ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్ -19 పై భారత్ పోరాటానికి నాయకత్వ స్థానంలో ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ , ప్రతిరోజూ వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రజలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారి ప్రతిస్పందన తెలుసుకుంటున్నారు.
Posted On:
29 MAR 2020 11:29AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోవిడ్ -19 పై పోరాటానికి సంబంధించి వివిధ రంగాలకు చెందిన వారితో సంభాషణను కొనసాగిస్తున్నారు.
ప్రతి రోజూ ప్రధానమంత్రి 200 మందికి పైగా ప్రజలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇలా ఫోన్ ద్వారా మాట్లాడుతున్న వారిలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులు ఉన్నారు. వీరి ద్వారా కోవిడ్ మహమ్మారి పై పోరాటానికి సంబంధించి నేరుగా సమాచారం సేకరిస్తున్నారు.
అలాగే ప్రధానమంత్రి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, శానిటేషన్ సిబ్బందికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. దేశానికి, సమాజానికి వారు అందిస్తున్న అద్భుత సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రధాని వీరితో మాట్లాడుతున్నారు. అలాగే కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టే చర్యలలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరిస్తున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్‌లతో మాట్లాడారు. అలాగే మార్చి 24న వివిధ ప్రింట్ మీడియా గ్రూప్‌లతో మాట్లాడారు.
ఈ రెండు సందర్భాలలోనూ నిరాశ, భయాలను సానుకూల సమాచారం ద్వారా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి మీడియాకు పిలుపునిచ్చారు.
మార్చి 27న ప్రధానమంత్రి వివిధ రేడియో జాకీలను, ఆలిండియా రేడియో అనౌన్సర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్థానిక హీరోల కంట్రిబ్యూషన్‌ను జాతీయ స్థాయిలో సెలిబ్రేట్ చేసకోవలసిన అవసరం ఉందని, అలా వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని కోరారు.
ప్రధానమంత్రి కరోనా వైరస్ సోకిన కొంతమందితో , అలాగే కరోనా వ్యాధి బారిన పడి కోలుకున్న వారితో టెలిఫోన్ ద్వారా సంభాషించి వారి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
2020 మార్చి 25న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నియోజక వర్గమైన వారణాశి ప్రజలతో వీడియోద్వారా మాట్లాడారు. సున్నితత్వంతో,సంయమనం తో , సంకల్ప బలంతో , కరోనావైరస్ పై పోరాటంలో అత్యుత్తమ పద్ధతులను పాటించాలని పిలుపునిచ్చారు.
క్రమం తప్పకుండా సంభాషణలు, సమావేశాలు..
జనవరి నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కోవిడ్ -19 పై పోరాటానికి అనుసరించాల్సిన పద్ధతులను తెలుసుకునేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, అధికారులతో పలు ధఫాలుగా సమావేశాలు, చర్చలు జరిపారు.
ప్రధానమంత్రి రోజువారీగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అందులో కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం క్రమంతప్పకుండా ప్రధానమంత్రి దృష్టికి తెస్తూ వచ్చారు.
అలాగే ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి దృష్టికి తెస్తూ వచ్చింది.
ఇతరులకు మార్గదర్శకంగా...
ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూసే చర్యలలో భాగంగా ప్రధానమంత్రి తాను హోలీ సంబరాలలో పాల్గొనబోవడం లేదని ప్రకటించి మార్గదర్శకత్వం వహించారు.
దేశప్రజలనుద్దేశించి ప్రసంగం- జనతా కర్ఫ్యూ, 3 వారాల లాక్‌డౌన్
కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశాన్ని సన్నద్ధం చేసేందుకు ప్రదానమంత్రి 2020 మార్చి 19న దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ , ప్రజలను స్వచ్ఛందంగా 22 మార్చి ,2020న జనతా కర్ఫ్యూలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు 14 గంటలపాటు పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు.
సామజిక దూరాన్ని పాటించేలా దేశాన్ని విజయవంతంగా సన్నద్ధం చేసే క్రమంలో , ప్రధానమంత్రి మార్చి 24,2020 న దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ , 3 వారాల లాక్‌డౌన్ కు పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి గల ఏకైక పటిష్టమైన చర్య అని ప్రధాన మంత్రి చెప్పారు.
కరోనావైరస్ పై పోరాడేందుకు సంకల్పం, సంయమనం అనే ద్విముఖ మంత్రాన్ని ప్రధానమంత్రి దేశ ప్రజలకు అందించారు.
ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, భయపడి అనవసర కొనుగోళ్లకు పాల్పడవద్దని, నిత్యావసర సరకులు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు.
కోవిడ్ -19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్..
కోవిడ్ మహమ్మారి వల్ల ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు, ప్రధానమంత్రి కోవిడ్ -19 ఎకనమిక్ రెస్పాన్స్ టాక్స్ ఫోర్స్‌ను , కేంద్ర ఆర్థికమంత్రి నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ సంబంధిత పక్షాలతో మాట్లాడి, వారినుంచి అభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగా ప్రస్తుత సవాళ్లను అధిగమించేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ టాస్క్‌ఫోర్స్ , ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన నిర్ణయాలను అమలు చేయడానికి ఈ టాస్క్‌ఫోర్స్ వీలుకల్పిస్తుంది.
మనం వివిధ రకాల సేవలు అందుకుంటున్న అల్పాదాయ వర్గాల ఆర్థిక అవసరాలను ఉన్నతాదాయ వర్గాల వారు , వ్యాపార వర్గాల వారు దృష్టిలో ఉంచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ వర్గాల వారు పని ప్రదేశానికి చేరుకోలేని స్థితిలో ఉన్నందున వారి జీతాలలో కోత పెట్టవద్దని కోరారు. ఇలాంటి పరిస్థితులలో మానవతకు ప్రాధాన్యత నివ్వాలన్నారు.
ప్రధానమంత్రి సిఎఆర్ ఇఎస్ ఫండ్
కోవిడ్ -19 వంటి మహమ్మారి కారణంగా తలెత్తే ఎలాంటి అత్యవసర, విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే ప్రధాన ఉద్దేశంతో ఒక ప్రత్యేక జాతీయ నిధి ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని బాధితులకు సహాయం అందించేందుకు - ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్ - (PM CARES Fund) ను ఏర్పాటు చేశారు.ఈ ఫండ్ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. రక్షణమంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి సభ్యులుగా ఉంటారు.
ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ప్రజల భాగస్వామ్యమే అత్యంత సరైన మార్గమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ విశ్వసిస్తారు. దానిని ఆచరణలో చూపుతారు.అందుకు ఇది మరొక ఉదాహరణ. ఈ ఫండ్ సూక్ష్మ విరాళాలకు కూడా వీలు కల్పిస్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజలు చిన్న మొత్తాలను కూడా కంట్రిబ్యూట్ చేయడానికి వీలు కలుగుతుంది.
1.7 లక్షల కోట్ రూపాయల ఆర్థిక ప్యాకేజీ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చి 26న ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇది పేదలకు అత్యవసర నగదు బదిలీపై దృష్టి పెట్టింది. ఈ ప్యాకేజ్ కింద, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులనుంచి ఆదుకునేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 3 నెలల పాటు ఆహార ధాన్యాలు, పప్పులు, గ్యాస్‌ను ఉచితంగా అందించే నిర్ణయాలు ఉన్నాయి.
డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలతో సమావేశం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మార్చి 24 న వైద్య రంగానికి చెందిన డాక్టర్లు, నర్సులు, సాంకేతిక నిపుణులతో మాట్లాడారు. కోవిడ్ -19 ని ఎదుర్కోవడంలో వైద్యరంగానికి చెందిన వారు దేశానికి అందిస్తున్న నిస్వార్థ సేవకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, భవిష్యత్ పట్ల మీ ఆశావహ దృక్పథం , దేశం తప్పక విజయం సాధిస్తుందన్న గొప్ప విశ్వాసాన్ని నాకు కల్పించింది- అని అన్నారు.
వైద్య రంగంలో పెద్ద ఎత్తున టెలి కన్సల్టేషన్‌కు వీలు కల్పించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
వైద్యుల రక్షణ ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్యతా అంశమని, వీరిని రక్షించుకునేందుకు అవసరమైన ప్రతి చర్యా తీసుకుంటామన్నారు.
ఫార్మా రంగంతో సమావేశం
మందులు, వైద్యపరికరాల నిరంతర సరఫరాకు తీసుకునే చర్యలలో భాగంగా ప్రధానమంత్రి ఫార్మా రంగ ప్రతినిధులతో 2020 మార్చి 21న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్.ఎన్.ఎ టెస్టింగ్ కిట్‌లను యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఎపిఐలు నిర్వహించేందకు , దేశీయంగానే తయారు చేయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
అత్యవసర మందుల సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్‌లు లేకుండా చూడాలన్నారు.
ఆయుష్ ప్రాక్టిషనర్లతో ప్రధానమంత్రి సమావేశం
దేశాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నాలలో భాగంగా ప్రధానమంత్రి ఆయుష్ ప్రాక్టీషనర్లతో కూడా 2020 మార్చి 28న సమావేశమయ్యారు. కోవిడ్ -19ను అదుపు చేసే చర్యలలో భాంగా ప్రస్తుతం ఆయుష్ రంగం ప్రాధాన్యత మరింతగా పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు.
ఆయుష్ నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని , ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ నునియంత్రించేందుకు అనుసరించాల్సిన మంచి పద్ధతులపై సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిందిగా వారిని కోరారు.
మానసిక ఒత్తిడి దూరం చేసి, ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో శరీరాన్ని బలోపేతం చేయడానికి యోగా ఎట్ హోమ్‌ను ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రమోట్ చేస్తున్నందుకు ప్రధానమంత్రి అభినందించారు.
రాష్ట్రాలతో కలసి పనిచేస్తున్న కేంద్రప్రభుత్వం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మార్చి 20 వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ప్రస్తుత సవాలును కలసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తిపై నిరంతర నిఘా, పర్యవేక్షణ ఉండాలని , ఈ మహమ్మారిపై కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడి పోరాటం సాగించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో దేశం కీలక దశలో ఉందని అయితే భయపడాల్సిన పని లేదని ప్రధానమంత్రి రాష్ట్రాల నాయకులకు తెలిపారు.
ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి , ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించారు. దేశంలో పరిస్థితిని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రులు పరీక్షా కేంద్రాలను పెంచాలని , సమాజంలోని పేద వర్గాలకు మరింత సహాయం అందించాలని కోరారు. దీనితో ప్రధానమంత్రి రాష్ట్రాలకు తమ మద్దతు ఉంటుందని, ఆరోగ్యరంగానికి సంబంధించి సామర్ధ్యాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన అత్యావశ్యకమని వారికి సూచించారు. తమ తమ రాష్ట్రాలతో వాణిజ్య సంస్థల సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిందిగా ప్రధానమంత్రి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. అవసరమైన సందర్భాలలో సున్నిత అధికారాలను ఉపయోగించి వారికి నచ్చచెప్పాలని అవసరమైన సందర్భాలలో చట్టపరమైన నిబంధనలు ఉపయోగించాలని సూచించారు.
కలసికట్టుగా సార్క్ ప్రాంతం....
ప్రపంచంలో చెప్పుకోదగినంత జనాభా నివశిస్తున్నసార్క్ దేశాల నాయకులు ప్రాంతీయ సంప్రదింపులు, చర్చలు జరపాలని సూచించిన నాయకులలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొలి వ్యక్తి. సార్క్ దేశాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. భారతదేశ నాయకత్వంలో సార్క్ దేశాల నాయకుల సమావేశం 2020 మార్చి 15న జరిగింది.
సార్క్ సభ్య దేశాలు స్వచ్ఛందంగా కోవిడ్ -19 అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని , సమష్టి కృషితో దీని ఏర్పాటు జరగాలని ప్రధాని తెలిపారు. ఇందుకు భారతదేశం పది మిలియన్ అమెరికన్ డాలర్లను ప్రకటించి సార్క్ దేశాలకు నాయకత్వం వహించింది. ఈ నిధిని సత్వర చర్యలకోసం ఏ దేశమైనా వాడుకోవచ్చు.
ఇతర సార్క్ దేశాలైన నేపాల్, భూటాన్ ,మాల్దీవులు కూడా ఈ అత్యవసర నిధికి తమవంతు సమకూర్చాయి.
అసాధారణ వర్చువల్ జి-20 శిఖరాగ్ర సమ్మేళనం
జి-20 దేశాల నాయకుల వర్చువల్ శిఖరాగ్ర సమ్మేళనం 2020 మార్చి 26న జరిగింది. కోవిడ్ -19 మహమ్మారి విసిరిన సవాలును ఎదుర్కొవడంపై చర్చించి, అంతర్జాతీయంగా సమన్వయంతోకూడిన చర్యలకు వీలుగా దీనిని నిర్వహించారు. అంతకు ముందు ప్రధానమంత్రి ఈ అంశంపై సౌదీ అరేబియా యువరాజుతో టెలిఫోన్‌లో మాట్లాడారు.
ప్రపంచ శ్రేయస్సు ,సహకారం విషయంలో మన దార్శనికత మానవాళి కేంద్రంగా ఉండాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు, వైద్య పరిశోధన , అభివృద్ధి ప్రయోజనాలను స్వేచ్ఛగా , పారదర్శకంగా ఇచ్చిపుచ్చుకోవడం, సానుకూలత, మానవత్వంతో ప్రతిస్పందించే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలన్నారు.
ప్రపంచ మానవాళి మేలుకోసం, కొత్త ప్రపంచీకరణ ఆవిర్భావానికి ఆయా దేశాల నాయకులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. మనవాళి ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకుపోవడంపై దృష్టిపెట్టే బహుళపక్ష వేదికపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ కృషి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు, లతో 12మార్చి ,2020న టెలిఫోన్ లో మాట్లాడారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాన మంత్రి 2020 మార్చి 17న మాట్లాడారు.
మార్చి 25న ప్రధానమంత్రి రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపారు.మార్చి 26న అబుదాబి యువ రాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఖతార్ అమీర్ షేఖ్ తమిమ్ బిన్ హమ్‌దాద్ అల్ తహానితో మాట్లాడరు.
ప్రధానమంత్రి 2020 మార్చి 24న యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సుల వాన్ డెర్ లెయన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు.
ఇతర దేశాలలో చిక్కుకుపోయిన పౌరులకు అండగా
కరోనా వైరస్ అధికంగా ఉన్న చైనా, ఇటలీ, ఇరాన్ అలాగే ప్రపంచంలోని పలు దేశాలలో చిక్కుకుపోయిన 2000 మందిని ప్రధానంమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలొ ప్రభుత్వం అక్కడినుంచి ఖాళీ చేయించింది.
(Release ID: 1609005)
Visitor Counter : 297
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam