మంత్రిమండలి
ఆయుధాల (సవరణ) బిల్లు, 2019 లో ఆధికారిక సవరణల ను ఆమోదించిన మంత్రిమండలి
प्रविष्टि तिथि:
24 DEC 2019 4:20PM by PIB Hyderabad
లోక్ సభ 2019వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ నాడు ఆమోదించినటువంటి ఆయుధాల (సవరణ) బిల్లు, 2019లో ఆధికారిక సవరణల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు
ఇది అక్రమ ఆయుధాలు మరియు వాటి వ్యాపారం, ఇంకా వాటి ని సమకూర్చుకోవడం, వాటి తయారీ లను
నిరోధిస్తుంది. దీని తో అటువంటి ఆయుధాల లైసెన్సు మంజూరు నిబంధన లు ఒక పటిష్ఠమైన క్రమం లోకి రూపుదాలుస్తాయి. ప్రస్తుత కాలపు భద్రత సంబంధిత ఆవశ్యకతల ను మెరుగైన రీతి లో పరిష్కరించడం జరుగుతుంది. చట్ట వ్యతిరేకం గా ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి సంబంధిత వ్యాపారం, వ్యాప్తి లతో పాటు వాటితో సంబంధం గల ఘటనల ను ప్రభావశీలమైనటువంటి పద్ధతి లో అడ్డుకోవడం సాధ్యపడుతుంది. అదే కాలం లో, చట్టాన్ని పాటించే కోవకు చెందినటువంటి ఆయుధ లైసెన్సు లు కలిగిన వారి యొక్క ఆయుధ లైసెన్సు అవధి ని పెంచే సౌకర్యం కూడా అందివస్తుంది.
ఆయుధాల చట్టం లో సవరణల కు ఆమోద ముద్ర లభించడం వల్ల ఇలెక్ట్రానిక్ లైసెన్సు అందుబాటులోకి వచ్చే, లైసెన్సు చెల్లుబాటు గడువు ను విస్తరించే దిశ గా పయనించినట్లు అవుతుంది. అంతేకాక కఠినమైనటువంటి జరిమానా నిబంధన లను ప్రతిపాదించినందువల్ల, అక్రమం గా ఆయుధాల ను కలిగివుండే ధోరణి ని నియంత్రించేందుకు మరింత పక్కా యంత్రాంగాన్ని నిర్మించడం లో తదుపరి అడుగు ను వేసినట్లు కూడా అవుతోంది.
**
(रिलीज़ आईडी: 1597545)
आगंतुक पटल : 157