వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఈ కామ‌ర్స్‌, లాజిస్టిక్ పరిశ్ర‌మ వ‌ర్గాల‌తో వీడియో కాన్ప‌రెన్స్ నిర్వ‌హించిన శ్రీ పియూష్ గోయ‌ల్‌

నిత్యావ‌స‌ర వ‌స్తువులు ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా , అత్యంత‌ సుర‌క్షితంగా అందేలా చేసేందుక ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌క‌టించిన మంత్రి

Posted On: 27 MAR 2020 12:28PM by PIB Hyderabad

 

కోవిడ్ -19  లాక్ డౌన్ నేప‌థ్యంలో ఈకామ‌ర్స్‌, లాజిస్టిక్ రంగాలవారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను  ఇందుకు సంబంధించిన వారితో చ‌ర్చించి ప‌రిష్క‌రించేందుకు,  రైల్వేలు, వాణి్జ్యం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్  ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా , అత్యంత‌ సుర‌క్షితంగా అందేలా చేసేందుక ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న ప‌రిశ్ర‌మ వ‌ర్గాల నాయ‌కుల‌కు హామీఇచ్చారు.
ఈ స‌మావేశానికి శ్నాప్‌డీల్‌, షాప్‌క్లూస్‌,ఫ్లిప్‌కార్ట్‌, గ్రోఫెర్స్ , నెట్ మెడ్స్‌, ఫార్మ్ ఈజీ, ఐఎంజి టెక్‌, ఉడాన్‌, అమెజాన్ ఇండ‌యా, బిగ్ బాస్కెట్‌, జొమాటో,  వంటి ఈ కామ‌ర్స్ కంపెనీల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.
పెద్ద రీటైల్ ఆప‌రేట‌ర్ల త‌ర‌ఫున మెట్రోక్యాష్ అండ్ క్యారీ, వాల్‌మార్ట్‌, ఆర్‌పిజి  ప్ర‌తినిధులు హాజ‌రుకాగా లాజిస్టిక్ ఆప‌రేట‌ర్ల త‌ర‌ఫున‌ ఎక్స్‌ప్రెస్ ఇండ‌స్ట్రీ కౌన్సిల్‌, డెలిహివెరి, సేఫ్ ఎక్స్‌ప్రెస్‌, పే టిఎం, స్విగ్గీ ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.
డిపిఐఐటి రీటైల‌ర్లు, ఈకామ‌ర్స్ కంపెనీల‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతూ నిత్యావ‌స‌ర వ‌స్తువుల నిరంత‌రాయంగా స‌ర‌ఫ‌రా అయ్యేట్టు చూస్తోంది.  దీనితో నిత్యావ‌స‌ర వ‌స్తువుల స‌ర‌ఫ‌రా కు  సంబంధించి
వివిధ అంశాల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు హోంమంత్రిత్వ‌శాఖ ప్ర‌మాణీకృత మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది.
 లాక్‌డ‌న్ స‌మ‌యంలో  స‌ర‌కు ర‌వాణా, త‌యారీ,  సామాన్యుడికి చేర‌వేత వంటి వాటి్కి సంబంధించి  ఆయా సంస్థ‌లు ఎదుర్కొనే ఇబ్బందుల‌ను ప‌రిశీలించేందుకు ఈ డిపార్ట‌మెంట్  ఒక కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసి నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తోంది.
           దేశ‌వ్యాప్త లాక్ డౌన్ కార‌ణంగా ఇండియ‌న్ పేటెంట్స్ కార్యాల‌యం స‌మాధానాలు దాఖ‌లు చేయ‌డం, ఫీజుల చెల్లింపు వంటి వాటి గ‌డువును పొడిగించింది.
 పేటెంట్, డిజైన్  ట్రేడ్ మార్క్ ల కోసం దరఖాస్తులు సమర్పించాల్సిన తేదీ లాక్‌డౌన్ కాలంలో ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ దరఖాస్తుదారులందరికీ ఇది సహాయపడుతుంది


(Release ID: 1608537) Visitor Counter : 211