మంత్రిమండలి
బెంగాల్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రెగ్యులేశన్ ను సవరించడాని కి ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని మంజూరు చేసిన మంత్రిమండలి
నాడు పోస్టు చేయడమైనది:
24 DEC 2019 4:29PM by PIB Hyderabad
బెంగాల్ ఈస్టర్న్ ఫ్రంటియర్ (బిఇఎఫ్ఆర్), 1873ను సవరించడం కోసం భారత రాష్ట్రపతి రాజ్యాంగ 372వ అధికరణం లోని క్లాజు (2)కు అనుగుణం గా జారీ చేసినటువంటి ఆడాప్టేశన్ ఆఫ్ లాస్ (అమెండ్‌మెంట్) ఆర్డర్, 2019కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
మణిపుర్ స్థానిక ప్రజల కు పౌరసత్వ సరవణ చట్టం, 2019 తాలూకు నిబంధనల నుండి రక్షణ ను ఇవ్వడం కోసం ఈ నోటిఫికేశన్ బిఇఎఫ్ఆర్ ను మణిపుర్ రాష్ట్రాని కి కూడా విస్తరించడం తో పాటు ప్రస్తావిత రెగ్యులేశన్ లో అవసరమైన మార్పుల కు కూడా మార్గాన్ని సుగమం చేస్తుంది.
**
(రిలీజ్ ఐడి: 1597535)
సందర్శకుల సూచీ సంఖ్య : : 142