మంత్రిమండలి

విమాన (సవరణ) బిల్లు, 2019 కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 11 DEC 2019 6:08PM by PIB Hyderabad

విమాన చట్టం, 1934 (1934 లోని XXII)కు సవరణల ను చేయడం కోసం ఉద్దేశించినటువంటి విమాన సవరణ బిల్లు, 2019ని ప్రవేశపెట్టడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  ఈ బిల్లు ను ఇక పార్లమెంట్ లో ప్రవేశపెడతారు.

ఈ బిల్లు గరిష్ఠ పరిమితి ని ఇప్పుడు ఉన్న 10 లక్షల రూపాయల నుండి ఒక కోటి రూపాయల కు పెంచుతుంది.  ఇది వాయుయాన సంచాలన కు సంబంధించిన రంగాలన్నిటి నియంత్రణ ను చేర్చడానికి ప్రస్తుత చట్ట పరిధి ని విస్తరింపజేస్తుంది.

ఈ సవరణ లు ఇంటర్ నేశనల్ సివిల్ ఏవియేశన్ ఆర్గనైజేశన్ (ఐసిఎఒ) యొక్క ఆవశ్యకతల ను తీర్చుతాయి.  దీని తో భారతదేశం లోని మూడు నియంత్రణ సంస్థ లు మరింత ప్రభావవంతం గా మారుతాయి.  ఆ మూడు సంస్థ లు ఏవేవంటే ఒకటోది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేశన్, రెండోది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేశన్, ఇక మూడోది ఎయర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్ వెస్టిగేశన్ బ్యూరో.  తత్ఫలితం గా దేశం లో విమానాల కార్యకలాపాల కు సంబంధించిన భద్రత మరియు సురక్ష ల యొక్క స్థాయి అధికం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది.


**


(Release ID: 1596087)