ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై రాజ్య సభ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం


గౌర‌వ‌నీయ చైర్ మన్‌,

Posted On: 06 FEB 2020 8:00PM by PIB Hyderabad

మాన్య రాష్ట్ర‌ప‌తి పార్ల‌మెంటు సంయుక్త స‌మావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం నుండి నేర్చుకొన్న‌ పాఠాలు, 130 కోట్ల మంది భార‌తీయుల ఆశ‌ లు, ఆకాంక్ష‌ల‌ ను ప్ర‌తిబింబించేవి గా ఉన్నాయి.  మాన్య రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాని కి మ‌ద్ద‌తు గా నేను స్వ‌యం గా ఈ స‌భ‌ కు హాజ‌ర‌య్యాను.

ఈ ప్ర‌సంగంపై సుమారు 45 మందికి పైగా గౌర‌వ స‌భ్యులు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.  ఇది పెద్ద‌ల స‌భ‌.  అనుభ‌వ‌జ్ఞులైన గొప్ప‌ వారి స‌భ‌. చ‌ర్చ యొక్క స్థాయి ని పెంచ‌డానికి ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌య‌త్నించారు.  శ్రీ‌మాన్ గులాం న‌బీ ఆజాద్‌ గారు, శ్రీ‌మాన్ ఆనంద్ శ‌ర్మ గారు, శ్రీ‌మాన్ భూపేంద్ర‌ యాద‌వ్‌ గారు, శ్రీ‌మాన్ సుధాంశు త్రివేది గారు, శ్రీ‌మాన్ సుధాక‌ర్ శేఖ‌ర్‌ గారు, శ్రీ‌మాన్ రామ‌చంద్ర ప్ర‌సాద్‌ గారు, శ్రీ‌మాన్ రాంగోపాల్‌ గారు, శ్రీ‌మాన్ స‌తీశ్ చంద్ర‌మిశ్ర గారు, శ్రీ‌మాన్ సంజ‌య్ రౌత్‌ గారు, శ్రీ‌మాన్ స్వ‌ప‌న్‌దాస్ గారు, శ్రీ‌మాన్ ప్ర‌స‌న్న ఆచార్య‌ గారు, శ్రీ‌మాన్ న‌వ‌నీత్‌ గారు ల వంటి గౌర‌వ స‌భ్యులు వారి యొక్క అభిప్రాయాల‌ ను వ్య‌క్తం చేశారు. 

వీరంద‌రి ప్ర‌సంగాల నుండి నేను నోట్సు తీసుకొనేట‌పుడు ఎన్నో కొత్త విష‌యాలు వెలుగుచూశాయి. గ‌డచిన సమావేశాల లో ఈ స‌భ ఎంతో ఫ‌ల‌వంతం గా సాగింద‌న్న‌ది వాస్త‌వం.  ఇది గౌర‌వ‌నీయ స‌భ్యులంద‌రి స‌హ‌కారం తో సాధ్య‌మైంది.  ఇందుకు ఈ స‌మున్న‌త స‌భ గౌర‌వ స‌భ్యులంద‌రికీ అభినంద‌న‌ లు. ఈ స‌భ ఎంతో అనుభ‌వం క‌లిగిన స‌భ్యుల స‌భ‌.  అందువ‌ల్ల స‌హ‌జంగానే దేశ‌ ప్ర‌జ‌ల‌ కు ఎన్నో ఆకాంక్ష‌ లు ఉంటాయి.  అధికార ప‌క్ష స్థానాల లో ఆసీనులు అయిన స‌భ్యుల‌ కు ఎన్నో ఆకాంక్ష‌ లు ఉంటాయి.  నా వ‌ర‌కు నాకు కూడా ఎన్నో ఆకాంక్ష‌ లు ఉన్నాయి.  మీ కృషి కార‌ణం గా, దేశం కోసం ఎన్నో మంచి విష‌యాలు వెలుగు చూస్తాయని,  నా వంటి కొత్త స‌భ్యుల‌కు విలువైన మార్గ‌ద‌ర్శ‌నం ల‌భిస్తుందని నా ఆకాంక్ష‌.  అయితే ఈ ఆకాంక్ష‌ లు ఇలా ఉన్న‌ప్ప‌టికీ నేను నిరాశ‌ కు లోనయ్యాను.  మీరు ఇంత‌కు ముందు ఉన్న‌ చోటు కే ప‌రిమిత‌ం అయినట్లు ఉంది.  కొన్ని సంద‌ర్భాల‌ లో వెనుకకు పోతున‌ట్టు కూడా అనిపిస్తోంది.  దేశ  ప్ర‌జ‌ల‌లో నిరాశాపూరిత ప‌రిస్థితి ని క‌లిగించే బ‌దులు మీరు  దేశాని కి స‌రైన దిశానిర్దేశం చేసి ఉంటే బాగుండేది.  ప్ర‌భుత్వానికి కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచ‌న‌ లు, కొత్త శ‌క్తి అందించ‌డానికి బ‌దులు స్త‌బ్ద‌తే మంచిది అని మీరు భావించిన‌ట్లు ఉన్నారు. ఈ సంద‌ర్భం గా నాకు కాకా హ‌త‌ర‌సి హాస్య‌ క‌విత గుర్తుకు వ‌స్తోంది.

ప్ర‌కృతి బ‌ద‌లాతీ క్ష‌ణ్ -క్ష‌ణ్ దేఖో,
బ‌ద‌ల్ ర‌హే అణు,  క‌ణ్‌-క‌ణ్ దేఖో,
తుమ్ నిష్క్రియా సే ప‌డే హువే హో,
భాగ్య‌వాద్ ప‌ర్ అడే హువే హో,
ఛోడో మిత్ర్ ! పురానీ డ‌ఫ్ లీ,
జీవ‌న్ మే ప‌రివ‌ర్త‌న్ లావో,
ప‌రంప‌రా సే ఊంచే ఉఠాక‌ర్‌,
కుఛ్ తో స్టాండ‌ర్డ్ బ‌నావో.. అంటూ 

ఆయన ఎంత చక్కగా చెప్పారో.

గౌర‌వ‌నీయ చైర్ మన్‌ గారు, 

చ‌ర్చ‌ ను ప్రారంభిస్తూ గులాం న‌బీ గారు త‌మ ప్ర‌సంగం లో కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు.  చాలా సంద‌ర్భాల‌ లో ప్ర‌భుత్వాన్ని ప‌లు ర‌కాలు గా విమ‌ర్శించ‌డానికి ప్ర‌య‌త్నించారు.  అయితే అది చాలా స‌హ‌జ‌మైన విష‌యం.  అయితే వారు నిరాధార‌మైన విష‌యాల ను ప్ర‌స్తావిస్తున్నారు.  జ‌మ్ము, కశ్మీర్ పై స‌భ‌ లో ఎటువంటి చ‌ర్చ లేకుండానే నిర్ణ‌యం జ‌రిగిన‌ట్టు చెప్పారు.  దీనిపై చ‌ర్చ‌ ను దేశ ప్రజలు ఒక రోజంతా టీవీల‌ లో చూశారు. విన్నారు.  విస్తృత‌ స్థాయి లో జరిగిన ఈ చ‌ర్చ‌ ను దేశ ప్రజానీకం వీక్షించింది. ఈ విస్తృత చ‌ర్చ త‌రువాతే స‌భ నిర్ణయాని కి వ‌చ్చింది.  గౌర‌వ స‌భ్యులు వారి వోటు హ‌క్కు ను వినియోగించుకోవ‌డం ద్వారా దీనిని నిర్ణ‌యించారు.

ఆజాద్ సాహిబ్‌, మీ జ్ఞాప‌క‌ శ‌క్తి ని  మ‌రింత గా రిఫ్రెష్ చేయ‌నివ్వండి.  ప్ర‌జ‌లు 
ప్రజలు పాత దోపిడీదారుల‌ ను అంత‌ త్వరగా మరచిపోరు.  తెలంగాణ పై సభ ఎలా నిర్ణయించిందో గుర్తు పెట్టుకోండి.  స‌భ‌ కు తాళం వేశారు. టీవీ లు ఆపివేశారు. చర్చ కు అవ‌కాశ‌మే లేదు.  ఎటువంటి ప‌రిస్థితుల‌ లో అది ఆమోదించారో ఎవరూ మరచిపోలేరు.  కాబట్టి మాకు సలహా ఇవ్వండి, మీరు సీనియర్,  ఇప్పటికైనా నిజం అంగీకరించాలి.
ద‌శాబ్దాల అనంతరం, కొత్త రాష్ట్రం ఏర్పాటు కు మీకు అవ‌కాశం దొరికింది. ప్ర‌తి ఒక్క‌రినీ వెంట‌బెట్టుకొని వారి ఆకాంక్ష‌ల మేర‌కు, ఉత్సాహం తో చేసి ఉండ‌వ‌చ్చు.  కొద్దిసేప‌టి క్రిత‌మే , ఆనంద్‌ జీ చెబుతూ వ‌చ్చారు, మీరు రాష్ట్రాల‌ ను అడిగారా, ఇత‌రుల‌ ను అడిగారా అని . ఆయన చాలా చెబుతున్నారు. అంతెందుకు , క‌నీసం వారు ఆంధ్ర- తెలంగాణ ప్ర‌జ‌ల‌ ను వారి ఆకాంక్ష ఏమిటో అడిగి ఉండ‌వ‌చ్చు.  కానీ మీరేం చేశార‌న్న‌ది చ‌రిత్ర‌.  అప్ప‌టి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ మ‌న్ మోహ‌న్ సింగ్ గారు, ఒక విష‌యం లోక్‌ స‌భ‌ లో చెప్పారు.  దాని ని ఈ రోజు న మ‌నం గుర్తుంచుకోవాలని నేను భావిస్తున్నాను.

వారు ఇలా అన్నారు.

“తెలంగాణ అంశం పై జ‌రుగుతున్న నిర‌స‌న‌ ల కార‌ణం గా భారతదేశం లో ప్ర‌జాస్వామ్యాని కి న‌ష్టం వాటిల్లుతోంది.  అట‌ల్‌ గారి ప్ర‌భుత్వం పూర్తి గౌర‌వం తో, శాంతియుతం గా, సామ‌ర‌స్య‌పూర్వ‌కం గా ఉత్త‌రాఖండ్‌, ఝార్ ఖండ్ , ఛత్తీస్ గఢ్ ల‌ ను  ఏర్పాటు చేసింది. ఇవాళ ఈ మూడు కొత్త రాష్ట్రాలు త‌మ‌దైన పంథాలో దేశ ప్ర‌గ‌తి కి దోహ‌దం చేస్తున్నాయి.”
జ‌మ్ము, కశ్మీర్‌, ల‌ద్దాఖ్ ల‌ పై తీసుకొన్న ఏ నిర్ణ‌య‌ం అయినా స‌రే దానిని సుదీర్ఘ‌మైన‌, సంపూర్ణ‌మైన చ‌ర్చ‌ ద్వారానే తీసుకోవ‌డం జ‌రిగింది.
జమ్ము, కశ్మీర్ పరిస్థితుల పై కొంత  స‌మాచారాన్ని ఇక్కడ సమర్పించారు.  నా దగ్గర కూడా కొన్ని గణాంకాలు ఉన్నాయి.  నేను కూడా  స‌భ‌ లో దీనిపై ఒక ప్ర‌క‌ట‌న ను చేయాల‌ని భావిస్తున్నాను.

20 జూన్ 2018 - ప్రభుత్వం పతనం తరువాత, రాష్ట్రపతి పాలన విధించబడింది. ఆర్టికల్ 370 ను తొలగించాలని నిర్ణయించడం జ‌రిగింది.

దాని త‌రువాత‌, తొలిసారిగా, పూర్వ‌పు రాష్ట్రం లోని అణ‌గారిన వ‌ర్గాల ప్ర‌జ‌లు ,పేద‌లు రిజ‌ర్వేశన్ ప్ర‌యోజ‌నాల‌ ను పొంద‌గ‌లిగారు.

తొలిసారి గా జమ్ము, కశ్మీర్ ‌లోని ప‌హాడి -మాట్లాడే ప్ర‌జ‌లు రిజ‌ర్వేశన్ ప్ర‌యోజ‌నాలను పొందారు.

తొలిసారి గా జమ్ము, కశ్మీర్ లోని మ‌హిళ‌లు , రాష్ట్రం వెలుపలి వ్య‌క్తి ని వివాహం చేసుకున్న‌ప్ప‌టికీ ఆస్తి ని క‌లిగి ఉండే హ‌క్కు కొన‌సాగించ‌డానికి హ‌క్కు పొందారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా బ్లాక్ డెవ‌ల‌ప్‌మెట్ కౌన్సిల్‌ కు ఎన్నిక‌లు జ‌రిగాయి.

తొలిసారి గా జ‌మ్ము, కశ్మీర్‌ లో ఆర్‌ఇఆర్‌ఎ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చింది.
తొలిసారి గా స్టార్ట్ అప్ పాలిసి, ఎగుమ‌తులు, వాణిజ్య విధానం, లాజిస్టిక్ పాల‌సీల‌ ను జ‌మ్ము, కశ్మీర్‌ లో అమ‌లు చేస్తున్నారు.

దేశ ప్ర‌జ‌ల‌ కు ఆశ్చ‌ర్యం గొలిపే మ‌రో అంశం, తొలిసారి గా, జ‌మ్ము, కశ్మీర్‌ లో అవినీతి నిరోధ‌క బ్యూరో ను ఏర్పాటైంది.

తొలిసారి గా, స‌రిహ‌ద్దుల వెలుప‌ల నుండి వేర్పాటువాదుల‌ కు నిధులు అందుబాటులోకి రావ‌డాన్ని నియంత్రించ‌డం జ‌రిగింది.

తొలిసారి గా వేర్పాటు వాదుల‌ ను స‌న్మానించే సంప్ర‌దాయాని కి చ‌ర‌మ గీతం పాడ‌డం జ‌రిగింది.

తొలిసారి గా, జ‌మ్ము, కశ్మీర్‌ లో పోలీసు, భ‌ద్ర‌తా ద‌ళాలు ఉగ్ర‌వాదుల‌ కు వ్య‌తిరేకం గా నిర్ణ‌యాత్మ‌క చ‌ర్య‌ లు తీసుకోగ‌లుగుతున్నారు.

తొలిసారి గా, జ‌మ్ము, కశ్మీర్‌ లో పోలీసు సిబ్బంది , ఇత‌ర కేంద్ర  ప్ర‌భుత్వ సిబ్బంది ద‌శాబ్దాలు గా పొందుతున్న అల‌వెన్సు ల ప్ర‌యోజ‌నాల‌ ను పొందారు.

తొలిసారి గా జ‌మ్ము, కశ్మీర్‌ పోలీసులు ఇప్పుడు ఎల్‌ టిసి తీసుకుని క‌న్యాకుమారి కి లేదా ఈశాన్య రాష్ట్రాల‌ కు, అండ‌మాన్- నికోబార్‌ కు వెళ్ల‌వ‌చ్చు.

గౌర‌వ చైర్ మన్‌ గారు,

గ‌వ‌ర్న‌ర్ పాల‌న త‌రువాత 18 నెల‌ల్లో 4400 స‌ర్పంచ్‌ లు, 35 వేల కు పైగా పంచెస్ ప‌ద‌వుల‌ కు శాంతియుతం గా ఎన్నిక‌లు జ‌రిగాయి.

18 నెల‌ల్లో, 2.5 ల‌క్ష‌ల టాయిలెట్ లను జ‌మ్ము, కశ్మీర్‌ లో నిర్మించడం జ‌రిగింది.

18 నెల‌ల్లో, జ‌మ్ము, కశ్మీర్‌ లో  3 ల‌క్ష‌ల 30 వేల ఇళ్ల‌కు విద్యుత్ క‌నెక్ష‌న్ క‌ల్పించ‌డం జ‌రిగింది.

18 నెల‌ల్లో, జ‌మ్ము, కశ్మీర్‌ లోని 3.5 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌ల‌ కు ఆయుష్మాన్ యోజ‌న‌. గోల్డ్ కార్డు లు ఇవ్వ‌డం జ‌రిగింది.

ప‌ట్టుమ‌ని 18 నెల‌ల్లో జ‌మ్ము, కశ్మీర్‌ లో ఒక‌టిన్న‌ర ల‌క్ష‌ల‌ మంది వ‌యోధికులు, మహిళ‌ లు, దివ్యాంగుల ను పెన్ష‌న్‌ ప‌థ‌కం తో జోడించడమైంది.

అభివృద్ధి ఇంత‌కు ముందు కూడా జ‌రిగిన‌ట్టు ఆజాద్ సాహిబ్  చెప్పుకొచ్చారు. మేము ఎప్పుడూ అలా అనలేదు.  అయితే అభివృద్ధి ఎలా చోటు చేసుకొంటూ వ‌చ్చిందో నేను ఒక ఉదాహ‌ర‌ణ ను చెబుతాను.

2018 మార్చి నాటి కి  ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం లో కేవ‌లం 3.5 వేల ఇళ్లు నిర్మిత‌మ‌య్యాయి.   ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న లో భాగం గా మూడు న్న‌ర వేలు.  రెండు సంవ‌త్స‌రాల లోప‌ల 24 వేల ఇళ్లు ఈ ప‌థ‌కం లో నిర్మించ‌బ‌డ్డాయి

ఇప్పుడు సంధానాన్ని పెంచేందుకు, పాఠ‌శాల‌ ల ప‌రిస్థితి ని మెరుగుప‌రచేందుకు, ఆస్ప‌త్రుల స్థాయి ని పెంచేందుకు, నీటిపారుద‌ల స‌దుపాయాల‌ను పెంచేందుకు, ప‌ర్యాట‌కాన్ని పెంచేందుకు  పిఎమ్ పాకేజ్ తో పాటు, ఎన్నో ఇత‌ర ప‌థ‌కాల ను ముందుకు తీసుకుపోవ‌డం జ‌రుగుతోంది.

గౌర‌వ‌నీయ వైకోజీ గారి ది ఒక స్ట‌యిల్‌.  వారు ఎప్పుడూ చాలా భావావేశభరితులై ఉంటారు.  2019వ సంవత్సరం ఆగ‌స్టు 5 వ తేదీ న జ‌మ్ము, కశ్మీర్‌ కు బ్లాక్ డే అని వారు చెప్పారు. వైకోజీ ఇది బ్లాక్ డే కాదు.  ఉగ్ర‌వాదాన్ని, వేర్పాటు వాదాన్ని ప్ర‌మోట్‌ చేసే వారికి ఇది బ్లాక్‌డే అని అది రుజువుచేసింది.

ల‌క్ష‌లాది కుటుంబాల‌ లో ఇవాళ కొత్త విశ్వాసాన్ని, ఒక గొప్ప ఆశా కిర‌ణాన్ని చూస్తున్నాము.

గౌర‌వ‌నీయ చైర్ మన్‌ గారు,  ఈశాన్య ప్రాంతాన్ని గురించి కూడా ఇక్క‌డ‌ చ‌ర్చ జ‌రిగింది. ఆజాద్ సాహిబ్ చెబుతున్నారు, ఈశాన్యం త‌గ‌ల‌బ‌డిపోతున్న‌ద‌ని.  అక్క‌డ అది త‌గ‌ల‌బ‌డి పోతుంటే, ముందు మీరు మీ ఎంపీ ల ప్ర‌తినిధి బృందాన్ని అక్క‌డ‌ కు పంపి ఉండే వారు. అక్క‌డ విలేకరుల సమావేశాన్ని పెట్టించి ఉండే వారు.  ఆ ఫోటో లు కూడా ప్ర‌చురింప‌బ‌డేలా చేసి ఉండే వారు.  అందువ‌ల్ల అజాద్ సాహిబ్ చెబుతున్న స‌మాచారం బ‌హుశా 2014వ సంవత్సరానికన్నా క్రితంది కావ‌చ్చు.  అలాగే నేను అక్క‌డి తాజా స‌మాచారాన్ని ఇవ్వ‌ద‌ల‌చాను.  ఈశాన్యం, భార‌త‌దేశ అభివృద్ధి ప్ర‌యాణం లో మున్నెన్న‌డూ లేనంత‌టి రీతిగా ముందు వ‌రుస‌ లోని భాగ‌స్వామి గా ఉంటోంది.  40-50 సంవ‌త్స‌రాలు గా ఈశాన్య రాష్ట్రాల‌ లో హింసాత్మ‌క ఉద్య‌మాలు చోటుచేసుకొంటూ వ‌చ్చాయి.  అప్ప‌ట్లో దిగ్బంధాలు ఉండేవి.  అవి ఎంత ఆందోళ‌న క‌లిగించేవో అంద‌రికీ తెలుసు. అయితే ఇవాళ హింస స‌మ‌సిపోయింది.  దిగ్బంధాలు నిలచిపోయాయి.  ఈశాన్య రాష్ట్రాలు శాంతి బాట‌ లో ప్ర‌గ‌తి ప‌థాన ముందుకు సాగుతున్నాయి.

నేను ఇక్క‌డ ఒక విష‌యాన్ని ప్ర‌స్తావించ‌ద‌ల‌చుకున్నాను.  బ్రూ తెగ స‌మ‌స్య దాదాపు 25-30 సంవ‌త్స‌రాలుగా ఉంది.  మీకు కూడా తెలుసు.  మ‌నంద‌రికీ తెలుసు.. సుమారు 30 వేల మంది అనిశ్చిత ప‌రిస్థితుల‌ లో జీవ‌నాన్ని సాగిస్తున్నారు.  చిన్న చిన్న గ‌దుల‌ లో అది కూడా తాత్కాలిక గుడిసెల‌ లో వీరు ఉండవలసి వ‌స్తోంది.  ఇందులో 100-100 మంది బ‌ల‌వంతం గా జీవ‌నం సాగించాల్సిన ప‌రిస్థితి.  ఇది మూదు ద‌శాబ్దాలు గా కొన‌సాగుతోంది. ఇంత‌కంటే హింస మ‌రొక‌టి ఉండ‌దు.  వారు చేసిన నేర‌ం ఏమీ లేదు.  ద‌య‌నీయ‌మైన పరిస్థితి ని చూడండి, ఈశాన్య రాష్ట్రాల‌ లో మీ పార్టీ చాల ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసింది.  మీ మిత్ర పార్టీ త్రిపుర‌ లో అధికారం లో ఉంది.  మీకు మిత్రులు ఉన్నారు. స‌న్నిహిత మిత్రులు. మీకు చిత్త‌శుద్ధి ఉంటే , మిజోరం ప్ర‌భుత్వం మీతో ఉంటే, మీ స్నేహితులు త్రిపుర‌ లో ఉన్న‌ప్పుడు, మీరు కేంద్రం లో అధికారం లో ఉన్నారు.  మీరు అనుకుంటే, బ్రూ- రియాంగ్ తెగ స‌మ‌స్య‌ కు సంతోష‌క‌ర‌మైన ప‌రిష్కారం సాధించి ఉండే వారు.  కానీ ఇవాళ, ఎన్నో సంవ‌త్స‌రాల త‌రువాత‌, ఈ స‌మ‌స్య‌ ను మేము ప‌రిష్క‌రించాము. అంతేకాదు, దీనికి శాశ్వ‌త ప‌రిష్కారాన్ని సాధించాము.

వారి ప‌ట్ల ఉదాసీన‌త‌ కు కార‌ణ‌ం ఏమిటో నాకు ఇప్పుడు  అర్థ మైంది.  ఇళ్ళ నుండి, గ్రామం నుండి విడిపోయిన బ్రూ  ప్రజలు ఎంతో న‌ష్ట‌పోయారు. వారి బాధ అపరిమితం.  కానీ వారి వోట్లు చాలా తక్కువ.  ఇది వోట్ల ఆట గా ఉండేది.  అందువ‌ల్ల వారి అప‌రిమిత బాధ ను తెలుసుకోలేక‌పోయారు.  అలా వారి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయారు. ఇదీ మ‌న చ‌రిత్ర‌. దీనిని మ‌రచిపోవ‌ద్దు.

కానీ, మా ఆలోచ‌న భిన్నంగా ఉంది. మేము స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్ మంత్ర ద్వారా అంద‌రినీ క‌లుపుకొని ముందుకు తీసుకు పోవ‌డాన్ని విశ్వ‌సిస్తాము. మేము, ఇత‌రుల‌ ప‌ట్ల ప్రేమ‌ తో వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పూర్తి బాధ్య‌త‌ తో చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తున్నాము. వారి బాధ‌ల‌ ను మేము అర్థం చేసుకొంటాము. ఇవాళ 29 వేల మంది ప్ర‌జ‌లు వారి స్వంత ఇళ్ల‌ ను పొందుతున్నారు.  ఈ విష‌యం లో దేశం గ‌ర్వ‌ప‌డుతోంది.  వారి కి స్వంత గుర్తింపు ఉంటుంది.  వారికంటూ స్వంత ప్ర‌దేశం ఉంటుంది.  వారు వారి క‌ల‌ల ను నెరవేర్చుకోవ‌చ్చు.  వారు వారి పిల్ల‌ల భ‌విష్య‌త్తు ను నిర్ణ‌యించుకోగ‌ల‌రు.  

ఈ ర‌కం గా ఈశాన్య రాష్ట్రాల‌లో అది బ్రూ తెగ వారిది కావ‌చ్చు లేదా ఇత‌రులది ఎవ‌రిదైనా కావ‌చ్చు స‌మ‌స్య‌ల‌ ను ప‌రిష్కిరించ‌వచ్చ‌ని మేము విశ్వ‌సిస్తున్నాము.

బోడో స‌మ‌స్య‌ పై నేను వివ‌రాల లోకి వెళ్ల‌ద‌ల‌చుకోలేదు.  అయితే దానికి సంబంధించి కూడా చాలా చాలా ముఖ్య‌మైన ప‌ని పూర్త‌ి అయింది.  దీని ప్ర‌త్యేక‌త ఏమంటే, హింసామార్గం లోని అన్ని సాయుధ సమూహాలు క‌లసిక‌ట్టు గా ద‌గ్గ‌ర‌య్యాయి.  ఈ ఒప్పందం కుదిరిన త‌రువాత ఇక పూర్తి కాని డిమాండులు అంటూ  ఏమీ లేవ‌ని ప్ర‌తి ఒక్క‌రు అంగీక‌రించారు. 

శ్రీ సుఖేంద‌ర్ శేఖ‌ర్‌ గారి తో పాటు ఎంతో మంది స‌హ‌చ‌రులు ఇక్క‌డ ఆర్థిక అంశాల‌ ను చ‌ర్చించారు.  అఖిల‌ప‌క్ష స‌మావేశం జరిగిన‌ప్పుడు కూడా నేను విన‌మ్రం గా చెబుతూ వ‌చ్చాను.  మ‌నం సమావేశం అంతటి ని ఆర్ఙ‌ిక అంశాల‌ పై చ‌ర్చ‌ కు కేటాయించాలి అని.  దీని పై తీవ్ర చ‌ర్చ జ‌ర‌గాలి.  అన్ని అంశాల‌ ను ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించాలి.  మ‌న‌కు ఉన్న మేధ‌స్సు, సామ‌ర్ధ్యాల‌ మేర‌కు చ‌ర్చ‌ ను అర్థ‌వంతం చేయాలి.  అప్పుడే మ‌నం కొత్త అంశాల‌ ను క‌నుగొన‌గ‌లం.  అంతేకాదు ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఆర్థిక ప‌రిస్థితి ని దృష్టి లో పెట్టుకొని భారతదేశం ఎలా గ‌రిష్ఠ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గ‌ల‌దో కొత్త‌ మార్గాన్ని ఆలోచించాలి. అలాగే భార‌త‌దేశం త‌న మూలాల‌ ను ఎలా బ‌లోపేతం చేసుకోగ‌ల‌దో, దాని ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ ను ఎలా బ‌లోపేతం చేసుకోగ‌ల‌దో ఆలోచించాలి.  వీటి ని మ‌నం విస్తృతం గా చ‌ర్చించ‌వ‌చ్చు.  వీటి ని మనం లోతు గా చ‌ర్చిద్దాము.  ఈ విష‌య‌మై నేను అఖిల ప‌క్ష స‌మావేశం లో ప్ర‌తి ఒక్క‌రికి విజ్ఞప్తి చేశాను. ఈ స‌మావేశాల ను పూర్తి గా దేశ ఆర్థిక అంశాల‌ పై చ‌ర్చ‌ కు కేటాయించాల‌ని నేను కోరుకుంటున్నాను.

బ‌డ్జెటు ను చ‌ర్చించాలి.  దీని ని మ‌రింత వివ‌రం గా చ‌ర్చించాలి, అప్పుడ‌ది ఈ ప్ర‌క్రియ‌ ను ఫ‌ల‌ప్ర‌దం చేస్తుంది. ఆరోప‌ణ‌ లు, ప్ర‌త్యారోప‌ణ‌ లు ఉండ‌వ‌చ్చు. వాదోప‌వాదాలు చోటు చేసుకోవ‌చ్చు. అయినా, అర్థ‌వంత‌మైన చ‌ర్చ ద్వారా తేనె వంటి ఫ‌లితం వ‌స్తుంది. అందుకే నేను ప్ర‌తి ఒక్క‌రిని మ‌రోసారి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ పైన‌, ఆర్థిక ప‌రిస్థితి పైన‌, ఆర్థిక విధానాల‌ పైన‌, ఆర్థిక స్థితిగ‌తుల‌ పైన చ‌ర్చించవలసింది గా మనవి చేస్తున్నాను.  మ‌న‌కు నిపుణులైన వారు, ఉదాహ‌ర‌ణ‌ కు డాక్ట‌ర్ మ‌న్ మోహ‌న్‌ సింగ్ గారు వంటి వారు మ‌న మ‌ధ్య ఉన్నారు. ఇటువంటి చ‌ర్చ‌ల ద్వారా దేశం త‌ప్ప‌కుండా ప్ర‌యోజ‌నం పొందుతుంది.  మ‌నం ఆ ప‌ని ని చేయాలి.  ఈ విష‌యం లో మ‌నం అర‌మ‌రిక‌లు లేని మ‌న‌స్సు తో ఉండాలి.  అయితే, ఆర్థిక ప‌రిస్థితి కి సంబంధించి ఇక్క‌డ చ‌ర్చించిన అంశాల విష‌యం లో, దేశం నిరుత్సాహ‌ప‌డవలసిన అవ‌స‌రం లేదు.  నిరుత్సాహాన్ని వ్యాప్తి చెందించ‌డం ద్వారా వారు పొంద‌గ‌లిగింది ఏమీ లేదు.  ఇవాళ కూడా , మౌలిక‌మైన అంశాలు, అంటే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు సంబంధించి న మౌలిక అంశాలు, ప్రాతిప‌దిక‌ లు, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎంతో బ‌లం గా, స్థిరం గా ఉండ‌డం తో పాటు మ‌రింత ముందుకు పోవ‌డానికి పూర్తి శ‌క్తి తో ఉన్నాయి. ఈ ర‌క‌మైన నాణ్య‌త దానిలో ఉంది.

చిన్న చిన్న ఆలోచ‌న‌ల‌ తో ఏ దేశ‌మూ ముందుకు పోజాలదు.  ఇప్పుడు మ‌న దేశ యువ‌త‌రం మ‌నం గొప్ప గొప్ప ఆలోచ‌ల‌న‌ల‌ తో ముందుకు పోవాల‌ని, స‌మున్న‌తం గా ఆలోచించాలని, మ‌రింత శ‌క్తి తో ముందుకు పోవాల‌ని ఆకాంక్షిస్తోంది. ఈ మౌలిక మంత్రాన్ని దృష్టి లో పెట్టుకొని  5 ట్రిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ‌ గా ఎదిగేందుకు కృషి చేయాలి. మ‌నం మ‌న దేశాన్ని అభివృద్ధి ప‌థం లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేద్దాము. అనుసంధానం చేసేందుకు ప్ర‌య‌త్నం చేద్దాము.  నిరాశ‌చెందాల్సిన అవ‌స‌రం ఎంత మాత్రం లేదు. మొద‌టి రోజే ఆదుర్దా ప‌డవలసిన అగత్యం లేదు.  ఏది సాధ్య‌మో , ఏది అసాధ్య‌మో చూద్దాము.  ప్ర‌తిసారీ మ‌న‌ల్ని మ‌నం కొంత‌వ‌ర‌కే ముందుకుపోవ‌డానికి ప‌రిమితం చేసుకోవ‌ద్దు.  కొంద‌రు రెండు అడుగులే వేయ‌వ‌చ్చు.  మ‌నం వాళ్ల‌నే అనుక‌రిస్తామా?  కొన్ని సంద‌ర్భాల‌ లో క‌నీసం ఐదు అడుగులైనా వేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.  కొన్ని సార్లు మీరు ఏడు అడుగులు వేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. లేదా కొన్ని సంద‌ర్భాల‌ లో మీరు నాతో క‌లిసి న‌డ‌వ‌వ‌చ్చు.

నిరాశ దేశాని కి ఎప్పుడూ మంచిది కాదు, అందువల్ల 5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ ను గురించి మాట్లాడటం వల్ల మంచి ఫలితం ఏమిటంటే దానిని వ్యతిరేకించే వారు కూడా 5 ట్రిలియన్ డాలర్ల గురించి మాట్లాడవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ను గురించి ఆలోచించాలి. ఇది పెద్ద మార్పు.

ఇక ఇప్పుడు అంత‌ర్జాతీయ ధోర‌ణి కి అనుగుణంగా కాన్వాస్ రూపొందించ‌బ‌డింది.  మ‌నం  మైండ్‌సెట్‌ ను మార్చేశాం.  ఈ క‌ల‌ ను సాకారం చేయ‌డానికి ఎమ్ఎస్ఎమ్ఇ స్, జౌళి ప్రాంగ‌ణాలు వంటివి, ఉపాధి అవ‌కాశాలు క‌లిగిన వాటికి  గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌ లో మౌలిక‌ స‌దుపాయాలు ఉండాలి.

మేము సాంకేతిక విజ్ఞానాన్ని, స్టార్ట్ అప్‌ స్ ను ప్రోత్సహించేందునకు ప్రయత్నిస్తున్నాము. ప‌ర్యాట‌క రంగం అనేది ఒక పెద్ద అవ‌కాశంగా ఉన్నది.

కార‌ణం ఏమైతేనేం కాని, దేశం లో  గ‌డ‌చిన 70 సంవ‌త్సరాల‌ లో ప‌ర్యాట‌కం లో దేశానికి బ్రాండ్ సాధించ‌డం లో, ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించే అవ‌కాశాన్ని జార‌విడుచుకొన్నాము. ఇవాళ్టికీ మ‌న‌కు అవ‌కాశం ఉంది.  ఇప్ప‌టికైనా మ‌న దేశం దృష్టి కోణం లోంచి ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేయాలి.  భార‌తదేశ ప‌ర్యాట‌క రంగాన్ని ప‌శ్చిమ దేశాల దృష్టికోణం లోంచి అభివృద్ధి చేయ‌లేం.  ప్ర‌పంచం భార‌త‌దేశాన్ని ద‌ర్శించ‌డానికి రావాలి.

మేం మేక్ ఇన్ ఇండియా ను ప్ర‌త్యేకం గా తీసుకొంటున్నాము.  దీని సఫలత స్ప‌ష్టం గా క‌నిపిస్తోంది. మీరు విదేశీ పెట్టుబ‌డుల‌కు సంబంధించిన గ‌ణాంకాల‌ను చూస్తూ ఉండి ఉంటారు.

మేం మొత్తం ప‌న్ను వ్య‌వ‌స్థ‌ ను సుల‌భ‌త‌రం చేయ‌డానికి నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాము. సుల‌భ‌త‌ర వాణిజ్యం లో భార‌త‌దేశ ర్యాంకింగ్‌ ల విష‌యం లో కాని, లేదా సుల‌భ‌త‌ర జీవ‌నానికి సంబంధించిన అంశాల విష‌యంలో కాని.. రెండింటి విష‌యంలోనూ మేం గ‌ట్టి కృషి చేశాము.

బ్యాంకింగ్ రంగాని కి సంబంధించి నాకు కొన్ని విష‌యాలు గుర్తు కు వ‌స్తున్నాయి. నేను గుజ‌రాత్‌ లో ఉన్న‌ప్పుడు, చాలా మంది నిపుణులు త‌మ వ్యాసాల‌ లో, ఒక విష‌యం చెబుతూ ఉండే వారు.  దేశంలో బ్యాంకుల‌ ను విలీనం చేయాలి అని.  ఇదే జ‌రిగితే ఇది ఒక గొప్ప సంస్క‌ర‌ణ అవుతుంద‌ని అంటూ ఉండే వారు. మ‌నము ఇటువంటి వ్యాసాల‌ ను ఎన్నింటినో చ‌దివాము. ఇవాళ ఈ ప్ర‌భుత్వం ఎన్నో బ్యాంకుల‌ ను సుల‌భంగా విలీనం చేసింది.  ఇవాళ శ‌క్తిమంత‌మైన బ్యాంకింగ్ రంగం సిద్ధం గా ఉంది.  ఇది అబివృద్ధిప‌థం లో ఎదుగుతున్న‌ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేయ‌నుంది.

ఇవాళ‌, త‌యారీ రంగాన్ని కొత్త దృష్టి కోణం లోంచి చూడాలి.  బ్యాంకుల‌ లో డ‌బ్బు నిలచిపోవ‌డానికి కార‌ణ‌ం ఏమిటో చూడాలి.  గ‌త ప్ర‌భుత్వం అధికారం లో ఉన్న‌ప్పుడు నేను దీనిని గురించి స‌వివ‌రం గా తెలిపాను.  నేను ఎవ‌రినీ ప‌దే ప‌దే త‌క్కువ చేయడానికి ప్ర‌య‌త్నించ‌ను.  దేశం ముందు వాస్త‌వాల‌ను ఉంచ‌డం ద్వారా నేను ముందుకు సాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను.  నేను అటువంటి విష‌యాల‌ లో స‌మ‌యాన్ని వృథా పోనీయ‌ను. లేక‌పోతే చెప్పాల్సింది చాలా ఉంది.

ఏ అంశం పై అయినా చ‌ర్చ‌ కు కొదువ‌ లేదు.  మ‌నం జిఎస్‌ టి పై ఎన్న‌ో సార్లు చ‌ర్చించాము. ఎన్నోసార్లు మార్పు లు చేశాము.  ఇది మంచిదనుకోమంటారా, చెడ్డ‌ద‌నుకోమంటారా.  నాకు ఆశ్చర్యం వేస్తోంది. జిఎస్‌ టి రూప‌క‌ల్ప‌న సమాఖ్య వ్య‌వ‌స్థ‌ కు సంబంధించి న కీల‌క‌మైన విజ‌యం. ఇది రాష్ట్రాలు, కాంగ్రెస్‌పాలిత రాష్ట్ర‌ప్ర‌భుత్వాల ఆకాంక్ష‌ల‌ ను కూడా ప్ర‌తిబింబిస్తోంది.  మ‌న‌కు దేవుడిచ్చిన తెలివితేటలు ఉన్నాయ‌ని మ‌నం  చ‌ర్చించ‌డం మానివేస్తామా? మ‌నం దీని ని మ‌రింత మెరుగుప‌రచేందుకు ప్ర‌య‌త్నించ‌కుండా వ‌ద‌లివేస్తామా?

ఇది మా విధానంకాదు.  మా అభిప్రాయం ఏమిటంటే అవ‌స‌ర‌మైన చోట మార్పు లు చేయాలి.  ఇది ఒక పెద్ద దేశం. ఈ దేశం లో ఎన్నో అంశాలు ఉన్నాయి.  రాష్ట్రాల బ‌డ్జెటు వ‌చ్చిన‌పుడు, అమ్మ‌కపు ప‌న్ను లేదా ఇత‌ర ప‌న్నుల గురించి మీరు చూసే ఉంటారు.  ఎన్నో చ‌ర్చ‌లు.  రాష్ట్రాలు చివ‌రకు అనేక మార్పు లు చేశాయి.  ఇప్పుడు ఈ అంశం రాష్ట్రాల‌ నుండి దూరం  దూరంగా వెళ్లిపోయి స‌మ్మిళ‌త‌మైంది.  ఇది భారం గా అనిపించ‌వ‌చ్చు.
చూడండి, జిఎస్‌ టి చాలా సరళం గా ఉండి ఉంటే బాగుండేద‌ని చెప్పారు.  నేను అర్థం చేసుకోగ‌ల‌ను.

ఇలా ఉండాలి, అంత‌ ఉండాలి, అన్నారు. నేను ఒక్క విష‌యం అడుగుతాను.  మీకు ఇంత ప‌రిజ్ఞానం ఉన్న‌ప్పుడు, దీనిని సుల‌భ‌త‌రం చేసే స్ప‌ష్ట‌మైన దార్శ‌నిక‌త ఉన్న‌ప్పుడు, మిత్రులారా, మ‌రి మీరు ఎందుకు ఇంత‌కాలం ఊరుకున్నారు? అవును, అందుకే చెబుతున్నాను, ఈ గందరగోళాన్ని వ్యాప్తి చేయవద్దని. అవును నేను చెబుతాను ఈ రోజు న మీరు వినాలి..

ప్ర‌ణ‌బ్‌ దా ఆర్ధిక‌ మంత్రి గా ఉన్న‌ప్పుడు గుజ‌రాత్ కు విచ్చేశారు.  అప్ప‌డు మేము సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపాం.  దాదా, ఇది సాంకేతిక విజ్ఞానాధారితమైనటువంటి వ్య‌వ‌స్థ క‌దా, ఏం జ‌రిగింది అని అడిగాను.  అది లేకుండా ప‌నిచేయ‌లేము.  దానికి  కాస్త ఆగండి అని దాదా చెప్పారు.  మీ ప్ర‌శ్న‌-- అంటూ త‌న కార్య‌ద‌ర్శి ని పిలిచారు.  మోదీ జీ ఏం చెబుతున్నారో వినండి అన్నారు.  దానికి నేను, ఇది సాంకేతిక విజ్ఞాన ప్రేరిత వ్య‌వస్థ‌.  సాంకేతిక ప‌రిజ్ఞానం లేకుండా ముందుకు పోలేం అన్నాను.  అప్పుడు ఆయ‌న అన్నారు, మేము ఇప్పుడే నిర్ణ‌యం తీసుకొన్నాము, మేము ఒక కంపెనీ సేవ‌ల ను అందిపుచ్చుకొంటాము, మేము దానిని చేప‌ట్ట‌బోతున్నాము అన్నారు.  నేను దీనిని జిఎస్‌ టి ని గురించి మాట్లాడ‌డానికి వ‌చ్చిన‌ప్ప‌టి కాలం గురించి మాట్లాడుతున్నాను.  అయినా అప్ప‌ట్లో అటువంటి వ్య‌వ‌స్థ ఏదీ లేదు.  ఇక రెండోది, జిఎస్‌ టి విజ‌య‌వంతం కావాలంటే, ఉత్ప‌త్తి చేసే రాష్ట్రాల స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించాల‌ని సూచించాను.  త‌మిళ‌ నాడు, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌ ల వంటి రాష్ట్రాలు ఉన్నాయి.  ఇవి చాలావ‌ర‌కు త‌యారీ ప్రధానమైనటువంటి రాష్ట్రాలు.  వీటికి వినియోగ రాష్ట్రాలు, వినియోగ‌దారులు క‌ష్ట‌మేమీ కాదు.  నేను ఇవాళ గ‌ర్వం గా చెప్ప‌గ‌ల‌ను, అరుణ్‌ జైట్లీ గారు ఆర్థిక‌ మంత్రి గా ఉన్న‌ప్పుడు వారు ఈ స‌మ‌స్య‌ల‌ ను ప‌రిశీలించి, పరిష్క‌రించారు.  ఆ త‌రువాత‌, దేశం మొత్తం జిఎస్‌ టి వెంట న‌డచింది.  నేను ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడు ఈ అంశాన్ని లేవ‌నెత్తినందున‌, ఆ స‌మ‌స్య‌ల‌న్నిటి ని నేను ప్ర‌ధాన‌ మంత్రి గా ప‌రిష్క‌రించాను.  ఆ ర‌కం గా జిఎస్‌ టి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించడం ద్వారా మార్గాన్ని సుగ‌మం చేశాను.
 
ఇది మాత్రమే కాదు, మనం మార్పు ను గురించి మాట్లాడితే, అప్పుడు కొన్ని సార్లు, మళ్ళీ, మళ్ళీ ఈ మార్పు ఎందుకు ? అని అంటాము.  మన మేధావులైన పూర్వికులు మనకు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు, అయితే వారు దానిని కూడా మెరుగుదల కోసం ఉంచారు.   సంస్కరణ లు ఎప్పుడూ స్వయం ప్రతిపత్తి ని కలిగివుండాలి.  ఇతరుల ఆలోచనల ను పంచుకోవడం ద్వారా మనం ముందుకు కదులుతాము.  దేశ ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకొని ప్రతి మంచి సలహా ను స్వాగతిస్తాము. 

గౌరవనీయులైన చైర్ మన్ గారూ,  భారత దేశ ఆర్ధిక వ్యవస్థ లో ఒక విషయం ఉంది; అది చాలా తక్కువ గా ప్రాచుర్యం పొందింది.  దీని పై  దృష్టిని సారించవలసిన అవసరం ఉంది.   భారతదేశం లో వస్తున్న ఈ  అతి పెద్ద మార్పు వల్ల మన  రెండో అంచె, మూడో అంచె నగరాలు చాలా బాగా సహకరించుకొంటున్నాయి.  క్రీడల లో మనం చూసినట్లయితే, రెండో అంచె, మూడో అంచె నగరాల బాలలు బాగా రాణిస్తున్నారు.    అదే విధం గా చదువుల లో కూడా, రెండో అంచె, మూడో అంచె నగరాల బాలలు బాగా రాణిస్తున్నారు.  అలాగే, అత్యధిక సంఖ్య లో అంకుర సంస్థ లు సైతం రెండో అంచె, మూడో అంచె నగరాల లో పుట్టుకు వస్తున్నాయి 

అందువల్ల, ఏ విధమైన బరువు బాధ్యత లు లేని ఉత్సాహవంతులైన యువకులు, కొండంత ఉత్సాహం తో, శక్తి తో ముందుకు వస్తున్నారు.  అందుకు అనుగుణం గా మేము ఈ చిన్న నగరాలు, పట్టణాలు, వాటి ఆర్ధిక వ్యవస్థల ను చాలా దగ్గర నుండి గమనించి, ఆ దిశ గా వాటి అభివృద్ధి కి కృషి చేస్తున్నాము. 

మన దేశం లో, డిజిటల్ లావాదేవీ లు, ఈ సభ లో డిజిటల్ లావాదేవీల పై ప్రసంగాలు, వక్త లు వారి ప్రసంగాల ను బయటకు తీస్తే, అవి వారు మాట్లాడినవేనా అని ఎవరి కి వారు ఆశ్చర్యపోతున్నారు.   కొంతమంది అయితే మొబైల్ ఫోన్ లతో చిత్ర విచిత్రాలు చేస్తున్నారు.  వారు డిజిటల్ బ్యాంకింగ్ ను, బిల్లింగ్ ను కూడా మొదలుపెట్టారు.   చిన్న చిన్న ప్రాంతాల లో చాలా చోట్ల ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల ను చూస్తూ వుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది.  రెండో అంచె, మూడో అంచె నగరాలు కూడా అత్యాధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం లో ముందంజ లో ఉన్నాయి.  మన రైల్వేస్, మన రహదారులు, మన విమానాశ్రయాలు, వాటి మొత్తం అన్ని విభాగాలు- విమాన మార్గాల విషయానికి వస్తే , 250వ మార్గం మొన్న ప్రారంభం అయింది.  దేశం లో 250వ మార్గం అంటే మామూలు విషయం కాదు.  మన విమాన ప్రయాణ విధానం ఎంత వేగం గా మారిపోయింది.  రానున్న రోజుల లో ఇంకా వేగం గా మారనుంది. 

గత ఐదు సంవత్సరాల కాలం లో, మనం 65 విమానాశ్రయాలను కలిగివుంటే ప్రస్తుతం వీటి సంఖ్య100 కు పైబడింది.  మరి ఇవన్నీ కూడాను ఆ నూతన ప్రదేశపు బలాన్ని పెంచనున్నాయి.  

అదేవిధం గా, గడచిన ఐదు సంవత్సరాల కాలం లో మేము ఒక్క ప్రభుత్వాన్ని మార్చడమే కాక మన ఆలోచనల సరళి లో కూడా  మార్పు తెచ్చాము.  మేము పని చేసే పద్దతి ని సైతం మార్చాము.   మేము వైఖరి నీ మార్చాము.   ఇప్పుడు డిజిటల్ ఇండియా ను గురించి మాట్లాడుకుందాము.   బ్రాడ్  బ్యాండ్ సంధానం విషయానికి వస్తే, మొదట పని ఆరంభం అయింది. ప్రణాళిక ను రూపొందించడం జరిగింది.  అయితే ఆ ప్రణాళిక విధానం, ఆలోచన ఎంతటి విలువను కలిగివున్నాయంటే ఆ బ్రాడ్ బ్యాండ్ సంధానం 59 గ్రామ పంచాయతులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.  ఐదు సంవత్సరాల అనంతరం, ఇప్పుడు సుమారు లక్షా 25 వేల గ్రామాల కు బ్రాడ్ బ్యాండ్ సంధానం లభ్యమైంది.  బ్రాడ్ బ్యాండ్ ను ప్రారంభించడమొక్కటే కాదు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామాలు, ఇతర కార్యాలయాల తో పాటు ముఖ్యం గా సాధారణ సేవా కేంద్రాలు కూడా బ్యాండ్ బ్యాండ్ పరిధి లోకి వచ్చాయి. 

2014వ సంవత్సరం లో ఎప్పుడైతే మేము అధికారం లోకి వచ్చామో, మన దేశం లో 80 వేల కామన్ సర్వీస్ సెంటర్ లు మాత్రమే ఉన్నాయి.   ప్రస్తుతం వాటి సంఖ్య 3 లక్షల 65 వేల కు పెరిగింది.  వాటి ని ఆయా గ్రామాల యువకులు నిర్వహిస్తున్నారు.  గ్రామాల అవసరాల ను తీర్చడానికి, వారు తమ సాంకేతిక సేవల ను పూర్తి స్థాయి లో వినియోగిస్తున్నారు. 

దేశం లో ఇప్పుడు సుమారు 12 లక్షల కు పైగా యువజనులు వారి స్వగ్రామాల లో నివసిస్తున్నారు.   సాయంత్రం పూట వారు వారి తల్లితండ్రుల కు కూడా సహాయపడుతున్నారు; వారు వ్యవసాయ పనుల లో కూడా నిమగ్నం అవుతారు.  12 లక్షల మంది గ్రామీణ యువత ను ఈ విధమైన ఉపాధి లోకి చేర్చడమైంది. 

ఈ దేశం గర్వపడుతోంది. గర్వపడాలి.   మనం డిజిటల్ లావాదేవీల ను అవహేళన చేశాము. దానిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించాము. భీమ్ యాప్ యొక్క స్వీకరణ ఈ రోజుల లో ఒక శక్తివంతమైన ప్లాట్ ఫార్మ్ గాను, ఆర్ధిక పరమైన డిజిటల్ లావాదేవీలకు సురక్షితమైన వేదికగాను ప్రపంచ వ్యాప్తం గా పెరుగుతున్నది. మరి అనేక దేశాల లో ఈ యాప్ ను గురించి మరింత గా తెలుసుకొనేందుకు మనలను సంప్రదిస్తున్నాయి.  ఇది దేశాని కి ఒక గర్వకారణమైనటువంటి విషయం, దీనిని నరేంద్ర మోదీ ఏమీ సృష్టించలేదు.  డిజిటల్ లావాదేవీల కోసం మనం ఈ రోజు ఒక అద్భుతం గా పనిచేసే వేదిక ను కలిగి వున్నామంటే - ఇది మన దేశపు తెలివితేటల యొక్క ఫలితం, మన దేశ యువత యొక్క ప్రతిభ తాలూకు ఫలం. మనం ఇవాళ డిజిటల్ లావాదేవీల కై ఉత్తమమైన పనితీరు ను కనబరుస్తున్నటువంటి ప్లాట్ ఫార్మ్ ను కలిగివున్నాము. 

జనవరి నెల లో, చైర్ మన్ సర్, ఇదే జనవరి మాసం లో, మొబైల్ ఫోన్ ద్వారా, భీమ్ యాప్ నుండి దాదాపు 2 లక్షల 16 వేల కోట్ల రూపాయల మేరకు నగదు లావాదేవీ లు జరిగాయి.  ఈ విధం గా మన దేశం మార్పు ను అక్కున చేర్చుకొంటున్నది. 

రూపే కార్డు- మీకు రూపే కార్డు ను ప్రారంభించిన సంగతి ని గురించి తెలిసే వుంటుంది.   అత్యంత స్వల్ప సంఖ్య లో కేవలం ఒక వేయి రూపే కార్డుల ను విడుదల చేయడం జరిగింది. మొత్తం డెబిట్ కార్డు ల ప్రపంచం లో అప్పుడు మన వాటా కేవలం పాయింట్ ఆరు శాతం గా ఉంది.   నేడు అది 50 శాతానికి చేరుకుంది.   ఈ రోజు న రూపే డెబిట్ కార్డు అంతర్జాతీయం గా ప్రపంచం లోని అనేక దేశాల లో అంగీకరించబడుతోంది.   అందువల్ల, భారతీయ రూపే కార్డు, తన స్థానాన్ని సుస్థిరపరచుకొంటోంది. ఇది మనందరికీ ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. 

గౌరవనీయులైన చైర్ మన్, ఇదే విధం గా ప్రభుత్వం- జల్ జీవన్ మిశన్ - అనే మరొక విషయం పైన కూడా దృష్టి పెట్టింది.   ప్రాథమిక సమస్యల ను నూటి కి నూరు శాతం పరిష్కరించే దిశ గా, మేము ప్రయత్నించాము. 

మరుగు దొడ్లు - నూరు శాతం 

గృహాలు - నూరు శాతం 

విద్యుత్తు - నూరు శాతం 

గ్రామంలో విద్యుత్తు సరఫరా - నూరు శాతం  

ఈ పనులన్నిటి ని మేము చేశాము.   కష్టాల నుండి దేశాని కి విముక్తి ని కలిగించాలనే వైఖరి తో మేము ముందుకు కదులుతున్నాము. 

ప్రతి ఇంటి కి స్వచ్ఛమైన నీటి ని సరఫరా చేయడానికి ఒక భారీ ప్రచార కార్యక్రమాన్ని మేము చేపట్టాము.  ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ, దీనికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి.  అయితే, ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో పనిచేస్తుంది.  వాస్తవానికి దీని అమలు బాధ్యత, సూక్ష్మ సమాఖ్య పద్దతి లో నేరుగా మన గ్రామాలు, గ్రామాల్లోని సంఘాలకే ఉంటుంది.  ప్రతి ఇంటి కి నీటి ని సరఫరా చేసే పద్దతి ని వారికి వారే నిర్ణయించుకొని, ప్రణాళిక ను రూపొందించుకొంటారు.  ఈ ప్రణాళిక ను  కూడా మేము మరింత ముందుకు తీసుకుపోతాము. 

మన సహకారాత్మక సమాఖ్య విధానాని కి సరి అయిన ఉదాహరణ- వంద కు పైగా ఉన్నటువంటి ఆకాంక్ష భరిత జిల్లాలు.   మన దేశం లో వోటు బ్యాంకు రాజకీయాల కోసం అభివృద్ధి చెందిన, వెనుక బడిన అంటూ ఎన్నో చేశాము, అయితే ఈ దేశం లోని ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి.  వాటిపై శ్రద్ద వహించవలసిన అవసరం ఉంది. ఈ విషయం లో మనం చాలా ఆలస్యం చేశాము.   చాలా రాష్ట్రాలలోని కొన్ని జిల్లా లు ఇప్పటికీ ఇంకా పూర్తి గా వెనుకబడి ఉన్నాయి.  దీనికి చాలా పరిమితులు, కారణాలు ఉన్నాయి.   వాటిని మనం పరిష్కరిస్తే, దేశం పెద్ద ఎత్తున మెరుగుపడుతుంది.   కొన్ని సందర్భాలలో, ఒక్కో జిల్లా లో, అధికారి పదవీవిరమణ చేస్తున్నప్పటికీ, వాటిని అలాగే వదిలిపెట్టడం జరుగుతోంది.   అంటే, అక్కడ శక్తివంతమైన, ప్రతిభావంతమైన అధికారులను ఎవరూ నియమించలేదు.  అయితే, అక్కడ ఎవరో ఒకరు ఉన్నారని వారు అనుకుంటారు.  మేము ఆ పరిస్థితి ని మార్చాము.   మేము గరిష్ఠం గా వంద ఆకాంక్ష భరిత జిల్లాల ను గుర్తించాము.   వాటిలో వివిధ రాష్ట్రాల కు చెందిన ఆ జిల్లా లు ఉన్నాయి.   ఆ జిల్లాల లో 50 చొప్పున ఆశాజనక బ్లాకుల ను గుర్తించి, వాటి నిర్వహణ విధానం లో, పరిపాలన లో మార్పు ను తీసుకురావలసిందిగా  కోరాము. ప్రాదేశిక దృష్టి ని ఇవ్వడం ద్వారా మార్పు ను తీసుకు రావడానికి ప్రయత్నించమని కోరాము. 

ఈ రోజు న, జిల్లా స్థాయి లో కూడా ఆ పరివర్తన ప్రారంభమైంది.  సహకారాత్మక సమాఖ్య విధానాన్ని అక్కడ అమలు చేయడంతో ఆ ఆకాంక్షయుత జిల్లా లు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లో పురోగమిస్తున్నాయి.   ఆయా జిల్లా ల అధికారుల మధ్య ఒక విధమైన సానుకూల పోటీ తత్త్వం నెలకొనడంతో  ప్రతి ఒక్కరు ముందుకు సాగుతున్నారు.  పక్క జిల్లా లో టీకాల కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి, మన జిల్లా లో కూడా ఈ వారం ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి అని అనుకుంటున్నారు.   ఆ విధం గా, ప్రజల సౌకర్యాల ను మెరుగుపరచాలనే దృష్టి తో అక్కడ మంచి కార్యక్రమాల ను చేపట్టడం జరుగుతోంది. 

ప్రతి జిల్లా లో ఆరోగ్య సేవలు అందుబాటు లో ఉండాలనే ఆశయంతో- మేము ఆయుష్మాన్ భారత్ ను కూడా అమలు చేస్తున్నాము.    ఆయా ప్రాంతాలు పురోగమించాలనే ఉద్దేశంతో- ఈ సారి ఆరోగ్య రంగాని కి ప్రాధాన్యం ఇచ్చాము. 

దీనికి తోడు, ఆశాజనక జిల్లాల లోని ప్రజలు మన గిరిజన సోదరులు మరియు సోదరీమణులు, దివ్యాంగులు కావడంతో వారు మరింత సున్నితత్వం తో పని చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. 

దేశం లోని ఆదివాసీ పోరాట యోధుల ను గుర్తించి, గౌరవించే కార్యక్రమాన్ని గత ఐదేళ్లు గా నిర్వహిస్తున్నాము.   దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన ఆదివాసీల సేవలకు గుర్తింపు గా,  వారు దేశాన్ని రక్షించడానికి, దేశాన్ని రూపొందించడానికి వారి నిర్వహించిన పాత్ర ను ప్రజలందరికీ తెలియజెప్పేలా, ఒక ప్రదర్శన శాల, ఒక పరిశోధన సంస్థ ను నెలకొల్పాలి.  అది  ముందు తరాల కు ఒక స్ఫూర్తి గా నిలుస్తుంది.  దేశాన్ని సమైక్య పరచడానికి దోహదపడుతుంది.  ఆ దిశగా కూడా కృషి జరుగుతోంది. 

మన గిరిజన బాల బాలికల కు ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. అయితే, వారికి తగిన అవకాశాలు అందుబాటులో లేవు.   అది క్రీడలు కావచ్చు, విద్య కావచ్చు. వారికి ఏకలవ్య పాఠశాల ల ద్వారా మంచి అవకాశాలు కల్పించాలి.  ఉన్నత ప్రమాణాల తో పాఠశాలల ను ప్రారంభించడం ద్వారా,  అటువంటి ప్రతిభావంతులైన పిల్లల కు అవకాశాల ను కల్పించడం కోసం, మేము గట్టిగా కృషి చేసాము.  

గిరిజన పిల్లల కు విద్యా సౌకర్యాల కల్పన తో పాటు,  ఈ ప్రాంతాల్లో సుమారు 30 వేల స్వయం సహాయ బృందాల ను ప్రారంభించాము.  అడవుల ను సంపద సృష్టించే అడవులు గా వినియోగించుకుని,  వారు మరింత పురోగమించడానికి వీలుగా, వారికి సాధికారిత ను కల్పించే దిశ గా కూడా కృషి చేశాము. 

మహిళా సాధికారిత రంగం లో భాగం గా ఈ విషయాల ను రాష్ట్రపతి ప్రసంగం లో క్లుప్తం గా ప్రస్తావించడం జరిగింది.   దేశ చరిత్ర లో మొదటిసారి గా, సైనిక పాఠశాలల్లో బాలికల ను చేర్చుకొనే ప్రక్రియ ను ప్రారంభించాము.  అదేవిధం గా, మిలటరీ పోలీసు దళం లో మహిళల నియామక ప్రక్రియ పనులు కూడా జరుగుతున్నాయి. 

మహిళ ల రక్షణ కోసం, దేశంలో ఆరు వందల కు పైగా కేంద్రాల ను నిర్మించడం జరిగింది.   దేశం లోని ప్రతి పాఠశాల లో ఆరో తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికల కు స్వీయ రక్షణ లో శిక్షణనివ్వడం జరుగుతోంది. 

దేశ వ్యాప్తం గా లైంగిక నేరస్తులను గుర్తించి, వారి వివరాల ను నమోదు చేసి, వారి కదలికల పై నిఘా పెట్టడం జరిగింది.  దీనితో పాటు,  మానవ అక్రమ రవాణా కు వ్యతిరేకం గా పని చేసే ఒక కేంద్రాన్ని నెలకొల్పడానికి కూడా ప్రణాళిక ను సిద్ధం చేశాము.  

పిల్లల పై లైంగిక హింస కేసులను సత్వరమే పరిష్కరించేందుకు వీలు గా, ఇటువంటి నేరాల ను కూడా పోస్కో చట్టం పరిధిలోకి తీసుకువచ్చాము.  నేరస్తుల ను శిక్షించడానికి వీలు గా ఈ చట్టాన్ని సవరించడం జరిగింది.   ఇటువంటి కేసుల లో సత్వర న్యాయం జరగాలి. ఇందుకోసం దేశవ్యాప్తం గా ఒక వేయి కి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ను నెలకొల్పనున్నాము.   

గౌరవనీయులైన చైర్ మన్, సిఎఎ పై సభ లో చర్చ జరిగింది.  దీనికి వ్యతిరేకం గా అనేక ప్రాంతాల లో నిరసన ల పేరిట గందరగోళం సృష్టించడం జరిగింది.  నిరసన తెలియజేసే హక్కు గా దీనిని పరిగణిస్తూ హింసాత్మక సంఘటన లు చోటు చేసుకొన్నాయి.  ఈ విషయాల ను సభ లో ప్రస్తావించడానికి అనేక సార్లు ప్రయత్నించడం జరిగింది.   ఇటువంటి అప్రజాస్వామిక కార్యకలాపాల ను కప్పిపుచ్చుకోవడం కోసం రాజ్యాంగం పేరిట తరచు ఆందోళన లు చేస్తున్నారు.   ఈ విషయం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ని నేను అర్ధం చేసుకున్నాను.  అయితే, కేరళ లోని లెఫ్ట్ ఫ్రంట్ మిత్రులు కాస్త అర్ధం చేసుకోవాలి.  ఇక్కడ కు వచ్చే ముందు, కేరళ లో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనల లో ఉగ్రవాద బృందాల హస్తం ఉందని రాష్ట్ర శాసనసభ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల ను- వారు  తెలుసుకోవాలి. 

అంతేకాదు, వారిని కఠినం గా శిక్షించాలని కూడా ఆయన  హెచ్చరించారు.   అటువంటి పరిస్థితుల లో, కేరళ, ఢిల్లీ లేదా దేశం లోని  ఇతర ప్రాంతాల లో గందరగోళాన్ని, హింస ను సృష్టిస్తున్న వారిని మీరు ఎలా సమర్థిస్తారు ? 

పౌరసత్వ సవరణ చట్టం గురించి మనం ఏమి చెప్పాము?  ఏమి ప్రచారం చేస్తున్నాము? అనేది సహచరులందరూ, ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.   ఈ విధం గా తప్పుడు సమాచారాన్ని అందించడం, దేశాన్ని తప్పు దోవ పట్టించడం వంటి ధోరణి ని మనందరం ఆపు చేయ్యాలా? వద్దా?  ఇది మన కర్తవ్యం అవునా? కాదా ?   ఇటువంటి అసత్య ప్రచారం లో  మనం కూడా భాగస్వాములం అవుదామా?   ఒకవేళ, దీనివల్ల  రాజకీయం గా ఎవరికీ మేలు జరగదు అని అనుకుంటే,  అదే విధం గా, ఇది సరైన పద్దతి కాదు అనుకుంటే, మనం కూర్చుని, మనం సరైన మార్గం లో పయనిస్తున్నామా?  లేదా?  అని ఆలోచిద్దాము,  అంతేకానీ, ఈ రెండు నాలుక ల ధోరణి ఎందుకు? ఒక వైపు 24 గంటలు అల్పసంఖ్యాక వర్గాల కోసం గొప్ప గొప్ప మాటలను చెబుతారు, ఇప్పటికిప్పుడు ఆనంద్ గారు చెప్పిన మాటల ను విన్నాను.   అయితే, మీరు వారి బాధల ను ఎందుకు అర్ధం చేసుకోరు?  గతం లో మీరు చేసిన పొరపాట్ల వల్ల, పొరుగు దేశాల లో వారు అల్పసంఖ్యాకవర్గాలు గా  మారారు.   ఇటువంటి సున్నితమైన సమస్య పై ప్రజల ను భయపెట్టే బదులు,  వాస్తవ సమాచారాన్ని అందించాలని దేశం ఆశిస్తోంది.  ఇది మనందరి భాద్యత.  అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది  ప్రతిపక్షానికి చెందిన మిత్ర పక్షాలు బాగా ఆవేశపడుతున్నాయి.   ఒకప్పుడు చాలా మౌనం గా ఉన్న వారు ఇప్పుడు హింసాత్మకం గా మారారు. 

చైర్ మన్ సర్, అయితే ఈ రోజు న ఈ సభ చాలా అనుభవం కలిగివున్న వారికి చెందిన సభ. అందుకని, ఈ రోజు న నేను కొంతమంది ప్రముఖులు చెప్పిన మాటల ను చదవాలని అనుకొంటున్నాను. 

మొదటి ప్రకటన :

‘‘పాకిస్తాన్ తూర్పు భాగం లో నివసిస్తున్న మైనారిటీ సమాజాలకు చెందిన వారి గౌరవం, ఆస్తి, జీవితాలకు అభద్రత దృష్ట్యా, అదే విధం గా పాకిస్తాన్ లోని ఆ ప్రదేశం లోని ప్రజల  సాధారణ మానవ హక్కుల  ఉల్లంఘన సంఘటన ల దృష్ట్యా, తూర్పు పాకిస్తాన్ లోని మైనారిటీ సమాజాల కు చెందిన ప్రజలు భారత దేశం లోకి  వలస రావడంపై ఉన్న నిబంధనల ను భారత ప్రభుత్వం సడలించడం తో పాటు, ఈ విషయం పై ప్రపంచ దేశాల అభిప్రాయం తెలుసుకోడానికి తగిన చర్యల ను చేపట్టాలని ఈ సభ అభిప్రాయ పడుతోంది.’’
ఈ విషయం సభ లో ప్రకటించబడింది.  అయితే, కొంతమంది జనసంఘ్ నాయకులు మాత్రమే మాట్లాడగలరని, ఇప్పుడు మీరు భావిస్తున్నారు. ఇటువంటి విషయాలు ఎవరు చెప్పగలరు.    ఆ కాలం లో బీజేపీ లేదు. అయితే జనసంఘ్ ఉంది.   అందువల్ల, కొంతమంది జనసంఘ్ కు చెందిన వారు మాట్లాడగలరని, వారు భావించి ఉండవచ్చు.  అయితే, ఈ ప్రకటన ఏ బిజెపి లేదా జనసంఘ్ నాయకునికీ సంబంధించినది కాదు. 

అదే ప్రముఖ వ్యక్తి చేసిన మరొక ప్రకటన ను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ‘‘తూర్పు పాకిస్తాన్ కు సంబంధించినంత వరకు, ముస్లిమేతరులందరి ని తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.  అది ఒక ఇస్లామ్ దేశం.   ఇస్లామ్ రాజ్యంగా, ఆ దేశం లో ఇస్లామ్ పై నమ్మకం ఉన్న వారు మాత్రమే అక్కడ నివసించాలనీ, ముస్లిమేతర ప్రజలు అక్కడ నివసించ లేరని వారు భావిస్తారు.   అందువల్ల, హిందువుల ను బహిష్కరించారు, క్రైస్తవుల ను బహిష్కరించారు.   ఇంతవరకు, సుమారు 37 వేల మందికి పైగా క్రైస్తవులు అక్కడ నుండి భారతదేశాని కి వలస వచ్చినట్లు నాకు తెలిసింది.  బౌద్దులు కూడా అక్కడ నుండి తరిమివేయబడ్డారు. "

ఇది కూడా ఏదైనా ఒక జనసంఘ్ లేదా బిజెపి నాయకుని ప్రకటన కాదు.   ఈ మాట లు మన దేశ ప్రియతమ ప్రధాన మంత్రులలో ఒకరైన ప్రముఖ వ్యక్తి కి చెందినవి అని సభ కు నేను తెలియజేస్తున్నాను.  ఇది గౌరవనీయులైన లాల్ బహాదుర్ శాస్త్రి గారి ప్రకటన.  ఇప్పుడు వారిని కూడా మతతత్వ వాది అని అంటారా?  వారిని కూడా హిందూ, ముస్లిం వేర్పాటు వాదులు గా పేర్కొంటారా? 

లాల్ బహాదుర్ శాస్త్రి గారు 1964వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ న పార్లమెంటు లో ఈ ప్రకటన చేశారు.   ఆ కాలం లో నెహ్రూ గారు ప్రధాన మంత్రి గా ఉన్నారు.   అప్పుడు మతపరమైన హింస కారణంగా శరణార్థులు భారతదేశాని కి వలస వస్తున్న విషయాన్ని పార్లమెంటు లో చర్చిస్తున్నారు.   ఆ కాలం లో శాస్త్రి గారు ఈ ప్రకటన చేశారు. 

గౌరవనీయులైన చైర్ మన్,

గౌరవనీయమైన సభ కు నేను మరొక ప్రకటన ను గురించి చెబుతాను.   దీనిని ముఖ్యంగా నా సామ్యవాది మిత్రుల కు అంకితమిస్తున్నాను.   ఎందుకంటే, దీనికి ప్రేరణ అక్కడ నుండి రావచ్చు.  జాగ్రత్త గా వినండి. 

‘‘భారతదేశాని కి చెందిన ముస్లిములు జీవించాలి.  పాకిస్తాన్ కు చెందిన హిందువులు జీవించాలి.  పాకిస్తాన్ కు చెందిన హిందువులు పాకిస్తాన్ పౌరులు అన్న వాస్తవాన్ని నేను తీవ్రం గా ఖండిస్తాను.  అందువల్ల, వారి ని గురించి మనం పట్టించుకోవలసిన అవసరం లేదు.   పాకిస్తాన్ కు చెందిన హిందువు ఎక్కడైనా పౌరుడే అన్న దానికి సంబంధం లేకుండా, అతడి ని హిందుస్తాన్ కు చెందిన హిందువుల ను లేదా ముస్లిముల వలెనే రక్షించడం అనేది మన బాధ్యత గా ఉంది.’’ 

ఈ మాటల ను అన్నది ఎవరు?  ఇది కూడా జనసంఘ్ లో లేదా బిజెపి లో ఎవరికీ చెందినది కాదు.  ఇది శ్రీ రాం మనోహర్ లోహియా గారు చేసిన ప్రకటన.   మన స్వామ్యవాద సహచరులు, మమ్మల్ని నమ్మినా, నమ్మకపోయినా గాని కనీసం లోహియా గారి తో విభేదించకండి.  ఇది వారి కి నేను చేస్తున్న అభ్యర్థన. 

గౌరవనీయులైన చైర్ మన్, శాస్త్రి గారిదే మరొక ప్రకటన ను ఈ సభ లో చదవాలని నేను అనుకొంటున్నాను.   శరణార్థుల విషయం లో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవలసిన పాత్ర పై ఆయన ఈ ప్రకటన ను చేశారు.   లాల్ బహాదూర్ శాస్త్రి గారు చేసిన ఈ ప్రసంగాన్ని మీరు వినాలి.   వోట్ బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్ర శాసనసభల లో తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా వారు ఏ విధమైన నాటకాలు ఆడుతున్నారు.   మీరు ఎక్కడ కు వెళ్తున్నారో మీకు తెలుస్తుంది, మీరు ఎక్కడ ఉన్నారు, మీ ప్రజలకు ఏమయ్యింది. 

చైర్ మన్ సర్, లాల్ బహాదుర్ శాస్త్రి గారు అన్నారు కదా.. 

‘‘మన దేశం లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శరణార్ధుల కు ఆశ్రయాన్ని కల్పించడం అనే ఈ అంశాన్ని ఒక జాతీయ సమస్య గా గుర్తించాయి.   ఈ విషయం లో వారి ని అభినందిద్దాము.  ఇందుకు చాలా ఆనందం గా ఉంది.  బిహార్ గాని, ఒడిశా గాని, మధ్య ప్రదేశ్ గాని, ఉత్తర్ ప్రదేశ్ లేదా మహారాష్ట్ర లేదా ఆంధ్ర, అన్ని రాష్ట్రాలు వారు ఇక్కడ స్థిరపడడానికి సహాయపడతామంటూ తమ సన్నద్ధత ను తెలియజేస్తూ భారత ప్రభుత్వాని కి లేఖ లు వ్రాశాయి.  కొంతమంది అన్నారు 50 వేల మంది పురుషుల ను, మరి కొంత మంది 15 వేల కుటుంబాల ను, కొంత మంది 10 వేల కుటుంబాల బాధ్యత ను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు. 

1964 లో దేశంలోని చాలా రాష్ట్రాల లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం లో ఉన్న కాలం లో శాస్త్రి గారు ఈ ప్రకటన ను చేశారు.   అయితే, ఈ రోజు న, మనం చాలా మంచి పని ని చేస్తున్నాము, మీ వోట్ బ్యాంకు రాజకీయాల కోసం మీరు అడ్డంకుల ను సృష్టిస్తున్నారు. 

గౌరవనీయులైన అధ్యక్షా,

నేను మరొక ఉదాహరణ ను చెప్పాలనుకొంటున్నాను.   దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని నెలల్లోనే, 1947వ సంవత్సరం నవంబర్ 25వ తేదీ న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.   1947వ సంవత్సరం నవంబర్ 25వ తేదీ నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపాదన ఈ విధం గా ఉంది :

పాకిస్తాన్ నుండి సరిహద్దు దాటి భారత దేశంలో ప్రవేశించే ముస్లిమేతరులు వారి యొక్క ప్రాణాల ను, గౌరవాన్ని కాపాడుకోవడానికి వీలు గా వారికి అవసరమైన రక్షణ ను కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. 

ఈ రోజు న మీరు ఆ భాష మాట్లాడుతున్నట్లైతే, ఇది ముస్లిమేతరులకు. 

గౌరవనీయులైన అధ్యక్షా,

నేను నమ్మని సంగతి ఏమిటంటే 1947వ సంవత్సరం నవంబర్ 25వ తేదీ న కాంగ్రెస్ మతతత్వం తో వ్యవహరించిందన్న సంగతి ని. నేను నమ్మను.  ఇప్పుడు అది అకస్మాత్తు గా లౌకిక పార్టీ అయ్యింది.  దీనిని సైతం నేను నమ్మడం లేదు. 1947వ సంవత్సరం నవంబర్ 25వ తేదీ న ముస్లిమేతరులు అని వ్రాయడానికి బదులు, పాకిస్తాన్ నుండి వస్తున్న ప్రజలందరూ అని వ్రాయవలసింది, కానీ  ఈ విధం గా ఎందుకు మీరు వ్రాయలేదు.  ముస్లిమేతరులు అని ఎందుకు వ్రాశారు? 

విభజన అనంతర కాలం లో పాకిస్తాన్ లో ఉండిపోయిన హిందువుల లో చాలా మంది దళిత సోదరులు, దళిత సోదరీమణులు.  వారి ని ఉద్దేశించి బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ ఏమన్నారంటే-

‘‘షెడ్యూల్డ్ కులాల వారు పాకిస్తాన్ లోపల ఉంటే శిక్షింపబడుతారు.  అందువల్ల  భారతదేశానికి రావలసిందిగా వారి ని నేను కోరదలచాను..’’ అని.

బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ ఈ సందేశాన్ని ఇచ్చారు.   ఈ ప్రకటనలన్నీ గొప్ప గొప్ప వ్యక్తులు ఇచ్చారు.  వారు ఈ దేశ నిర్మాత లు.  వారు అందరూ మతతత్వ వాదులా ?  వోట్ బ్యాంకు రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీ, దాని సహచర దేశ నిర్మాత లు కూడా ఈ విషయాల ను విస్మరిస్తున్నారు.   ఇది దేశం చాలా విచారించవలసినటువంటి విషయం. 

గౌరవనీయులైన అధ్యక్షా,

1997వ సంవత్సరం లో, చాలా మంది సహచరులు ఇక్కడ ఉన్నారు, వారిలో కొంతమంది సభ లో కూడా ఉండవచ్చు.   అప్పటి ప్రభుత్వ సూచన ల మేరకు హిందువులు, సిఖ్ఖు లు అనే పదాల ను ఆ సంవత్సరంలోనే ఉపయోగించడం మొదలుపెట్టారు.   అంతకు ముందు లేని పదాల ను, అప్పుడు చేర్చారు.   2011వ సంవత్సరం లో లో పాకిస్తాన్ నుండి వస్తున్న క్రైస్తవులు, బౌద్దులు అనే పదాల ను కూడా కల్పించారు.   ఇదంతా 2011వ సంవత్సరం లో జరిగింది. 

పౌరసత్వ సవరణ చట్టాన్ని 2003వ సంవత్సరంలో లోక్ సభ లో ప్రవేశపెట్టారు.    పార్లమెంట్ స్థాయి సంఘం ఈ విషయాన్ని చర్చించి, పౌరసత్వ సవరణ చట్టం, 2003 ను ముందుకు తీసుకు పోయింది.  అప్పుడు ఆ కమిటీ లో కాంగ్రెస్ పార్టీ తరఫు న సభ్యులు గా ఉన్న వారి లో చాలా మంది, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు.    పార్లమెంట్ స్థాయి సంఘం అదే నివేదిక లో ఇలా పేర్కొన్నది.. ‘‘పొరుగు దేశాల నుండి వస్తున్న అల్పసంఖ్యాకుల ను రెండు భాగాలు గా చూడాలి,  ఒక భాగం మతపరమైన హింస ల వల్ల వచ్చే వారయితే, మరొక భాగం అలజడు ల కారణం గా వచ్చే అక్రమ వలసదారులు గా గుర్తించాలి.’’ ఇది కమిటీ నివేదిక.   ఈ రోజు న, ఈ ప్రభుత్వం దీని ని గురించి మాట్లాడుతూంటే, 17 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఈ విషయమై గొడవ ఎందుకు ? 

చైర్ మన్ సర్, పాకిస్థాన్ నుండి వచ్చిన హిందూ సమాజానికి చెందిన మైనారిటీలకు భారతీయ పౌరసత్వం మంజూరు చేయడానికి, రాజస్థాన్ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు, కేంద్ర ప్రభుత్వం, రాజస్థాన్ కు చెందిన రెండు జిల్లాల కలెక్టర్ లకు, గుజరాత్ కు చెందిన నాలుగు జిల్లా ల కలెక్టర్ లకు, 2004వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ న, అనుమతిని ఇచ్చింది.    2005వ సంవత్సరం లో, 2006వ సంవత్సరం లో ఈ నియమం కూడా అమలు లో ఉంది.   2005 లోను, 2006 లోను మీరు కూడా ఉన్నారు.   రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తి కి అప్పుడు ఎటువంటి ముప్పూ లేదు,  ఇది దానికి వ్యతిరేకం గా  కాదు. 

గత పది సంవత్సరాలు గా ఇది బాగానే ఉంది.  దీనిపై ఎటువంటి గొడవ చేయలేదు.  ఈ రోజు న అకస్మాత్తు గా మీ ప్రపంచం మారిపోయింది.  ఓటమి, ఓటమి మిమ్మల్ని కలవరపెడుతుంది, ఇది నేను ఎన్నడూ ఊహించనిది. 

గౌరవనీయులైన అధ్యక్షా, ఎన్ పి ఆర్ ను గురించి కూడా విస్తృతం గా చర్చ జరుగుతోంది.   జన గణన, ఎన్ పిఆర్ అనేవి  సాధారణ పరిపాలన కార్యకలాపాలు. గతం లో దేశం లో అనేక సార్లు జరిగాయి.  కానీ, వోట్ బ్యాంకు రాజకీయాల కారణం గా తప్పనిసరి పరిస్థితి ఏర్పడినప్పుడు 2010వ సంవత్సరం లో అప్పుడు ఎన్ పిఆర్ ప్రవేశపెట్టిన వారే ఈ రోజు న తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి, వ్యతిరేకిస్తున్నారు. 

గౌరవనీయులైన అధ్యక్షా,  మీరు జన గణన కూడా చూస్తే, దేశాని కి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, మొదటి దశాబ్దం లో కొన్ని ప్రశ్న లు ఉండేవి, రెండో దశాబ్దం లో కొన్ని ప్రశ్నల ను తొలగించి, కొన్ని ప్రశ్నల ను చేర్చారు.  అవసరమైనప్పుడు, పరిపాలన లో అవి మామూలే, స్వల్పం గా మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.  మనం వదంతుల ను వ్యాప్తి చేయకూడదు.  మన దేశం లో మాతృభాష పై గతం లో ఎప్పుడూ ఇంత పెద్ద సంక్షోభం తల ఎత్తలేదు.   ఈ రోజు న పెద్ద సంఖ్య లో ప్రజలు సూరత్ నుండి ఒడిశా కు వలస వెళ్ళారు.   అందువల్ల, ఒడియా పాఠశాలల ను నడపలేము అని గుజరాత్ ప్రభుత్వం అంటే, అప్పుడు అది ఎంత కాలం కొనసాగుతుంది.   ఎంతమంది ఏ మాతృభాష ను మాట్లాడుతున్నారు, అతని తండ్రి ఏ భాష మాట్లాడుతున్నాడు అనే సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి, అప్పుడు సూరత్ లో ఒడియా పాఠశాల లు ప్రారంభించాలని నేను భావిస్తున్నాను.  గతం లో వలస లు లేవు, ఇప్పుడు వలసలు పెరుగుతున్నందున ఇది అవసరమైంది. 

గౌరవనీయులైన అధ్యక్షా, గతం లో మన దేశాని కి వలసలు చాలా తక్కువ స్థాయి లో ఉండేవి.  కాల క్రమం లో, నగరాల పట్ల, నగరాల అభివృద్ధి పట్ల ఆకర్షణ పెరగడం వల్ల, మారుతున్న ప్రజల ఆకాంక్షల వల్ల, గత 30 - 40 సంవత్సరాల లో వలస లు గణనీయంగా పెరుగుతున్నాయి.    ఇప్పుడు, నేను కూడా వలసల ను గురించి ఆలోచిస్తున్నాను, ఈ రోజు వరకు, ఏ జిల్లా ల నుండి వలస లు ఉన్నాయి, జిల్లా నుండి ఎవరు వెళ్లిపోతున్నదీ తెలియకుండా, ఆ జిల్లా అభివృద్ధి కి ప్రాధాన్యాల ను నిర్ణయించలేము. 

ఇవన్నీ మీకు ముఖ్యం.. రెండోది, అనేక వదంతులను వ్యాప్తి చేయడం, ప్రజల ను తప్పు దోవ పట్టించడం, 2010వ సంవత్సరం లో మీరు ఎన్ పిఆర్ ను తీసుకు వచ్చారు.    2014వ సంవత్సరం నుండి మేము ఇక్కడ కూర్చున్నాము.  ఇదే ఎన్ పిఆర్ ను గురించి మేము  ఎవరినైనా  ప్రశ్నించామా, మా దగ్గర రికార్డు లు ఉన్నాయి.     మీ  ఎన్ పిఆర్ రికార్డు మా దగ్గర ఉంది.   మీ కాలంలో ఎన్ పిఆర్  రికార్డు.  ఎన్ పిఆర్  ఆధారం గా ఈ దేశ  పౌరుడు ఎవరూ హింసించబడలేదు. 

గౌరవనీయులైన అధ్యక్షా, ఇదే కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రక్రియ లో భాగం కావాలని, ప్రతి సాధారణ నివాసి, ఎన్ పిఆర్ లో తమ పేరు ను నమోదు చేసుకోవలసిన అవసరం ఉందని, ఎన్ పిఆర్ ను ప్రారంభించే సమయం లో, యుపిఎ హయాం లో అప్పుటి  హోం మంత్రి ప్రత్యేకం గా నొక్కి పలికారు.  ఎన్ పిఆర్ కు ప్రచారాన్ని కల్పించాలని, ఎన్ పిఆర్ లో చేరవలసిందంటూ  ప్రజల కు అవగాహన ను కల్పించాలని ఆయన ప్రసార మాధ్యమాల కు కూడా విజ్ఞప్తి చేశారు.   ఆ విధం గా, అప్పటి హోం మంత్రి బహిరంగ విజ్ఞప్తి ని చేశారు. 

యుపిఎ 2010వ సంవత్సరం లో ఎన్ పిఆర్ ను ప్రవేశపెట్టింది.  2011వ సంవత్సరం లో ఎన్ పిఆర్ కోసం బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించడం కూడా మొదలుపెట్టారు.   2014వ సంవత్సరం లో మీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి,  ఎన్ పిఆర్ లో భాగం గా కోట్లాది పౌరుల సమాచారాన్ని సేకరించడం, రికార్డు చేయడం పూర్తి అయింది. అయితే, బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించే పని కొనసాగుతోంది.  నేను, మీరు అధికారం లో ఉన్నప్పటి సంగతి ని గురించి చెప్తున్నాను. 

2015వ సంవత్సరం లో మీరు తయారు చేసిన ఆ ఎన్ పిఆర్ రికార్డుల ను మేము ప్రస్తుత పరిస్థితి కి అనుగుణం గా సవరించాము.   ఈ ఎన్ పిఆర్ రికార్డు ల ఆధారం గా, ఆ సమాచారాన్ని మేము సానుకూల మార్గం లో వినియోగించి, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ల వంటి ప్రభుత్వ పథకాలన్నిటి లో మిగిలిపోయిన లబ్దిదారుల ను చేర్చి పేదవారి కి ప్రయోజనాలను చేకూర్చాము. 

ఆయితే, ఈ రోజున, ఈ విషయాన్ని రాజకీయం చేసి, మీరు ఎన్ పిఆర్ ను వ్యతిరేకిస్తున్నారు.  కోట్లాది మంది పేద ప్రజలు ప్రజా సంక్షేమ పథకాల లో భాగం కాకుండా అడ్డుకొని మీరు పాపం చేస్తున్నారు.  పని కి మాలిన రాజకీయ ప్రయోజనం కోసం వారు చేస్తున్న పని వల్ల, వారి పేద వ్యతిరేక వ్యక్తిత్వం బయటపడుతోంది. 

2020వ సంవత్సరం జన గణన తో పాటు, ఎన్ పిఆర్ రికార్డుల ను సవరించాలని మేము భావించాము.  తద్వారా పేదల కోసం అమలు అవుతున్న పథకాలు మరింత సమర్ధం గా, నిజాయతీ గా వారి కి చేరే అవకాశం ఏర్పడుతుంది.  కానీ, ఇప్పుడు మీరు ప్రతిపక్షం లో ఉన్నారు, మీరు ప్రారంభించిన ఎన్ పిఆర్ నే మీరు చెడు గా పేర్కొంటున్నారు.   

గౌరవనీయులైన అధ్యక్షా,  అన్ని రాష్ట్రాలు, తగిన గజెట్ నోటిఫికేశన్ లను జారీ చేయడం ద్వారా,  ఎన్ పిఆర్ ను ఆమోదించాయి.  ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అర్ధాంతరం గా వాటి ఆమోదాన్ని వెనుకకు తీసుకొని, ఈ ప్రక్రియ కు అడ్డంకులు సృష్టిస్తున్నాయి.  దీని ప్రాముఖ్యాన్ని, దీని వల్ల పేదల కు కలిగే లాభాల ను ఉద్దేశపూర్వకం గా అలక్ష్యం చేస్తున్నాయి.   వారు 70 సంవత్సరాల లో చేయని పనుల ను మేము చేస్తున్నపుడు, ఇప్పుడు వారు ప్రతిపక్షం లో కూర్చుని ఈ రకం గా మాట్లాడం భావ్యం కాదు. 

మీరే స్వయం గా తీసుకు వచ్చి, ప్రచారం చేసి, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారం చేసి, ఇప్పుడు దాని ని అంటరానిది గా పేర్కొంటూ వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తున్నారు.   మీరు వోట్ బ్యాంకు రాజకీయాల కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటారు అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.  ఒకవేళ మిమ్మల్ని తృప్తి పరచవలసిన విషయం ఏదైనా ఉందంటే అది అభివృద్ధి మరియు విభజన ల మధ్యే ఉంటుంది.  మీరు ప్రజల ను విభజించే మార్గాన్నే బాహాటం గా ఎంచుకున్నట్లు కనుపిస్తోంది. 

ఇటువంటి అవకాశవాద ప్రతిపక్షం ఏ పార్టీ కైనా ప్రయోజనాన్ని కలిగించవచ్చు లేదా నష్టాన్ని కలిగించవచ్చు; అయితే, దీనివల్ల దేశం తప్పక దెబ్బతింటుంది.  ఇది దేశం లో విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితి ని కలుగజేస్తుంది.   అందువల్ల, నా అభ్యర్ధన ఏమిటంటే మనం వాస్తవాల ను మాత్రమే వెలికి తీద్దాము.  సరి అయినటువంటి విషయాలను మాత్రమే ప్రజల లోకి తీసుకు పోదాము. 

ఈ దశాబ్దం లో భారతదేశం పట్ల ప్రపంచం భారీ అంచనాల ను పెట్టుకొంది.  అదే విధం గా మన పట్ల భారతీయులు కూడా భారీ అంచనాల ను పెట్టుకొన్నారు.  130 కోట్ల భారతీయుల ఆకాంక్షల కు అనుగుణం గా వారి అంచనాల ను నెరవేర్చడానికి మనం అందరమూ కృషి చేద్దాము. 

జాతీయ ప్రయోజనాల కు సంబంధించిన అన్ని విషయాల లో, సభ సంగచ్ఛధ్వం తో, సంవాదధ్వం తో ముందుకు పోవాలి. అంటే కలసి నడుద్దాము, ఏకీకృతం గా ముందుకు పోదాము. ఈ సంకల్పం తో అడుగులు వేద్దాము.  వాదోపవాదాలు చేద్దాము, చర్చించుకొందాము, ఆ తరువాతనే నిర్ణయాల ను తీసుకొందాము. 

శ్రీ దిగ్విజయ్ సింహ్ గారు ఇక్కడ ఒక పద్యాన్ని చదివి వినిపించారు. కాబట్టి ఆ పద్యాన్ని నేను గుర్తుకు తెచ్చుకొంటున్నాను.


నాకు ఇల్లంటూ లేదు, ఒక్క ఖాళీ జాగాలే ఉన్నాయి

సత్యం, కరుణ, వాంఛ, స్వప్నాల తో నిండి ఉందది

నా దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి మరియు గొప్పదైనటువంటి దేశం గా చూడాలన్న కోరిక ఉంది
 
నా చుట్టూరా శాంతి, సంతోషం నిండి వుండాలన్నది నా స్వప్నం. 

భారత దేశ ముద్దు బిడ్డ, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. కలామ్ గారి యొక్క ఈ వాక్యాలు అంటే నాకు చాలా ఇష్టం.  ఈ వాక్యాలంటే మరి మీకు నచ్చిన వాక్యాల ను మీరు కూడా ఇష్టపడవచ్చును.   మీరు ఈ సామెత ను విని ఉంటారు.. " జాకీ రహీ భావనా జైసీ, ప్రభు మూరత్ దేఖీ తిన్ జైసీ".   మీ పంథా ను మార్చుకోవాలా?  లేదా 20వ శతాబ్దపు ఆలోచన తో 21వ శతాబ్దం లో జీవనాన్ని కొనసాగించాలా?  అనేది ఇప్పడు మీరు నిర్ణయించుకోవాలి. 

ఈ న్యూ ఇండియా ముందుకు కదలింది.   ఇది కర్తవ్యపాలన మార్గం లో సాగడం మొదలుపెట్టింది.  మరి కర్తవ్యం అంటేనే హక్కు లన్నింటి యొక్క సారాన్ని మూర్తీభవించుకొనేది.  ఇది మాత్రమే గాంధీ మహాత్ముడు ఇచ్చిన సందేశం. 

గాంధీ గారు బోధించిన విధి నిర్వహణ పంథా లో మనమంతా ముందుకు పోదాము. సుసంపన్నమైన, సమర్ధమైన, అచంచలమైన న్యూ ఇండియా నిర్మాణాన్ని ప్రారంభిద్దాము.  భారతదేశం యొక్క ప్రతి ఆకాంక్ష, ప్రతి సంకల్పం, మన అందరి సమష్టి కృషి తోనే సాకారం అవుతుంది. 

రాష్ట్రపతి గారి కి, సభ్యులు అయినటువంటి మీ అందరి కి నేను మరొక్క మారు నా హృదయ పూర్వక కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.  దేశం యొక్క ఏకత కు, అఖండత కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం ద్వారా, భారత రాజ్యాంగం లోని ఉన్నత భావాల ను గౌరవించడం ద్వారా, దేశం పురోగమించడానికి  మన వంతు సహకారాన్ని అందిస్తూ, మనం కలసి నడుద్దాము. 

చర్చ ను సుసంపన్నం చేసిన గౌరవనీయులైన సభ్యులకు, గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి, ఈ స్పూర్తి తో, నేను నాయొక్క కృతజ్ఞత ను మరొక్క సారి మనసారా తెలియజేసుకొంటున్నాను. . 

మీకు అందరి కి అనేకానేక ధన్యవాదాలు.

**


(Release ID: 1605780) Visitor Counter : 445