మంత్రిమండలి

భారతదేశానికి మరియు ఫ్రాన్స్ కు మధ్య దేశాంతర గమనం మరియు గతిశీలత భాగస్వామ్య ఒప్పందాన్ని ఖాయపరచటాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 08 JAN 2020 3:13PM by PIB Hyderabad

భారతదేశానికి మరియు ఫ్రాన్స్ కు మధ్య దేశాంతర గమనం మరియు గతిశీలత భాగస్వామ్య ఒప్పందాన్ని ఖాయపరచటాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ ఒప్పందం పై ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశం లో ఆధికారిక యాత్ర కు విచ్చేసిన సందర్భం లో- 2018 మార్చి నెల లో- సంతకాలు అయ్యాయి.

ఇరు దేశాల ప్రజల మధ్య నేరు సంబంధాల ను పెంపొందింపచేయడం, విద్యార్థుల, విద్యావేత్తల, పరిశోధకుల మరియు వృత్తినిపుణుల దేశాంతర గమనాన్ని ప్రోత్సహించడం తో పాటు క్రమరహిత దేశాంతర గమనం మరియు మనుషుల ను అక్రమం గా చేరవేయటానికి సంబంధించిన సమస్యల పై ఉభయ పక్షాలు సహకరించుకోవడం వంటివి ఈ ఒప్పందం లో భాగం గా ఉన్నాయి.   ఫ్రాన్స్ తో భారతదేశం శర వేగంగా విస్తరింపచేసుకొంటున్న బహుశ పార్శ్విక సంబంధానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం గా ఉండటమే కాక రెండు పక్షాల మధ్య పెరుగుతున్నటువంటి నమ్మకానికి మరియు విశ్వాసానికి సంకేతం గా కూడా ఉంది.

ఈ ఒప్పందం మొదట్లో ఏడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.  దీని లో ఆటోమేటిక్ రిన్యూవల్ నిబంధన ను చేర్చడం జరిగింది.  ఒక సంయుక్త కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఒప్పందం అమలు ను పర్యవేక్షించే వ్యవస్థ కు వీలు కల్పించారు.


**  



(Release ID: 1598840) Visitor Counter : 171