మంత్రిమండలి
నౌకల ఊడదీత-పునర్వినియోగ బిల్లు-2019 అమలు, సురక్షిత- పర్యావరణ నౌకల పునరుపయోగం పై హాంకాంగ్ అంతర్జాతీయ ఒప్పందం-2009లో భాగస్వామ్యం పై ప్రతిపాదనల కు మంత్రిమండలి ఆమోదం
Posted On:
20 NOV 2019 10:38PM by PIB Hyderabad
నౌకల ఊడదీత-పునర్వినియోగ బిల్లు-2019 అమలు, సురక్షిత- పర్యావరణ రీతి లో నౌకల ఊడదీత-పునర్వినియోగం పై హాంకాంగ్ అంతర్జాతీయ ఒప్పందం-2009 లో భాగస్వామ్యం పై ప్రతిపాదనల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
• నౌకల ఊడదీత-పునర్వినియోగం కోసమా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా నౌకల లో ప్రమాదకర పదార్థాల వాడకాన్ని లేదా ఏర్పాటు చేయడంపై నిషేధం-నిరోధాల ను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. సంబంధిత చట్టం అమలు లోకి వచ్చిన మరుక్షణం నుంచే కొత్త నౌకల లో ప్రమాదకర పదార్థాల వాడకం పై నిషేధం లేదా ఆంక్షలు కూడా అమలవుతాయి. అదే సమయంలో ప్రస్తుతం నడుస్తున్న నౌకలకు ఈ చట్టం పాటించేందుకు అయిదేళ్ల గడువుంటుంది. అయితే, యుద్ధ నౌకలు, ప్రభుత్వ నిర్వహణ లోని వాణిజ్యేతర నౌకల కు ఈ నిషేధం లేదా నిరోధం వర్తించవు. ఈ చట్టాని కి అనుగుణం గా నౌకల లో ప్రమాదకర పదార్థాల వాడకాని కి సంబంధించి వాటిపై సర్వే, ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. అలాగే ఈ బిల్లు కింద నౌకల ఊడదీత-పునర్వినియోగ కేంద్రాలు అనుమతి పొందాలి.
• నౌకల ఊడదీత-పునర్వినియోగ కార్యకలాపాలను అటువంటి అనుమతి పొందిన కేంద్రాల్లో మాత్రమే నిర్వహించాలి.
• అలాగే నౌక సంబంధిత నిర్దిష్ట ఊడదీత-పునర్వినియోగ ప్రణాళికకు తగినట్లు మాత్రమే ఆ కార్యకలాపాలు చేపట్టాలి. భారతదేశంలో ఊడదీత-పునర్వినియోగ కార్యకలాపాలు చేపట్టడంపై హాంకాంగ్ ఒప్పందం మేరకు సదరు నౌకలు ఊడదీత-పునర్వినియోగ పనులకు సిద్ధంగా ఉన్నట్లు ధ్రువీకరణ పొందాలి.
ప్రధానాంశాలు:
• నౌకల ఊడదీత-పునర్వినియోగ కార్యకలాపాలకు నిర్దిష్ట అంతర్జాతీయ ప్రమాణాల నిర్దేశంతోపాటు వాటి అమలుకు చట్టబద్ధ యంత్రాంగం ఏర్పాటు దిశగా ఓడల ఊడదీత-పునర్వినియోగ బిల్లు-2019ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
• అలాగే సురక్షిత- పర్యావరణ రీతిలో నౌకల ఊడదీత-పునర్వినియోగంపై హాంకాంగ్ అంతర్జాతీయ ఒప్పందం-2009లో భాగస్వామ్యానికి నిశ్చయించింది.
• ఆ మేరకు భారతదేశంలో ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఓడల ఊడదీత-పునర్వినియోగ బిల్లు-2019 కింద రూపొందించే నియమ-నిబంధనలకు అనుగుణంగా దాని నియమావళి అమలు చేయబడుతుంది.
పూర్వరంగం:
• నౌకల ఊడదీత-పునర్వినియోగ కార్యకలాపాల్లో అంతర్జాతీయ విపణిలో 30 శాతానికి పైగా వాటా తో భారత్ అగ్రస్థానం లో ఉంది. ఆ మేరకు 2018 నాటి సముద్ర రవాణా పై 2018నాటి యుఎన్ సిటిఎడి (అంక్టాడ్) సమీక్ష ప్రకారం... 2017లో భారత్ 6,323 టన్నుల మేర పాత ఓడలను తుక్కుగా మార్చింది.
• ఓడల ఊడదీత-పునర్వినియోగ పరిశ్రమ ముమ్మర కార్మిక ఉపాధి కల్పనరంగమే అయినప్పటికీ, పర్యావరణపరమైన భద్రత ఒక ఆందోళనకర అంశం గా ఉంది.
**
(Release ID: 1592936)
Visitor Counter : 242
Read this release in:
Hindi
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam