ఆయుష్

కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆయుర్వేదం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకునే స్వీయ రక్షణ చర్యలు

Posted On: 31 MAR 2020 2:29PM by PIB Hyderabad

కోవిడ్-19 విజృంభించడంతో ప్రపంచ వ్యాప్తంగా జీవకోటి తల్లడిల్లుతోంది. ఈ వైరస్ ను నిర్మూలించలేకపోయిననివారించడం ఒకటే ప్రస్తుతానికి పరిష్కారం. అందువల్ల దేహంలో సహజ స్వీయ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవలసి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆయుర్వేదంజీవన విజ్ఞానం కావడంతోఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించడంలో ప్రకృతి వరం లాంటిది. నివారణే తరుణోపాయం అనే సూత్రంపైనే ఆయుర్వేద విజ్ఞానం ఆధారపడి ఉంది. దినచర్యరుతుచర్య అనే రెండు ప్రధాన అంశాలు ఆయుర్వేదంలో కీలకం. దినచర్య అంటే రోజు వారి ఆరోగ్య పాలనరుతుచర్య అంటే మారుతున్న వివిధ కాలాలకు అనుగుణంగా ఆరోగ్య పాలన. ఈ రెంటిపైనే ఆరోగ్యకర జీవనం ఆధారపడి ఉంటుంది. 

ఆయుర్వేదంమొక్కల ఆధారిత శాస్త్రం. ఆయుర్వేద శాస్త్రీయ గ్రంథాల ప్రకారం ఆమె లేదా అతడి రోగనిరోధక శక్తి పెంపొందించుకుంటే తన అనే మనిషిలో లోని నిరాడంబరతసరళతపై అవగాహనప్రతి వ్యక్తిలోని సామరస్యం వెల్లివిరుస్తుంది. నివారణ ఆరోగ్య చర్యలు మరియు శ్వాసకోశ ఆరోగ్యానికి ప్రత్యేక సూచనతో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ క్రింది స్వీయ-రక్షణ మార్గదర్శకాలను సిఫారసు చేస్తుంది. ఆయుర్వేద సాహిత్యం మరియు శాస్త్రీయ ప్రచురణలు  వీటిని పేర్కొన్నాయి. 

సాధారణ చర్యలు: 

1. రోజంతా గోరువెచ్చటి మంచి నీటిని తరుచు తాగుతూ ఉండాలి

2.  రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనప్రాణాయామధ్యానం చేయాలి. ఆయుష్ మంత్రిత్వ శాఖ వీటిని సూచించింది. (#YOGAatHome #StayHome #StaySafe)

3. వంటల్లో పసుపుజీలకర్రధనియాలుఅల్లం ఉండేలా చూసుకోవాలి. 

 ఆయుర్వేదం ద్వారా రోగనిరోధక చర్యలు:

1. ఉదయాన్నే 10 గ్రాముల చ్యవనప్రాష్(ఒక చెమ్చా)మధుమేహం ఉన్నవారు చక్కర లేని చ్యవనప్రాష్ తీసుకోవాలి. 

2. మూలికా తేనీరు (హెర్బల్ టీ) / తులసిదాల్చినిచెక్కమిరియాలుశొంఠిఎండుద్రాక్ష తో కూడిన డికాక్షన్- రోజుకు ఒకటి రెండు సార్లు సేవించాలి. అవసరమనుకుంటే రుచి కోసం బెల్లంతాజా నిమ్మ రసం వేసుకోవచ్చు

3. అర చెమ్చా పసుపుపొడి  కలిపిన 150 మిల్లీలీటర్ల వేడి పాలు - రోజుకు ఒకటి లేదా రెండు సార్లు 

సరళ తరమైన ఆయుర్వేద ప్రక్రియలు:

1. ముక్కు ద్వారా  -  నువ్వుల నూనె / కొబ్బరి నూనె లేదా నెయ్యి రెండు నాసికా రంధ్రాలలో (ప్రతిమార్ష్నాస్య) ఉదయం మరియు సాయంత్రం వర్తించండి.

2. ఆయిల్ పుల్లింగ్ చికిత్స -  ఒక చెమ్చా నువ్వులు లేదా కొబ్బరి నూనెను నోటిలో తీసుకోండి. త్రాగవద్దు, 2 నుండి నిమిషాలు నోటిలో పుక్కిలించి ఉమ్మివేయండితరువాత వెచ్చని నీరుతో  శుభ్రం చేసుకోండి. ఇది రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు.

  పొడి దగ్గు/గొంతు నొప్పి వచ్చినపుడు:

1. తాజా పుదీనా ఆకులు లేదా అజ్వైన్- వాము (కారవే విత్తనాలు) తో ఆవిరి పీల్చడం- రోజుకు ఒకసారి సాధన చేయవచ్చు. 

2. గొంతు లో ఇబ్బందిగా ఉంటె లవంగ పొడిని బెల్లం లేదా తేనెలో కలిపి రోజుకు 2-3 సార్లు సేవించవచ్చు

3. సాధారణ పొడి దగ్గుగొంతునొప్పికి  తీసుకొనే చర్యలివి. అయితే ఇంకా ఆ సమస్య కొనసాగితే వైద్యుని సంప్రదించాలి. 

తమ సౌలభ్యం మేరకు వ్యక్తిగతంగా ఈ చర్యలు చేపట్టవచ్చు. ఈ చర్యలు దేశవ్యాప్తంగా ఉన్న ఈ క్రింద పేర్కొన్న ప్రముఖ వైద్యుల సిఫార్సుల మేరకు సూచించినవి. అవి అంటువ్యాధుల బారి నుండి కాపాడ్డానికి ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతాయి: 

పద్మశ్రీ వైద్యపి.ఆర్.కృష్ణకుమార్కోయంబత్తూర్పద్మ భూషణ్ వైద్య దేవేంద్ర త్రిగుణఢిల్లీవైద్య పిఎం వారియర్కొట్టక్కల్వైద్య జయంత్ దేవ్‌పుజారినాగ్‌పూర్వైద్య వినయ వేలంకర్థానేవైద్య బిఎస్ ప్రసాద్బెల్గాంవైద్య గురుదీప్ సింగ్ జాంనగర్ఆచార్య బాలకృష్ణయ్యహరిద్వార్వైద్య ఎంఎస్ బాగెల్జైపూర్వైద్య ఆర్బి ద్వివేదిహర్దోయియుపివైద్య కెఎన్ ద్వివేదివారణాసివైద్య రాకేశ్ శర్మచండీగఢ్వైద్య అబిచల్ చటోపాధ్యాయకోల్‌కతావైద్య తనూజా నేసరిఢిల్లీవైద్య సంజీవ్ శర్మవైద్య అనూప్ థక్కర్,జాంనగర్. 
 

హెచ్చరిక: పైన పేర్కొన్న సలహాలు కోవిడ్-19కి చికిత్సగా పేర్కొనలేదు 


(Release ID: 1609752) Visitor Counter : 326