మంత్రిమండలి
ప్రధాన పోర్టు ట్రస్టు మరియు డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు/శ్రామికుల కు ఉత్పాదకత తో ముడిపెట్టిన ప్రతిఫలం పథకాన్ని 2017-18కి మించిన కాలాని కి పొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
प्रविष्टि तिथि:
29 JAN 2020 4:06PM by PIB Hyderabad
ప్రస్తుతం అమలవుతున్న ఉత్పాదకత తో ముడిపెట్టిన ప్రతిఫలం (పిఎల్ఆర్) పథకాన్ని ఆ పథకం లో ఏదైనా మార్పు/సవరణ చేసేటంత వరకు 2017-18వ సంవత్సరాని కి మించి సైతం పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగి న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ పథకం ప్రధాన పోర్టు ట్రస్టు లు మరియు డాక్ ఉద్యోగులు/శ్రామికులు 28,821 మంది కి వార్షిక లబ్ధి ని చేకూర్చనుంది; దీనికి గాను సంవత్సరాని కి 46 కోట్ల రూపాయలు వ్యయం కావచ్చని అంచనా. ఉత్పాదకత తో ముడిపెట్టిన ప్రతిఫలాన్ని నెల కు 7000 రూపాయల బోనస్ గణన కోసం ప్రస్తుతమున్న వేతన పరిమితి పైన లెక్కించనున్నారు. ఈ పథకం నౌకాశ్రయాల రంగం లో మెరుగైన ఉత్పాదకత కు కూడా దన్ను గా నిలవడం తో పాటు సౌహార్దభరిత పని వాతావరణాన్ని మరియు మెరుగైనటువంటి పారిశ్రామిక సంబంధాల ను ప్రోత్సహిస్తున్నది.
ప్రధాన పోర్టు ట్రస్టు లు మరియు డాక్ లేబర్ బోర్డు యొక్క ఉద్యోగులు, శ్రామికుల కోసం ఉత్పాదకత తో ముడిపెట్టిన ప్రతిఫలం (పిఎల్ఆర్) పథకం ఒకటి ఈసరికే అమలులో ఉంది. దీని లో భాగం గా ప్రధాన పోర్టు ట్రస్టు ల శ్రామిక సమాఖ్యల కు మరియు యాజమాన్యాని కి మధ్య కుదిరే ఒప్పందం ఆధారం గా సంవత్సరవారీ ఉమ్మడి నౌకశ్రయాల ప్రదర్శన సూచీ (ఈ సూచీ లో అఖిల భారత స్థాయి ప్రదర్శన కు 50 శాతం మరియు ఆయా నౌకశ్రయాల పనితీరు కు 50 శాతం వంతు న వెయిటేజి ఉంటుంది) ప్రాతిపదిక న పిఎల్ ఆర్ ను మంజూరు చేయడం జరుగుతోంది.
**
(रिलीज़ आईडी: 1601058)
आगंतुक पटल : 206