మంత్రిమండలి

బాల్యం తొలి ద‌శ సంర‌క్ష‌ణ రంగం లో ద్వైపాక్షిక స‌హ‌కారం కోసం భార‌త‌దేశాని కి మ‌రియు బ్రెజిల్ కు మ‌ధ్య ఎంఒయు పై సంత‌కాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 22 JAN 2020 3:33PM by PIB Hyderabad

బాల్యం తొలి ద‌శ సంర‌క్ష‌ణ రంగం లో ద్వైపాక్షిక స‌హ‌కారాని కి ఉద్దేశించిన‌టువంటి ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎంఒయు)పై రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా మ‌హిళలు, బాలల వికాస మంత్రిత్వ శాఖ మ‌రియు ఫెడ‌రేటివ్ రిప‌బ్లిక్ ఆఫ్ బ్రెజిల్ కు చెందిన పౌర‌స‌త్వ మంత్రిత్వ శాఖ ల సంత‌కాల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

 

లాభాలు

 

ఈ ఎంఒయు బాల్యం తొలి ద‌శ సంర‌క్ష‌ణ కు సంబంధించిన అంశాల లో రెండు దేశాల మ‌ధ్య గల ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని పెంపొందించ‌డం తో పాటు ఉభ‌య దేశాల మ‌ధ్య మైత్రీపూర్వ‌క బంధాల ను పటిష్ఠపరచనుంది.  ఈ రంగం లో ఆయా దేశాలు అనుస‌రిస్తున్నటువంటి ఉత్త‌మ‌ అభ్యాసాల ఆదాన ప్రదానం ద్వారా ఇరు దేశాలు ప‌ర‌స్ప‌రం ప్రయోజనాలను పొందుతాయి.



**


(Release ID: 1600273) Visitor Counter : 117