ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19పై పోరాటానికి సంబంధించి దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
మార్చి నెల 22వ తేదీ న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’
దేశ ప్రజల కు నిస్వార్థ సేవల ను అందిస్తున్న వారి కి మార్చి నెల 22వ తేదీ న సాయంత్రం 5 గంటల కు ధన్యవాదాలు తెలపనున్న పౌరులు
ప్రపంచ వ్యాప్త వ్యాధి రువ్వుతున్న ఆర్థిక సవాళ్ల ను ఎదుర్కొనేందుకు ‘కోవిడ్-19 ఆర్థిక ప్రతిస్పందన కార్యాచరణ బృందా’న్ని ఏర్పాటు చేయడమైంది
భయాందోళనలతో కొనుగోళ్లు జరపడాన్ని మానుకోండంటూ పౌరుల కు సూచించిన ప్రధాన మంత్రి; నిత్యావసరాల లభ్యత పై హామీ
Posted On:
19 MAR 2020 8:41PM by PIB Hyderabad
సిఒవిఐడి-19 (కోవిడ్-19) విసరిన సవాలు ను ఎదుర్కోవడం పై దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
‘నవ్ రాత్ర’ సందర్భం లో ప్రధాన మంత్రి తొమ్మిది అభ్యర్థనల ను ప్రజల ముందు ఉంచారు.
ప్రపంచం అంతటా భారీనష్టాన్ని కలుగజేసినటువంటి విశ్వ మహమ్మారి తో పోరాడడం లో భారతీయులందరి సంకల్పం మరియు సహనం కీలకం అని ప్రధాన మంత్రి అన్నారు. వేగం గా వ్యాప్తి చెందుతున్న వైరస్ ను అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తల ను తీసుకోవాలంటూ పౌరుల ను ఆయన కోరారు. ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి ని తేలిక గా తీసుకోకూడదనే అంశాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుందని ఆయన నొక్కి పలుకుతూ, కోవిడ్-19 పట్ల అవగాహన ను కలిగివుండవలసిన అవసరం తో పాటు తదనుగుణమైన క్రియాశీలత్వాన్ని అలవరచుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
“మనం ఆరోగ్యం గా ఉంటే, ప్రపంచం ఆరోగ్యం గా ఉంటుంది” అనే మంత్రాన్ని అనుసరించవలసిందంటూ పౌరుల ను ప్రధాన మంత్రి కోరారు. ‘సామాజిక దూరాన్ని’ పాటించడం వంటి స్వీయ నిర్దేశిత కట్టుబాటుల కు పెద్దపీట వేయాలి అంటూ ఆయన స్పష్టంచేశారు. పౌరులు ఓరిమి తో ఈ నియమాన్ని పాటించాలని, ఎవరి కి వారు గా విడిగా ఉండటాన్ని అలవరచుకోవలసిన అవసరం ఉంది అని, అదే విధం గా ఇంటి లో ఉంటూనే పని చేసేందుకు ప్రయత్నించండి అని, అనవసరపు ప్రయాణాలు పెట్టుకోవడాన్ని మానుకోండి అని, అలాగే తప్పనిసరి అయితేనే ఇంటి ని వదలి బయట కు రండి అని ఆయన సూచించారు. 60 ఏళ్లు పైబడిన వయో వృద్ధులు రాబోయే కొద్ది వారాల పాటు వారి ఇళ్లలో నుండి బయటకు అడుగుపెట్టవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. వైద్యశాలల పై ఒత్తిడి ని గురించి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, క్రమబద్ధ ఆరోగ్య పరీక్ష లు చేయించుకోవడాన్ని ఈ కాలం లో తప్పించుకోవలసింది గాను, అలాగే, నిర్దారిత శస్త్రచికిత్సల ను సైతం సాధ్యపడేటట్టు ఉంటే గనక వాయిదా వేసుకోవలసిందిగాను ప్రతి ఒక్కరి ని ప్రధాన మంత్రి కోరారు.
జనతా కర్ఫ్యూ
2020వ సంవత్సరం లో మార్చి నెల 22వ తేదీ న ఉదయం 7 గంటల మొదలుకొని రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ భావన ను అమలుపరచవలసిందంటూ పౌరుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగం గా అత్యవసర సేవల లో పాలుపంచుకోవలసిన వారు మినహా ఏ ఒక్కరు కూడా బయట కు రాకుండా ఇళ్ల లోనే ఉండిపోతారు అని ఆశిస్తామని ఆయన తెలిపారు. ఈ తరహా ప్రజాందోళన తాలూకు సాఫల్యం మరియు దీని నుండి దక్కించుకొనేటటువంటి అనుభవం.. ఇవి మన ముందున్న సవాళ్ల విషయం లో మనలను సంసిద్ధం చేయగలుగుతాయి అని ఆయన పేర్కొన్నారు. మార్చి మాసం 22వ తేదీ న మనం చేసే కృషి దేశ హిత పరిరక్షణ సంబంధి విధి నిర్వహణ లో మన ఆత్మసంయమనం యొక్క మరియు దృఢనిశ్చయం యొక్క సంకేతం గా నిలుస్తాయి అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
‘జనతా కర్ఫ్యూ’ విషయమై ప్రజల లో అవగాహన ను కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నాయకత్వ బాధ్యత ను తీసుకోవాలని ప్రధాన మంత్రి కోరారు. ఎన్ సిసి, ఎన్‌ఎస్‌ఎస్ ల వంటి యువజన సంస్థ లు, పౌర సంఘాల ను కూడా ఈ బాధ్యత ను పంచుకోవాలని ఆయన కోరారు. ఈ స్వీయ నిర్దేశిత కర్ఫ్యూ ను గురించి ప్రతి ఒక్క వ్యక్తి కనీసం మరో పది మంది కి ఫోన్ ద్వారా సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయవలసింది గా ఆయన కోరారు.
నిస్వార్థ సేవాప్రదాతల కు ధన్యవాదాలు తెలియజేయడం
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారిపై పోరాటం లో ఎందరో సాహసులు అగ్రభాగాన నిలచి మరీ ప్రజల కు సేవలను అందిస్తున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు. ఈ మేరకు వైద్య, పోలీసు, ప్రభుత్వ, విమాన, ప్రసార మాధ్యమాల సిబ్బంది తో పాటు బస్సు/ రైలు/ మోటారువాహన చోదకులు, గృహ సరఫరా సేవల లో ఉన్న వారి ని ప్రధానం గా గౌరవించుకోవాలని సూచించారు. ఇటువంటి పరీక్షా కాలం లో దేశ ప్రజల కు వారు చేస్తున్న సేవలకుగాను మార్చి నెల 22వ తేదీ న సాయంత్రం 5 గంటల కు పౌరులంతా వారి ఇళ్ల బాల్కనీల లో, ప్రవేశద్వారాల వద్ద నిల్చొని కరతాళ ధ్వనుల తో గౌరవాభివందనం చేయాలని లేదా డోర్ బెల్ ను ఐదు నిమిషాల పాటు మోగించడం ద్వారా కృతజ్ఞత వ్యక్తం చేయాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
స్థానిక స్వపరిపాలన సంస్థ లు దీనిని గుర్తుకు తెస్తూ సాయంత్రం 5 గంటల కు ఒక సైరన్ ను మోగించడం వంటి చర్య లు చేపట్టాలని ఆయన కోరారు.
ఆర్థిక సవాళ్ల ను ఎదుర్కోవడం
ప్రపంచ వ్యాప్త వ్యాధి కారణం గా తల ఎత్తిన ఆర్థిక సవాళ్ల ను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వం లో ‘కోవిడ్-19 ఆర్థిక ప్రతిస్పందన కార్యాచరణ బృందం’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ సవాళ్లను పరిష్కరించే దిశ గా వివిధ భాగస్వాముల తో ఈ బృందం సమాలోచన చేయడంతో పాటు సమాచారాన్ని సేకరిస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ ఆధారం గా సవాళ్ల పై తదుపరి నిర్ణయాల ను తీసుకొంటుందని వివరించారు. అంతేకాకుండా వాటి ని తు.చ. తప్పకుండా అమలు చేసేటట్టు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. స్వల్పాదాయ వర్గాల ఆర్థిక అవసరాల ను గమనించి తీర్చేటట్టు వారి నుండి సేవల ను పొందే వ్యాపార సమాజం, అధికాదాయ వర్గాల వారు శ్రద్ధ తీసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. అలాగే పని ప్రదేశాని కి చేరుకోలేని కారణం గా సేవల ను అందించలేకపోయే వారి కి ఆయా రోజుల కు గాను వేతనాల లో కోత పెట్టవద్దని ఆయన కోరారు. ఇటువంటి కాలాల లో మానవత్వం ప్రధానమంటూ ఆయన నొక్కి వక్కాణించారు.
దేశం లో ఆహారం, పాలు, మందులు తదితర నిత్యావసరాల కు ఎట్టి పరిస్థితుల లోను కొరత ఏర్పడదు అంటూ దేశ వాసుల కుప్రధాన మంత్రి భరోసా ను ఇచ్చారు. భయాందోళనల తో కొనుగోళ్ల కు ఒడిగట్టకండి అంటూ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
కోవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎవరికి వారు వారి వంతు గా తోడ్పాటు ను ఇస్తూ కలసికట్టు గా కృషి చేద్దాము అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారానికి బలికాకండి అంటూ పౌరుల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రపంచ మహమ్మారి విజృంభించిన వేళ, ‘మానవజాతి గెలవాలి, భారతదేశం గెలవాలి’ అనేది తథ్యం గా జరిగేటట్టు చూడటం ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు.
**
(Release ID: 1607464)
Visitor Counter : 252
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam