రైల్వే మంత్రిత్వ శాఖ
నిత్యావసర వస్తువుల రవాణాలో భారతీయ రైల్వే కృషి
प्रविष्टि तिथि:
27 MAR 2020 4:39PM by PIB Hyderabad
కోవిడ్ 19 మహమ్మారి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో గత నాలుగు రోజుల్లో భారతీయ రైల్వే శాఖ 1.6 లక్షలకు పైగా రైల్వే వ్యాగన్ల ద్వారా వస్తువులను సరఫరా చేసింది. వీటలలో 1 లక్షలకు పైగా వ్యాగన్లలో నిత్యావసర వస్తువులే వున్నాయి. దాంతో వీటికి సంబంధించి ఎలాంటి ఆటంకం కలగలేదు.
ఆహారపదార్థాలు, ఉప్పు, చెక్కర, పాలు, వంట నూనె, ఉల్లిపాయలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, ఎరువులు మొదలైన వాటిని గత నాలుగు రోజులు దేశవ్యాప్తంగా సరఫరా చేశారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారతీయ రైల్వే ఉద్యోగులు 24 గంటలూ పనిచేస్తూ నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆంటకం కలగకుండా చూస్తున్నారు.
ఈ సరుకుల రవాణాకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసర వస్తువుల సరఫరా సులువుగా సాగేలా రైల్వే శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ సరఫరా ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు సీనియర్ అధికారులతో కూడిన ఎమర్జెన్సీ ఫ్రెయిట్ కంట్రోల్ విభాగం పని చేస్తోందని రైల్వే శాఖ తెలిపింది.
ఈ క్లిష్ట సమయంలో అందరమూ కలిసికట్టుగా పని చేయాలని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వస్తువులను ఎక్కించడంలోను, దించడంలోను సంబంధిత విభాగాలు చురుకుగా పని చేయాలని రైల్వేశాఖ కోరింది.
****
(रिलीज़ आईडी: 1608702)
आगंतुक पटल : 163