ప్రధాన మంత్రి కార్యాలయం

దేశ‌వ్యాప్తంగా వివిధ పండుగ‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

పరిస్థితులను అధిగమించడానికి మ‌న సంకల్పాన్ని బలోపేతం చేసేవే పండుగలని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

Posted On: 25 MAR 2020 9:52AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా వివిధ పండుగ‌ల సందర్భంగా ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోడీ ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపారు

ఇందుకు సంబంధించి  ట్విట్ట‌ర్ ద్వారా ప‌లు సందేశాలు ఇస్తూ  ప్ర‌ధాన‌మంత్రి , దేశ‌వ్యాప్తంగా మ‌న సంప్ర‌దాయ కేలండ‌ర్ ప్ర‌కారం నూత‌న సంవ‌త్స‌ర ఆరంభానికి గుర్తుగా మ‌నం వివిధ పండుగ‌లు జ‌రుపుకుంటున్నాం. ఉగాది, గుడిప‌ర్వ‌, న‌వ్‌రేహ్‌, స‌జిబు చైరోబ సంద‌ర్భంగా  ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు. ఈ ప‌విత్ర ఈ శుభ సమ‌యం మన జీవితానికి మంచి ఆరోగ్యం, ఆనందం  శ్రేయస్సును అందించ‌గ‌ల‌ద‌ని ఆకాంక్షిస్తున్నాను..
దేశం కోవిడ్ -19 మ‌హ‌మ్మారితో పోరాడుతున్న స‌మ‌యంలో మ‌నం ఈ పండుగ‌ల‌ను జ‌రుపుకుంటున్నాం.  ఈ పండుగ‌లు మ‌నం ఎప్పుడూ సాధార‌ణంగా జ‌రుపుకునే వాటిలా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ మ‌నం ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అధిగ‌మించ‌డానికి ఇవి మ‌న సంక‌ల్పాన్ని బ‌లోపేతం చేస్తాయి.  మ‌నం క‌ల‌సిక‌ట్టుగా కొవిడ్‌-19 పై  మ‌న పోరాటాన్ని కొన‌సాగిద్దాం- అని పేర్కొన్నారు.

***



(Release ID: 1608292) Visitor Counter : 136