ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కొవిడ్-19 పై పోరాటం లో భాగంగా రాష్ట్ర గవర్నర్లు, లెఫ్టనెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్

ప్రజల్లో అవగాహనకు కృషి చేయాలి; సామాజిక సంస్థలను ప్రోత్సహించి ప్రైవేట్ రంగం ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా మార్గదర్శకం ఇవ్వండి : ఉపరాష్ట్రపతి

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మొదటి పౌరులుగా ఈ సంక్షోభ కాలంలో మీ నాయకత్వం కీలకం : గవర్నర్లకు సూచించిన ఉపరాష్ట్రపతి

వ్యాధి వ్యాపించకుండా చక్రాన్ని ఛేదించడానికి సామజిక దూరమే కీలకం

ప్రభుత్వాలు సూచించిన నిబంధనలను పౌరులంతా పాటించాలి

పుస్తకపఠనం, యోగ, ధ్యానం, పిల్లలు, పెద్దలతో సమయాన్ని గడపడం చేయండి.

కోవిడ్ ను అంతమొందించడానికి ఆధ్యాత్మికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖుల ద్వారా చైతన్యం కలిగించేలా వారిని భాగస్వామ్యం చేయండి

ఆన్ లైన్ తరగతులు నిర్వహించడానికి తగు మార్గాలను అన్వేషించండి : గవర్నర్లకు ఉపరాష్ట్రపతి సూచన

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2020 2:33PM by PIB Hyderabad

కోవిడ్-19 కి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంపై ప్రజల్లో అవగాహనా కల్పించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు రాష్ట్రాల గవర్నర్లుకేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టనెంట్ గవర్నర్లకు పిలుపునిచ్చారు. సామజిక సంస్థలను ఈ కార్యంలో ప్రోత్సహించాలనిప్రభుత్వంతో ప్రైవేట్ రంగం కలిసి పనిచేసేలా తగు మార్గదర్శకం ఇవ్వాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

రాష్ట్రాల గవర్నర్లులెఫ్టనెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన పిలుపు మేరకు గవర్నర్లను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాల మొదటి పౌరులుగా ఈ సంక్షోభ సమయంలో సృజనాత్మకంగా ఆలోచనలు చేసి సమాజానికి మంచి మార్గదర్శనం చేయాలని కోరారు. 

'మీ నాయకత్వం ఇపుడు చాలా కీలకం. ప్రజలను చైతన్య పరచడంవారిలో ప్రేరణ నింపడం ఇపుడు చాలా ముఖ్యంఅని ఉపరాష్ట్రపతి అన్నారు. 

కోవిడ్-19 వ్యాధిగ్రస్థుల ఐసోలేషన్ వార్డుల కోసం అవసరం మేర విశ్వవిద్యాలయాలుకేంద్రీయ విద్యాలయాలుఇతర విద్యాసంస్థలుధార్మిక సంస్థలు ... ఇలా వివిధ సంస్థల ప్రాంగణాలను వినియోగించుకునేలా వారిలో ప్రేరణ కల్పించాలని గవర్నర్లకు ఉపరాష్ట్రపతి సూచించారు. 

విశ్వవిద్యాలయాల ఛాన్సలర్లుగా కూడా ఉన్నందున గవర్నర్లు వివిధ విద్యాసంస్థలు పాఠ్యాంశాలను పూర్తి చేయడానికి ఆన్‌లైన్ తరగతులను నిర్వహించే అవకాశాన్ని అన్వేషించాలనివిద్యా షెడ్యూల్ చెదిరిపోకుండా చూడాలని ఉపరాష్ట్రపతి చెప్పారు.  

కోవిడ్ -19 రోగులకు ప్రైవేట్ ఆస్పత్రులు కొన్ని పడకలు కేటాయించాలనిరెడ్ క్రాస్ వంటి సంస్థలు రంగంలోకి దిగి పేదలువృద్ధుల విషయంలో మానవతా దృక్పథంతో సహాయం అందించాలని ఉపరాష్ట్రపతి పిలుపు ఇచ్చారు. 

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలను కొనియాడిన ఉపరాష్ట్రపతి టీమ్ ఇండియా స్ఫూర్తితో అంతా పనిచేయాలని అన్నారు. 

  వ్యాధి వ్యాపించకుండా చక్రాన్ని ఛేదించడానికి  సామజిక దూరమే కీలకం అనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లో నాటుకుపోయేలా చేయాలని ఆయన తెలిపారు.

మీరు గడప దాటితేకరోనా లోపడికి వస్తుందిఅనే విషయం ప్రజలంతా అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. 

లాక్ డౌన్ వల్ల ఆర్ధిక పరిస్థితి ఛిన్నాభిన్నం కాకుండా పేదలను ఆదుకోడానికి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి అన్నారు. 

ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ సంక్షోభం నుండి బయటపడగలమనిఇందుకు ప్రభుత్వాలు సూచించిన నియమనిబంధనలు అందరు పాటించాలని ఉపరాష్ట్రపతి పిలుపు ఇచ్చారు. 

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో  మహారాష్ట్రకేరళకర్ణాటకహర్యానాగుజరాత్రాజస్థాన్తెలంగాణపంజాబ్బీహార్మధ్యప్రదేశ్తమిళనాడుపశ్చిమ బెంగాల్హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లుఢిల్లీచండీగఢ్ లెఫ్టనెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. 

 

                                        *****

 


(రిలీజ్ ఐడి: 1608613) సందర్శకుల సూచీ సంఖ్య : : 144
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam