పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశంలోని వివిధ ప్రాంతాలకు ఔషధ సరఫరా కొరకు సరుకు రవాణా విమానాలను అనుమతించనున్న ప్రభుత్వం

Posted On: 30 MAR 2020 10:43AM by PIB Hyderabad

కొవిడ్-19 పరీక్షల కొరకు అవసరమైన వైద్య పరికరాలు మరియు ఔషధ సంబంధిత అవసరాల  సరఫరా కోసం ప్రభుత్వంతో సమన్వయమవుతున్నట్లు కేంద్ర  పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ రాష్ట్రాల అత్యవసరాలకు అనుగుణంగా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు ఆయా రాష్ట్రాలు మరియు సరఫరా సంస్థలతో సమన్వయం చేసుకుని అవసరమైన వైద్య మరియు ఔషధ సంబంధిత సరుకును ఆయా ప్రాంతాలకు చేరవేయు ఏర్పాట్లు చేస్తారు, తదనంతరం వాటిని గమ్యస్థానాలకు చేరవేస్తారు. ఏయిర్ ఇండియా మరియు అలయన్స్ ఏయిర్ విమానాలను దేశవ్యాప్తంగా ఈ సరుకు రవాణా కోసం వినియోగించనున్నారు.

సమయానికి వైద్య పరికరాలు మరియు ఔషధాల సరఫరా కోసం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ అధికృత సంస్థలు విమానాల ద్వారా సరుకు రవాణా కోసం తత్సంబంధిత అధికారులను సంప్రదించవలసింది.

29 మార్చి 2020న దేశంలోని కోల్కత్తా, గువాహటి, దిబ్రూఘర్ మరియు అగర్తల వంటి తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలకు అలయన్స్ ఎయిర్ విమానం ద్వారా ఢిల్లీ నుండి కోల్కత్తాకు సరకు రవాణా  చేయబడింది.

దేశంలోని ఉత్తర ప్రాంతాలకు ఐసిఎంఆర్ విటిఎం కిట్లు మరియు ఇతర అవసర సామాగ్రిని ఢిల్లీ నుండి చండీగఢ్, చండీగఢ్ నుండి లెహ్ ప్రాంతానికి ఐఏఫ్ విమానం ద్వారా రవాణా చేయబడ్డాయి.

అలయెన్స్ ఏయిర్  పుణెకు చెందిన సరుకును  ఎయిర్ ఇండియా విమానం ద్వారా ముంబైకి చేర్చింది.

(ముంబై-ఢిల్లీ-హైదరాబాద్-చెన్నై-ముంబై మరియు హైదరాబాద్-కోయంబత్తూర్) –విమానాలు ఆయా మార్గాల్లో సరుకును రవాణా చేస్తున్నాయి మరియు పుణె నుండి ఢిల్లీకి నడిచే విమానాలు సిమ్లా, రిషికేష్, లక్నో మరియు ఇంఫాల్ లకు చెందిన ఐసిఎంఆర్ కిట్లను ఆయా ప్రాంతాలకు చేరవేసాయి. అలాగే చెన్నైకి కూడా ఐసిఎంఆర్ కిట్లు చేరవేయబడ్డాయి. హైదరాబాదుతోపాటు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు పుదుచ్చేరిలకు చెందిన సరుకు కూడా ఆయా ప్రాంతాలకు చేరవేయబడ్డాయి. జౌళి మంత్రిత్వ శాఖ వారికి చెందిన సామాగ్రి కూడా కోయంబత్తూరుకు చేరవేయబడింది.

కొవిడ్-19 మరింత విస్తృతం కాకుండా చేస్తున్న పోరాటంలో తగిన సమయంలో అవసరమైన వైద్య పరికరాలు మరియు ఔషధాలను ఆయా ప్రాంతాలకు చేరవేయండంతోపాటు వాటికి సంబంధించిన సమాచారం మార్పిడి, వివిధ ప్రశ్నలకు సమాధానాలు మరియు ఇతర పనులను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు.


(Release ID: 1609256) Visitor Counter : 143