మంత్రిమండలి

బ‌యోఎన‌ర్జీ రంగం లో స‌హ‌కారం కోసం బ్రెజిల్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఎంఒయు పై సంత‌కాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 24 DEC 2019 4:36PM by PIB Hyderabad

బ‌యోఎన‌ర్జీ రంగం లో స‌హ‌కారం కోసం బ్రెజిల్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద (ఎంఒయు) ప‌త్రం పై సంత‌కాల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ప్ర‌పంచం లో శ‌క్తి ని వినియోగించుకొంటున్న ప్ర‌ధానమైన దేశాల లో భార‌త‌దేశం, బ్రెజిల్ లు ఉన్నాయి.  బ్రెజిల్ యావ‌త్తు లాటిన్ అమెరికా మ‌రియు కెరేబియ‌న్ (ఎల్ఎసి) ప్రాంతం లో భార‌త‌దేశాని కి అతి ప్ర‌ధాన‌మైన వ్యాపార భాగ‌స్వామ్య దేశాల లో ఒక దేశం గానూ ఉంది.  ప్ర‌స్తుతం బ్రెజిల్ ప్ర‌పంచం లో కెల్లా రెండో అతి పెద్ద బ‌యోఫ్యూయ‌ల్స్ ఉత్ప‌త్తిదారు దేశం గా కూడా ఉంది.  బ్రెజిల్ యొక్క శ‌క్తి మిశ్ర‌ణం లో 18 శాతం మేర‌కు బ‌యోఫ్యూయ‌ల్స్, ఇంకా బ‌యో ఇలెక్ట్రిసిటీ లు లెక్క కు వ‌స్తున్నాయి.  బ‌యోఫ్యూయ‌ల్స్ రంగం లో భార‌త‌దేశం సైతం ప్ర‌ధానం గా దృష్టి ని కేంద్రీక‌రించింది.  బ‌యోఫ్యూయ‌ల్స్ కు సంబంధించి 2018వ సంవ‌త్స‌రం లో నూత‌న విధానాన్ని ప్రకటించిన మేరకు 2030వ సంవ‌త్స‌రం క‌ల్లా పెట్రోల్ లో ఇథ‌నాల్ ను 20 శాతం మేర‌కు మేళ‌వించాల‌ని, డీజ‌ల్ లో 5 శాతం మేర‌కు బ‌యోడీజ‌ల్ ను మేళ‌వించాల‌ని భార‌త‌దేశం ల‌క్ష్యం గా పెట్టుకొంది. 
 
బ్రెజిల్ అధ్య‌క్షుడు మ‌రియు భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లు 2016వ సంవ‌త్స‌రం లో భార‌త‌దేశం లో స‌మావేశ‌మైన సంద‌ర్భం లో రెండో త‌రం బ‌యోఫ్యూయ‌ల్స్ రంగం తో పాటు అక్ష‌య శ‌క్తి తాలూకు ప‌రిశోధ‌న రంగంలోను,  అభివృద్ధి రంగం లోను స‌హ‌కారాన్ని అందించుకోవాల‌ని ఉభ‌య ప‌క్షాలు అంగీక‌రించాయి.
 
ఈ మేర‌కు బ‌యోఫ్యూయ‌ల్, బ‌యో ఇలెక్ట్రిసిటీ, బ‌యో గ్యాస్ స‌ప్ల‌య్-చైన్స్ ల లో పెట్టుబ‌డి ని ప్రోత్స‌హించ‌డం కోసం, ఆయా రంగాల లో స‌హ‌క‌రించుకోవ‌డం కోసం ఒక ఫ్రేమ్ వ‌ర్క్ ను ఎంఒయు అందిస్తుంది.  వ్య‌ావ‌సాయిక ప‌ద్ధ‌తుల కు మ‌రియు విధానాల కు సంబంధించిన స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డం, బ‌యోఫ్యూయ‌ల్స్ వినియోగం పై ఆధార‌ప‌డిన‌టువంటి హ‌రిత‌ వాయు ఉద్గార స్థాయిల‌ ను త‌గ్గించ‌డం కోసం అవ‌లంబించ‌వ‌ల‌సిన విధానాలు; వ్య‌వ‌స్థీకృత విప‌ణి లో వ్యాపారాని కి ఉద్దేశించిన ఉద్గార న్యూనీక‌ర‌ణ ధ్రువ ప‌త్రాల జారీ, శిలాజ జ‌నిత ఇంధ‌నాల తో  వేరు వేరు శాతాల‌ బ‌యోఫ్యూయ‌ల్స్ ను మిళితం చేయడానికి సంబంధించినంత వ‌ర‌కు ఇంజిన్‌ లలో మ‌రియు ఇంధ‌నాల లో ప్ర‌వేశ‌పెట్ట‌వ‌ల‌సిన‌టువంటి మార్పు చేర్పులు / సర్దుబాటులు.. ఇవన్నీ కూడాను ఎంఒయు ముఖ్య అంశాలు గా ఉన్నాయి.

*** (Release ID: 1597529) Visitor Counter : 149