మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఏప్రిల్, 2020 నెలలో నిర్వహించవలసిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష జె ఇ ఇ (మెయిన్) వాయిదా వేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

Posted On: 31 MAR 2020 5:39PM by PIB Hyderabad

ఏప్రిల్, 2020 నెలలో 5,7,9 మరియు 11 తేదీలలో జరగవలసిన జెఇఇ (మెయిన్) పరీక్ష వాయిదాకు సంబంధించి 18.03.2020 తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టి ఎ) జారీచేసిన బహిరంగ ప్రకటనకు కొనసాగింపుగా పరీక్షల నిర్వహణ సంస్థ చేసే ప్రకటన ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఈ పరీక్షా మే, 2020 నెల చివరి వారంలో నిర్వహించే ప్రతిపాదన ఉంది. అయితే రానున్న వారాల్లో పరిస్థితిని అంచనా వేసిన తరువాత సరైన తేదీని ప్రకటించడం జరుగుతుంది.

త్వరలోనే మామూలు పరిస్థితులు నెలకోనగలవని ఎన్ టి ఎ ఆశిస్తున్నది. అయితే పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, పరిస్తితిపై ఒక అంచనాకు వచ్చిన తరువాత అవసరమైతే షెడ్యూలులో మార్పులు చేయగలమని  ఎన్ టి ఎ ప్రకటించింది. తదనుగుణంగా, అప్పటి పరిస్థితి ఆధారంగా పరీక్ష అడ్మిట్ కార్డులు 15 ఏప్రిల్, 2020 తరువాత జారీచేస్తామని తెలిపారు. తాజా పరిస్థితిని గురించి, మార్పుల గురించి, పరీక్ష సరైన తేదీల గురించి  విద్యార్ధులకు చాలా ముందుగానే తెలియజేస్తామని ఎన్ టి ఎ ప్రకటనలో తెలిపారు.

తాజా పరిణామాలను గురించి తెలుసుకోవడానికి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు jeemain.nta.nic.in మరియు www.nta.ac.in వెబ్ సైట్ లను చూడాలని సూచన.  అభ్యర్ధులు 8287471852, 8178359845, 9650173668, 9599676953, 8882356803 నెంబర్లకు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

*****

 



(Release ID: 1609722) Visitor Counter : 140