మంత్రిమండలి
ఆదాయం పై పన్నుల కు సంబంధించి ఆర్థిక ఎగవేత ను నిరోధించడం మరియు రెండు సార్లు పన్ను విధింపు ను నివారించడం కోసం భారతదేశాని కి మరియు శ్రీ లంక కు మధ్య ఒప్పందాన్ని సవరించే ప్రోటోకాల్ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
प्रविष्टि तिथि:
12 FEB 2020 3:51PM by PIB Hyderabad
ఆదాయం పై పన్నుల కు సంబంధించి ఆర్థిక ఎగవేత ను నిరోధించడం మరియు రెండు పర్యాయాలు పన్ను విధించడాన్ని నివారించడం కోసం భారతదేశాని కి మరియు శ్రీ లంక కు మధ్య ఒప్పందాన్ని సవరించే ప్రోటోకాల్ పై సంతకాల కు మరియు సంబంధిత అనుమోదాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగి న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ప్రభావం:
రెండు సార్లు పన్ను విధింపు నివారక ఒప్పందం (డిటిఎఎ)లో ఒక సాధారణ దుర్వినియోగ వ్యతిరేక నిబంధన అయిన ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ ను చేర్చడం, అలాగే పీఠిక యొక్క పాఠం లో మార్పు చేయడం వల్ల అంతిమం గా పన్నుల నియమావళి లో గల అంతరాల ను మరియు అపసవ్యతల ను సొమ్ము చేసుకొనేటటువంటి పన్ను ప్రణాళిక వ్యూహాల ను నిరోధించడాని కి వీలవుతుంది.
వివరాలు:
- భారతదేశాని కి మరియు శ్రీ లంక కు మధ్య ప్రస్తుతం అమలవుతున్న డిటిఎఎ పై 2013వ సంవత్సరం జనవరి 22వ తేదీన సంతకాలయ్యాయి. ఇది 2013వ సంవత్సరం అక్టోబరు 22వ తేదీ న అమలు లోకి వచ్చింది.
- భారతదేశం మరియు శ్రీ లంక ఇన్‌క్లూసివ్ ఫ్రేమ్ వర్క్ లో సభ్యత్వ దేశాలు గా ఉన్నాయి. ఈ కారణం గా ఇన్‌క్లూసివ్ ఫ్రేమ్ వర్క్ లో సభ్యత్వం కలిగివున్న దేశాల తో డిటిఎఎ ల విషయం లో నిర్దేశించిన జి-20 ఒఇసిడి బిఇపిఎస్ కార్యాచరణ నివేదిక ల తాలూకు కనీస ప్రమాణాల ను భారతదేశం మరియు శ్రీ లంక అమలు పరచవలసిన అగత్యం ఉన్నది. బిఇపిఎస్ 6 తాలూకు కనీస ప్రమాణాల ను ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా గాని, లేదా మల్టి లేటరల్ కన్ వెన్ శన్ టు ఇంప్లిమెంట్ టాక్స్ ట్రీటీ రిలేటెడ్ మెజర్స్ టు ప్రివెంట్ బేస్ ఈరోజన్ ఎండ్ ప్రాఫిట్ శిఫ్టింగ్ (ఎమ్ఎల్ఐ) ద్వారా గాని పాటించేందుకు వీలు ఉన్నది.
- భారతదేశం ఎమ్ఎల్ఐ యొక్క సంతకందారు దేశం గా ఉన్నది. అయితే, శ్రీ లంక మాత్రం ప్రస్తుతాని కి ఎమ్ఎల్ఐ లో ఒక సంతకందారు దేశం గా లేదు. కాబట్టి, ఇండియా-శ్రీ లంక డిటిఎఎ ను ద్వైపాక్షిక సవరణ కు లోను చేయవలసిన అవసరం ఉంది. తద్వారా పీఠిక లో మార్పు చేయడం, అలాగే ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ (పిపిటి) నిబంధనల ను చొప్పించేందుకు చొరవ ను తీసుకోవలసివున్నది. ఇలా చేయడం ద్వారా జి-20 ఒఇసిడి బేస్ ఈరోజన్ ఎండ్ ప్రాఫిట్ శిఫ్టింగ్ (బిఇపిఎస్) ప్రోజెక్టు లో భాగం గా పేర్కొన్న ఒడంబడిక కు సంబంధించిన కనీస ప్రమాణాల ను పాటించడానికి మార్గం సుగమం అవుతుంది.
పూర్వరంగం:
రెండు సార్లు పన్ను విధింపు నివారక ఒప్పందం (డిటిఎఎ)పై భారతదేశాని కి మరియు శ్రీ లంక కు మధ్య 2013వ సంవత్సరం జనవరి 22వ తేదీ న సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం 2013వ సంత్సరం అక్టోబరు 22వ తేదీ న అమలులోకి వచ్చింది. భారతదేశం మరియు శ్రీ లంక ఇన్‌క్లూసివ్ ఫ్రేమ్ వర్క్ లో సభ్యత్వ దేశాలు గా ఉన్నాయి. ఈ కారణం గా ఇన్‌క్లూసివ్ ఫ్రేమ్ వర్క్ లో భాగం పంచుకొన్న దేశాల తో డిటిఎఎ ల విషయం లో నిర్దేశించిన జి-20 ఒఇసిడి బిఇపిఎస్ కార్యాచరణ నివేదిక ల తాలూకు కనీస ప్రమాణాల ను భారతదేశం మరియు శ్రీ లంక అమలు పరచవలసిన అగత్యం ఉన్నది. బిఇపిఎస్ 6 తాలూకు కనీస ప్రమాణాల ను ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా గానీ, లేదా మల్టీ లేటరల్ కన్వెన్శన్ టు ఇంప్లిమెంట్ టాక్స్ ట్రీటీ రిలేటెడ్ మెజర్స్ టు ప్రివెంట్ బేస్ ఈరోజన్ ఎండ్ ప్రాఫిట్ శిఫ్టింగ్ (ఎంఎల్ఐ) ద్వారా గానీ పాటించేందుకు వీలున్నది. భారతదేశం ఎమ్ఎల్‌ఐ పై సంతకం చేసింది.
**
(रिलीज़ आईडी: 1603011)
आगंतुक पटल : 195