గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నేపథ్యంలో పీఎం గరీబ్ కళ్యాణ్ పథకం కింద పీఎం జన్ ధన్ (పీఎంజెడివై) మహిళా ఖాతా దారులకు 2020 ఏప్రిల్ నగదు నేరుగా బదిలీ

ఖాతాదారులు,బ్యాంకు బ్రాంచిల దగ్గర, బిజినెస్ కరస్పాండెంట్లు (బి.సి), ఎటిఎం ల వద్ద డబ్బు తీసుకున్నప్పుడు అప్రమత్తత

Posted On: 03 APR 2020 12:25PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏక మొత్తంలో  ప్రధాన మంత్రి జన-ధన్ యోజన (పిఎమ్‌జెడివై) ఖాతాదారులకు (బ్యాంకులు తెలియజేసిన అటువంటి ఖాతాల సంఖ్య ప్రకారం)ఏప్రిల్ 2020 కోసం ఒక్కో లబ్ధిదారునికి రూ.500/- ఆర్ధిక సహాయం విడుదల చేస్తోంది. ఈ నగదు  2020 ఏప్రిల్ న వ్యక్తిగత బ్యాంకుల  ఖాతాలకు జమ అయ్యాయి. పీఎంజెడివై  మహిళా ఖాతాదారులకువచ్చే మూడు నెలలకుపీఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఒక్కో మహిళకు రూ.500/- చెల్లిస్తామని  ఆర్థిక మంత్రి మార్చి 26న చేసిన ప్రకటన తర్వాత నగదు బదిలీని ప్రారంభించారు.  

 

సామాజిక దూరాన్ని పాటించేలా సరైన విధానంలో  లబ్ధిదారు నగదును తీసుకునేల అప్రమత్తంగా ఉండాలని  ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్ఎస్) బ్యాంకులను ఆదేశించింది. ఆయా బ్యాంకు శాఖలుబి.సిలుఎటిఎంల వద్ద ఖాతాదారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. లబ్ధిదారుడి ఖాతా సంఖ్యలో చివరి అంకె ఆధారంగా పంపిణీ షెడ్యూల్ ఇలా ఉంటుంది....

 

 

మహిళా పీఎంజెడియు ఖాతాదారుని  సంఖ్యలో చివరి అంకె...

నగదు ఉపసంహరించుకోడానికి  నిర్ణయించిన తేదీ

లేదా  1

3.4.2020

లేదా 3

4.4.2020

లేదా 5

7.4.2020

లేదా 7

8.4.2020

లేదా 9

9.4.2020

        ఏప్రిల్ 9వ తేదీ తర్వాత కూడా లబ్ధిదారులు బ్రాంచికి కానీబీసీ వద్దకు కానీ సాధారణ బ్యాంకింగ్ సమయాల్లో  వెళ్ళవచ్చు. పైన పేర్కొన్న షెడ్యూల్ ని ఖాతాదారులకు బ్యాంకులు ముందుగానే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇలా ఇవ్వాలి.     మీ శ్రేయస్సే మాకు ముఖ్యం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కిందమహిళా జన్ ధన్ యోజన లబ్ధిదారుల ఖాతాలో రూ. 500/- జమ  అయ్యాయి. 2020 ఏప్రిల్ నెలకు గాను ఈ డబ్బు ఇవ్వబడింది. అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మీ బ్రాంచి / బ్యాంకు మిత్ర ని రేపు /   ......... తేదీన సంప్రదించండి. క్షేమంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి."

పైన పేర్కొన్న ఎస్ఎంఎస్ సందేశంతో పాటుస్థానిక ప్రచార మాధ్యమాల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేసి నగదును ఎప్పుడైనా పొందవచ్చనే సందేశం చేరవేయాలి. తక్షణమే నగదును ఉపసంహరించుకోవాలి అనుకుంటే పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం బ్యాంకు బ్రాంచి కి గాని బి.సి వద్దకు కానీ వెళ్లాల్సి ఉంటుంది.  ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పద్ధతి ప్రకారంసామజిక దూరం పాటిస్తూ డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేయడానికే నిర్దిష్ట షెడ్యూల్ ను నిర్ణయించారు. 

ఈ నేపథ్యంలోరాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) కన్వీనర్‌లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి,  ప్రణాళికను వారికి తెలియజేయాలని ఆర్ధిక శాఖ సూచన. బ్యాంకు శాఖలుబిసి కియోస్క్‌లుఎటిఎంలలో తగిన భద్రతా ఏర్పాట్ల కోసం వారి సహకారం పొందాలని ఆదేశించారు. లబ్ధిదారులకు డబ్బును క్రమబద్ధంగా పంపిణీ చేయడంలోస్థానికంగా ప్రచారం చేయడంలో బ్యాంకుకు సహకారం ఇవ్వడానికి జిల్లా పరిపాలనపోలీసు అధికారులకు తగిన సూచనలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. 

అన్ని ప్రభుత్వప్రైవేటు రంగ బ్యాంకుల అధిపతులు ఈ విషయంలో బ్రాంచి అధికారులుబిజినెస్ కరస్పాండెంట్లకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.

                                                ****

 
 
 

(Release ID: 1610663) Visitor Counter : 329