ఆయుష్

కోవిడ్- 19పై చేస్తున్న వాదనలపై దృష్టి పెట్టిన ఆయుష్ మంత్రిత్వ శాఖ; కరోనా వైరస్ పై పోరాటానికి శాస్త్రీయమైన సాక్ష్యాధారాలతో పరిష్కారం చూపే ప్రయత్నాలు

Posted On: 31 MAR 2020 2:31PM by PIB Hyderabad

కోవిడ్-19 చికిత్స గురించి సాక్ష్యాధారాలు  లేకుండా పెద్ద వాదనలకు ఆస్కారం ఇవ్వద్దని  ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును మేరకుఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. అవగాహన కల్పించడం ద్వారా ఇటువంటి వాదనలను అరికట్టడానికి చర్యలు చేపట్టింది.

ఆయుష్ ప్రాక్టీషనర్లుసంస్థల నుండి వివిధ సూచనలు మరియు ప్రతిపాదనలను తెలుసుకోడానికి  ఒక ఛానల్  ఏర్పాటు చేసింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఆయుష్ వ్యవస్థల నుండి శాస్త్రీయ ఆధారాల మూలంతో పరిష్కారాల కోసం పనిచేయాలని ప్రధానమంత్రి సలహాపై మంత్రిత్వ శాఖ చర్యలను ప్రారంభించింది.  శాస్త్రవేత్తల గ్రూప్  ద్వారా సాధ్యతలను  పరిశీలించే ఏర్పాటు చేశారు. మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్ లుసామజిక మాధ్యమాల  వేదిక చేసుకుని ఆయుష్  ప్రాక్టిషనర్లను సంప్రదించే పని ప్రారంభించింది. నిరాశాజనకమైనతప్పుడు ప్రచారాలను అరికట్టడానికి ఆ ప్రాక్టిషనర్లను ఈ మాధ్యమాల ద్వారా భాగస్వామ్యం చేస్తున్నారు. గత 30వ తేదీన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సుమారు వంద మంది ఆయుష్ కి చెందిన వివిధ విభాగాల ఆలోచన పరులు పాల్గొన్నారు. మిగిలిన పలు అంశాలతో పాటు సరికాని వాదనలుప్రచారానికి అడ్డుకట్ట వేయడంపై సమాలోచనలు జరిగాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రైల్వేవాణిజ్య శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ఆయుష్ శాఖ (స్వతంత్ర) సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్ ఆయుష్ రంగానికి చెందిన ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. 

ప్రధాని ఇచ్చిన పిలుపు అనుగుణంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ వెంటనే కొన్ని చర్యలు చేపట్టింది. తన శాఖ వెబ్ సైట్ లో ఒక ఆన్లైన్ ఛానల్ ని ప్రారంభించింది. తద్వారా కోవిడ్-19 మహమ్మారి విషయంలో చేపట్టాల్సిన ఆరోగ్య సంబంధిత చర్యల గురించి వివరించడమే కాకుండా తప్పుడు వాదనలకు శాస్త్రీయ ఆధారాలతో సహా వివరణ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు అనుగుణంగా వివిధ ఆయుష్ ప్రాక్టిషనర్లుఆయుష్ సంస్థలు (కళాశాలలువిశ్వవిద్యాలయాలుఆస్పత్రులుఆయుష్ ఉత్పత్తిదారులుఆయుష్ సంఘాలు) నుండి మంత్రిత్వ శాఖ తగు సలహాలు తీసుకుంటుంది.  ఈ వివరాలను ఆయుష్ మంత్రిత్వ శాఖా వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నారు. లింక్:  http://ayush.gov.in/covid-19 (నేరుగా దీని ద్వారా అనుసంధానం అవ్వకపోతేవెబ్ బ్రౌజర్ అడ్రస్ లైన్ లో ఈ లింక్ ని కాపీ చేసి సైట్ లోకి ప్రవేశించవచ్చు)

ఈ విధంగా అందిన సూచనలువివరాలను నిపుణుల కమిటీ సమీక్షిస్తుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను వివిధ ప్రత్యేక విభాగాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశీలించి సాధ్యమైన చోటఆ ప్రతిపాదనలను ధ్రువీకరణ అధ్యయనం కోసం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. 

 

                                        ****


(Release ID: 1609888) Visitor Counter : 355