విద్యుత్తు మంత్రిత్వ శాఖ
వెంటిలేటర్ల కొనుగోలుకు కోటి రూపాయలు అందించనున్న ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2020 11:21AM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ కింద గల మినీరత్న ప్రభుత్వరంగ సంస్థ ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని( కోవిడ్ -19) ఎదుర్కొనేందుకు పలు చర్యలు చేపట్టింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో , కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కోటి రూపాయలు అందించేందుకు ఈ సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఈ మొత్తాన్ని సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో ఆరు వెంటిలేటర్ల కొనుగోలుకు, తాండాలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మెడికల్ కాలేజీ 5 వెంటిలేటర్ల కొనుగోలుకు, ఖనేరిలోని రామ్ పూర్ ఆస్పత్రి మరికొన్ని వెంటిలేటర్ల కొనుగోలుకు వినియోగించనున్నట్టు ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్ ఛైర్మన్ నంద్ లాల్ శర్మ తెలిపారు. మాస్క్‌లు , శానిటైజర్లు, గ్లోవ్‌ల వంటి అత్యావశ్యకాలను ఈ వైద్య సంస్థలకు అందించేందుకు కూడా ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్ ఆర్థికంగా తోడ్పాటు నందించనుంది.
(రిలీజ్ ఐడి: 1608507)
సందర్శకుల సూచీ సంఖ్య : : 131