మంత్రిమండలి

మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్‌ ను ఏర్పాటు చేయడాని కి , జాతీయ రహదారి ప్రాజెక్టుల ద్వారా రాబ‌డి ఆర్జించడాని కి ఎన్‌హెచ్‌ఎఐ కి అధికారం ఇచ్చిన కేంద్ర కేబినెట్

Posted On: 11 DEC 2019 6:11PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్  రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 
ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సెబి జారీ చేసిన ఇన్విట్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు  మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ (లు) (ఇన్విట్) ను ఏర్పాటు చేయడానికి ,నేశనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) కు కేబినెట్ అధికారం ఇచ్చింది. 
పూర్తి అయిన  క‌నీసం ఒక సంవ‌త్స‌రం టోల్ క‌లెక్ష‌న్ క‌లిగిన జాతీయ రహదారుల పై రాబ‌డి ఆర్జించడానికి ఎన్‌హెచ్‌ఎఐ కి ఇది అనుమతిస్తుంది.  అలాగే, గుర్తింపు పొందిన‌ రహదారుల‌పై టోల్ వసూలు చేసే హక్కు ఎన్‌హెచ్ఎఐ కి ఉంటుంది.

ప్ర‌భావం

ఇన్‌విట్ ఒక సాధ‌నం గా పెట్టుబ‌డి దారుల‌ కు మ‌రింత సౌల‌భ్యాన్ని క‌లిగించ‌డంతోపాటు కింది అవ‌కాశాల‌ ను క‌లిగించ‌నుంది.

•  ప్ర‌త్యేక‌మైన ఒ&ఎం రాయితీలు

•  దీర్ఘ‌కాలిక‌ మూలధనాన్ని (20-30 సంవత్సరాలు) భారత రహదారి మార్కెట్‌ కు ఆకర్షించడం. పెట్టుబడిదారులు నిర్మాణ రిస్క్‌కు విముఖం గా ఉన్నందున, దీర్ఘకాలిక స్థిరమైన రాబడిని అందించే ఆస్తుల లో పెట్టుబడులు పెట్టడాని కి ఆసక్తి కలిగి ఉన్నారు.

•  రిటైల్ దేశీయ పొదుపు, ప్రత్యేక సంస్థ ల కార్పస్ (మ్యూచువల్ ఫండ్స్, పిఎఫ్‌ఆర్‌డిఎ మొదలైనవి) ఇన్విట్ ద్వారా మౌలిక సదుపాయాల రంగం లో పెట్టుబడులు పెట్టాలి.
    
నేప‌థ్యం

రోడ్లు, రహదారులు దేశ‌ ఆర్థిక వ్యవస్థ  జీవనాడులు. ఇవి మారుమూల, సుదూర ప్రాంతాల ను అనుసంధానిస్తాయి. ప్రాంతీయ పాన్-ఇండియా ప్రాతిపదికన సమర్థవంతమైన రవాణా స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి.. జాతీయ రహదారుల అభివృద్ధి, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి , ఒక ప్రాంతం  మొత్తం ఆర్థిక పురోగ‌తి కి గుణాత్మ‌కం గా  ఉప‌క‌రిస్తుంది.

అక్టోబర్ 2017 లో, భారత ప్రభుత్వం భార‌త్ మాలా ప‌రియోజ‌న‌ ను ప్రారంభించింది.  ఇది భారత ప్రభుత్వం  ప్రధాన రహదారి అభివృద్ధి కార్యక్రమం. ఇది రూ. 5,35,000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి తో 24,800 కిలో మీటర్ల రహదారుల ను  అభివృద్ధి కోసం నిర్దేశించిన కార్య‌క్ర‌మం.

భారత్‌మాల కార్యక్రమం చేపట్టిన స్థాయిని  బట్టి, నిర్దేశించిన కాలపరిమితి లో ప్రాజెక్టుల ను పూర్తి చేయడాని కి ఎన్‌హెచ్‌ఎఐ కి తగినన్ని నిధులు అవసరం.  ఇందుకు నిధులు స‌మ‌కూర్చుకోవ‌డం లో భాగం గా, పూర్తయిన జాతీయ ర‌హ‌దారుల‌ ఆస్తుల నుంచి రాబ‌డి ఆర్జించ‌డాని కి, వాటి విలువ ను పెంచి  రహదారుల నిర్మాణం లో పెట్టుబడులు పెట్టడాని కి ప్రైవేట్ ప‌క్షాల‌ ను ఆకర్షించ‌డాని కి అనువైన  పథకాల ను అందించడం.

అమ‌లు 

ప‌రిమిత వ‌న‌రులు క‌లిగిన ఎన్‌హెచ్ఎఐ వంటి సంస్థలు కొత్త‌, వినూత్న‌మైన ఫైనాన్సింగ్ స‌దుపాయాల‌ ను ఉప‌యోగించ‌డం అవ‌స‌రం. ఇప్పటికే ఉన్న నిధుల వనరుల ను పరిమితం చేయడం అనివార్యం గా మారింది.  అప్పటి ఆర్థిక మంత్రి, 2018-19 సంవత్సరపు తన బడ్జెట్ ప్రసంగం లో, ఎన్ హెచ్ఎ ఐ తన రోడ్ల‌ కు సంబంధించిన‌ ఆస్తుల ను స్పెశల్ ప‌ర్ప‌స్ వెహికిల్స్‌ గా మార్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని అలాగే, టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ న‌మూనా, మౌలిక స‌దుపాయాల పెట్టుబ‌డుల నిధి(ఐఎన్ విఐటి లు) వంటి వినూత్న రాబ‌డి అవ‌కాశాల‌ను ఉపయోగించవచ్చని సూచించారు.

గ‌త అనుభవాల‌ ఆధారం గా, మూలధన మార్కెట్ల ద్వారా అదనపు వనరుల ను సమీకరించే లక్ష్యం తో ఎన్‌హెచ్‌ఎఐ, జాతీయ రహదారుల ప్రాజెక్టుల ద్వారా రాబ‌డి ఆర్జించడాని కి ఇన్విట్ ఏర్పాటు పై చురుకు గా పని చేస్తోంది.

ఎన్‌హెచ్ఎఐ కి చెందిన ఇన్‌విట్ ఎన్‌హెచ్ఎఐ ద్వారా ఇండియ‌న్ ట్ర‌స్ట్ చ‌ట్టం 1882 కింద ఏర్పాటైన‌దై , 2014 సెక్యూరిటీలు ఎక్సేంజ్ బోర్డ్  ఆఫ్ ఇండియా రెగ్యులేశన్స్ కు అనుగుణం గా ఉంటుంది.
ఇన్విట్ ట్రస్ట్ ప్రధానం గా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లో పెట్టుబడి పెట్టే లక్ష్యం తో ఏర్పడనుంది. (ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న‌రీతిలో). ఇన్విట్ నేరుగా లేదా ఎస్‌.పి.వి ద్వారా,  లేదా హోల్డింగ్ ద్వారా ఆస్తుల ను కలిగి ఉండవచ్చు

***
  


(Release ID: 1596445) Visitor Counter : 159