర్ల సామాజిక దూరం ఉండేలా చూసుకోవాలి. ఆయా కేంద్రాలు చిన్న‌విగా ఉన్న నేప‌థ్యంలో వారిని వివిధ షిఫ్టుల రూపంలో ప‌నికి రావాల‌ని సూచించాలి.. లేదంటే వారు ఇంటివ‌ద్దనే ప‌రిశుభ్ర వాతావార‌ణంలో ప్రాథ‌మిక ప్రాసెసింగ్ ప‌నులు చేసుకొనేందుకు అనుమ‌తించాలి.  
- ఆయా కేంద్రాల‌లో ప‌నిచేసే వారిలో ఎవ‌రైనా జలుబు లేదా ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా గ‌మ‌నిస్తే వారిని ప‌నుల్లోకి అనుమ‌తించ‌వ‌ద్దు. అట‌వీ ఉత్ప‌త్తుల సంగ్ర‌హ‌కుల‌లో ఎవ‌రికైనా కోవిడ్‌-19కు చెందిన స్వ‌ల్ప‌ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వారిని స్ర్కీనింగ్‌కు పంపించాలి. అవ‌స‌ర‌మైతే వారిని క్వారెంటైన్‌లో ఉంచేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలి.
- ఎన్‌టీఎఫ్‌పీ ప్యాకింగ్ సామ‌గ్రి శుభ్రంగా ఉండేలా జాగ్ర‌త్త వ‌హించాలి. ఎందుకంటే మెరుగైన ప్యాకేజీ ఉంటే వీటికి సంబంధించిన కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేవారు నేరుగా అట‌వీ ఉత్ప‌త్తుల‌ను
ముట్టుకోకుండా నివారించే వీలుంటుంది.
- వీలైనంత వ‌ర‌కు న‌గ‌దు లావాదేవీలను త‌గ్గించాలి. న‌గ‌దుకు బ‌దులుగా అట‌వీ ఉత్ప‌త్తుల సేక‌ర్త‌ల‌కు డ‌బ్బుల‌ను బ్యాంక్ ఖాతాల‌లోకి జ‌మ చేయాలి. వీరు రూపే వంటి ప్రభుత్వ డిజిట‌ల్ వేదికల ద్వారా నగదు రహిత పద్ధతులు అనుసరించేలా పోత్స‌హించాలి, అందుకు కావాల్సిన మ‌ద్ద‌తునివ్వాలి.



(Release ID: 1610667) Visitor Counter : 167