సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కోవిడ్ వైరస్ వ్యాప్తి విషయంలో భారత దేశ ప్రతిస్పందన

Posted On: 28 MAR 2020 11:03AM by PIB Hyderabad

కోవిడ్ -19 వైరస్ విషయంలో భారత దేశం ముందస్తుగా, సానుకూలమైన క్రియాశీల మార్గంలో, ఓ పద్ధతి ప్రకారం ప్రతిస్పందిస్తూ వస్తోంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసి (జనవరి 30), ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడానికి ముందే భారతదేశం సరిహద్దుల్లో సమగ్ర ప్రతిస్పందన వ్యవస్థను ఏర్పాటు చేసింది.

దేశీయ ఆగమన ప్రయాణికుల స్క్రీనింగ్ తర్వాత వీసాలు నిలిపివేయడం మరియు అంతర్జాతీయ విమానాల నిషేధం లాంటివి మిగతా దేశాల కంటే ముందే జరిగాయి.

కరోనా వైరస్ మొదటి కేసు 2020 జనవరి 30న భారతదేశంలో బయటపడడానికి చాలా ముందే చైనా మరియు హాంకాంగ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల థర్మల్ స్క్రీనింగ్ జనవరి 18న ప్రారంభం అయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తే ప్రస్తుతం కోవిడ్ -19 బారిన పడి కోలుకోలేని దెబ్బ తగిలిన ఇటలీ మరియు స్పెయిన్ లాంటి దేశాలు తొలి కేసు నమోదు అయిన 25 మరియు 39 రోజుల తర్వాతే ప్రయాణికులను పరీక్షించడం ప్రారంభించాయని ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తే అర్థమౌతోంది.

ప్రయాణ పరిమితులు, స్క్రీనింగ్ కోసం మరిన్ని దేశాలు మరియు విమానాశ్రాయాల సంఖ్యను పెంచడం, వీసాలను నిలిపి వేయడం మరియు వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, నిరోధించడానికి మరియు నిర్వహించడానికి తగిన స్వీయ నిర్బంధ చర్యలు వంటి అనేక చురుకైన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాల కాలక్రమం ఈ విధంగా ఉంది.

జనవరి 17 – చైనాకు ప్రయాణాన్ని నివారిస్తూ, సూచనలు జారీ అయ్యాయి.

జనవరి 18 – చైనా మరియు హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికుల థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభమైంది.

జనవరి 30 – చైనాకు ప్రయాణాలను నివారించేందుకు బలమైన సూచనలు జారీ అయ్యాయి.

ఫిబ్రవరి 3 – చైనా పౌరులకు ఈ-వీసా సౌకర్యం నిలిపివేయబడింది.

ఫిబ్రవరి 22 – సింగపూర్ ప్రయాణాన్ని నివారించేందుకు సూచనలు జారీ అయ్యాయి. ఖాట్మండు, ఇండోనేషియా, వియత్నాం మరియు మలేషియా నుంచి వచ్చే విమానాల యూనివర్సల్ స్క్రీనింగ్ ప్రారంభమైంది.

ఫిబ్రవరి 26 – ఇరాన్, ఇటలీ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు ప్రయాణాన్ని నివారించడానికి సూచనలు జారీ చేయబడ్డాయి. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించి, స్క్రీనింగ్ మరియు ప్రమాద సూచనల ఆధారంగా నిర్బంధం అమలు అయ్యింది.

మార్చి 3 – ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ మరియు చైనాలకు అన్ని రకాల విసాలను నిలిపివేయడంతో పాటు, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, ఇటలీ, హాంకాంగ్, మకావు, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, థాయ్ లాండ్, సింగపూర్ మరియు తైవాన్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేయడం జరిగింది.

మార్చి 4 – అన్ని అంతర్జాతీయ విమాన ప్రయాణికుల యూనివర్సల్ స్క్రీనింగ్ తో పాటు స్వీయ గృహ నిర్బంధం లేదా స్క్రీనింగ్ మరియు ప్రమాద సూచనల ఆధారంగా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, సేవల కోసం పంపిచడం మొదలైంది.

మార్చి 5 – ఇటలీ లేదా రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన ప్రయాణీకుల  ప్రవేశానికి ముందు వైద్య ధృవీకరణ పత్రం తప్పని సరి చేస్తూ నిబంధన

మార్చి 10 – స్వీయ గృహ నిర్బంధం : అంతర్జాతీయ ప్రయాణీకులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకుని ప్రభుత్వానికి తెలియజేయాలి. చేయవలసిన మరియు చేయకూడనవి : చైనా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, ఇటలీ, థాయ్ లాండ్, సింగపూర్, ఇరాన్, మలేషియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల ప్రయాణ చరిత్ర కలిగిన ప్రయాణికులు వారు ప్రయాణం చేసిన తేదీ నుంచి 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలి.

మార్చి 11 – తప్పనిసరి నిర్బంధం – 2020 ఫిబ్రవర 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు జర్మనీ నుంచి వచ్చిన లేదా సందర్శించిన దేశీయ ఆగమన ప్రయాణికులు (భారతీయులతో సహా) కనీసం 14 రోజుల పాటు ఆరోగ్య పరీక్షల కోసం నిర్బంధంలో ఉంచబడతారు.

మార్చి 16, 17, 19 – సమగ్ర సూచనలు

మార్చి 16 – యుఏఈ, ఖతాల్, ఒమన్ మరియు కువైట్ నుంచి వచ్చిన లేదా ప్రయాణం చేసిన వారికి కనీసం 14 రోజుల తప్పని సరి నిర్బంధాన్ని విస్తరించడం జరిగింది.

యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, టర్కీ మరియు యునైటెడ్ కింగ్ డమ్ లోని సభ్య దేశాల నుంచి భారతదేశానికి ప్రయాణికులను పూర్తిగా నిషేధించడం జరిగింది.

మార్చి 17 – ఆఫ్ఘనిస్థాన్, ఫిలిప్పీన్స్, మలేషియా నుంచి ప్రయాణాలు నిషేధించబడ్డాయి.

మార్చి 19 – మార్చి 22 నుంచి అమల్లోకి వచ్చే అన్ని రకాల అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి.

మార్చి 25 –  ఇటలీ లేదా రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి భారతదేశానికి వచ్చే అన్ని అంతర్జాతీయ విమానాల నిలిపివేత 2020 ఏప్రిల్ 14 వరకూ పొడిగించబడింది.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణ సూచనలను సవరించడం మాత్రమే కాకుండా విమానాశ్రయ స్క్రీనింగ్ కూడా అన్ని విమానాశ్రయాలకు విస్తరించబడింది.

విమానాశ్రయాలలో ఆరోగ్య అధికారుల పరీక్షల అనంతరం, ప్రమాద అంచనా ఆధారంగా ప్రయాణికులను నిర్బంధించడం లేదా ఆస్పత్రులకు పంపడం జరిగింది. ఆరోగ్య అధికారులు సూచించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. తద్వారా అవసరమైన రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వారిని ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది.

30 విమానాశ్రయాలు, 12 ప్రధాన మరియు 65 చిన్న విమానాశ్రయాలు మరియు భూ సరిహద్దు భాగంలోనూ ప్రయాణికుల స్క్రీనింగ్ జరిగింది. 36 లక్షలకు పైగా ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించబడ్డాయి.

సంపన్న భారతీయులు స్క్రీనింగ్ లేకుండానే తిరిగి రావడానిక అనుమతింపబడ్డారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మొదటి నుంచి ప్రజారోగ్య సంక్షోభానికి సంబంధించిన బలమైన ప్రతిస్పందనలో భాగంగా స్క్రీనింగ్, నిర్బంధం మరియు నిఘా యొక్క సమగ్ర మరియు దృఢమైన వ్యవస్థను బలంగా ఉంచే విధంగా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంది. ఇది ప్రతి ప్రయాణికుడు, వ్యాపారులు, పర్యాటకు, విద్యార్థులు మరియు విదేశీయులందరినీ ఇది జల్లెడ పట్టగలిగింది.

 

అందరినీ పరీక్షించడం పూర్తయ్యి, ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ నిఘాను కొనసాగించేందుకు మరియు మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను క్రమం తప్పకుండా అభ్యర్థించడం జరిగింది. నిఘా నివారించడానికి ప్రయత్నించిన లేదా నిర్బంధ చర్యలను పాటించని వ్యక్తులను గుర్తించేందుకు ఒక కచ్చితమైన వ్యవస్థలను రాష్ట్రాలతో కలిసి ఏర్పాటు చేసింది.

 

కరోనా సమస్యలను పరిష్కరించేందుకు మరియు సంసిద్ధతను పెంచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలతో 20 మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కేబినెట్ కార్యదర్శులతో 6 వీడియో సమావేశాలు జరిగాయి. ఈ వీడియో సమావేశాల్లో చర్చించిన అనేక సమస్యల్లో అంతర్జాతీయ ప్రయాణికుల పర్యవేక్షణను కలిగి ఉన్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ నిఘా వ్యవస్థ కూడా ఒకటి.(Release ID: 1608836) Visitor Counter : 286