విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్ రంగానికి భారీ పరిహార సహాయాన్ని ఆమోదించిన విద్యుత్ శాఖ మంత్రి

ఈ లాక్డౌన్ సమయంలో 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాకు హామీ ఇచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ

చెల్లింపుల హామీలు 50%నికి తగ్గింపు

Posted On: 28 MAR 2020 10:40AM by PIB Hyderabad

విద్యుత్ ఉత్పత్తి మరియు  ప్రసార  సంస్థలకు  విద్యుత్ సరఫరా సంస్థలు చెల్లించవలసిన చెల్లింపులపై 3 నెలలు అప్పుల నిలుపుదల

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను గడగడలాడిస్తున్న కొవిడ్ 19 వ్యాధి నివారణకు దేశంలో విధించిన లాక్డౌన్ సమయంలో విద్యుత్ రంగంలోని ఉత్పత్తి, ప్రసారం, సరఫరా మరియు వ్యాపార వ్యవహారాల వ్యవస్థలకు సంబంధించిన అన్ని విభాగాలూ వినియోగదారులకు  నిరంతరాయంగా విద్యుత్ సేవలను అందించడానికి నిరంతరం శ్రమిస్తున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆర్కే సింగ్ తెలిపారు.

విద్యుత్ ఉత్పత్తిలో 70% బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతుండగా, బొగ్గు సరఫరాకు అంతరాయం కలుగకుండా దేశీయ బొగ్గు కంపెనీలు మరియు బొగ్గును రవాణా చేసే రైల్వే మంత్రిత్వ శాఖ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ వారితో ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ సత్ససంబంధాలను కలిగి ఉన్నారు.

లాక్డౌన్ కారణంగా విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సరఫరా కంపెనీలకు వారి బకాయిలను చెల్లించలేకున్నారు. ఈ కారణంగా విద్యుత్ ఉత్పత్తి మరియు ప్రసార కంపెనీలకు డిస్కంలు చెల్లించవలసిన బకాయిలను చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. ఈ కారణంగా విద్యుత్ రంగానికి ముఖ్య పరిహార సహాయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆర్కే సింగ్ ఆమోదించారు. అందులో భాగంగా డిస్కంలకు ద్రవ్యసంబంధిత సమస్యలను అధిగమించేందుకు ఈ క్రింది నిర్ణయాలను తీసుకున్నారు-

ఎ. విద్యుత్ ఉత్పత్తి/ ప్రసార కంపెనీలకు డిస్కంలు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నా కూడా సిపిఎస్యు  ఉత్పత్తి/ ప్రసార కంపెనీలు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తాయి. ప్రస్తుత అత్యవసర పరిస్థుతుల్లో ఏ డిస్కానికి కూడా ఎటువంటి విద్యుత్ కోత ఉండదు.

బి.  30 జూన్ 2020 వరకు  విద్యుత్ ఉత్పత్తి మరియు ప్రసార కంపెనీలకు విద్యుత్ సరఫరా సంస్థలు చెల్లించవలసిన చెల్లింపుల భద్రత విధానంలో చెల్లింపుల హామీలను 50% నికి తగ్గించారు.

సి.  విద్యుత్ ఉత్పత్తి మరియు ప్రసార సంస్థలకు డిస్కంలు చెల్లించవలసిన బకాయిలను 3 నెలల వరకు నిలుపుదల చేస్తున్నట్లు మరియు ఆలస్యంగా జరిగే చెల్లింపులపై ఎటువంటి అదనపు పన్నులను విధించరాదని కేంద్ర విద్యుత్ నియంత్రణాధికార సంఘమునుకు ఆదేశాలను ఇచ్చారు. అలాగే  రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంఘాలకు ఇటువంటి ఆదేశాలను ఇవ్వమని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్ధించడమైనది. 

.

 


(Release ID: 1608792) Visitor Counter : 250