కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

పోస్ట‌ల్ జీవిత బీమా, గ్రామీణ పోస్ట‌ల్ జీవిత బీమా ప్రీమియం చెల్లింపు గ‌డువు పెంపు

ఏప్రిల్ 30 వ‌ర‌కు చెల్లించుకొనేలా వెసులుబాటు క‌ల్పించిన స‌ర్కారు..

Posted On: 30 MAR 2020 5:16PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తి ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమ‌ల‌వుతుండ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది. తాజాగా స‌ర్కారు పోస్ట‌ల్ జీవిత బీమా (పీఐఎల్‌), గ్రామీణ పోస్ట‌ల్ జీవిత బీమా (ఆర్‌పీఐఎల్‌) ప్రీమియం చెల్లింపు గ‌డువును పెంచుతున్న‌ట్టుగా పోస్ట‌ల్ శాఖ ప్ర‌క‌టించింది. ఈ బీమా ప‌థ‌కాల ప్రీమియం చెల్లింపు గ‌డువును మార్చితో ముగుస్తున్నట్ల‌యితే దానిని ఏప్రిల్ 30 వ‌ర‌కు చెల్లించుకొనే వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్టు డైర‌క్ట‌రేట్ ఆఫ్ పోస్ట‌ల్ లైఫ్
ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) తెలిపారు. ఇందుకు గాను ఎలాంటి అప‌రాధ‌ రుసుము గానీ, డిఫాల్ట్ ఫీజు గానీ అద‌నంగా వ‌సూలు చేయ‌బోమ‌ని డైర‌క్ట‌రేట్ తెలిపింది. దేశ వ్య‌ప్తంగా లాక్డౌన్ అమ‌ల‌వుతున్న స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల కింద పోస్టాఫీసులు ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ.. వినియోగ‌దారులు త‌పాలా కార్యాలయాల‌కు వ‌చ్చి ప్రీమియం చెల్లించ‌లేక‌పోతున్నార‌ని.. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే ప్రీమియం చెల్లింపు గ‌డ‌వు తేదీని పొడిగించిస్తున్న‌ట్టుగా డైర‌క్ట‌రేట్ వివ‌ర‌ణ ఇచ్చింది. తాజా నిర్ణ‌యంలో ఈ నెల‌లో ప్రిమియం చెల్లించలేక పోతున్న‌ దాదాపు 13 ల‌క్ష‌ల (5.5 ల‌క్ష‌ల పీఎల్ఐ మ‌రియు 7.5 ల‌క్ష‌ల ఆర్‌పీఐఎల్‌) పాల‌సీదారుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. గ‌త నెల‌లో దాదాపు 42 ల‌క్ష‌ల పాల‌సీదారులు ప్రీమియం చెల్లింపులు జ‌ర‌ప‌గా.. సోమ‌వారం నాటికి కేవ‌లం 29 ల‌క్ష‌ల మంది పాల‌సీదారులు మాత్ర‌మే త‌మ ప్రీమియం చెల్లింపులు చేశారు. దీంతో మిగ‌తా వారికి తాజా నిర్ణ‌యంతో పెద్ద ఊర‌ట ల‌భించ‌నుంది. పోస్ట‌ల్ శాఖ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌రైన వినియోగ‌దారులు త‌మ ప్రీమియంల‌ను ఆన్‌లైన్ ద్వారా చెల్లించ‌వచ్చ‌ని పోస్ట‌ల్ శాఖ ఈ సంద‌ర్భంగా సూచించింది. 



(Release ID: 1609400) Visitor Counter : 97