ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎన్‌జిఎ 74 సందర్భం గా సైప్రస్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 SEP 2019 11:10PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎన్‌జిఎ 74 యొక్క ఉన్నత స్థాయి సదస్సు సందర్భం గా రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అధ్యక్షుడు మాన్య శ్రీ నికోస్ అనాస్తాసియాదెస్ తో ప్రత్యేకం గా సమావేశమయ్యారు.
నేతలు ఇరువురూ 2018వ సంవత్సరం సెప్టెంబర్ లో సైప్రస్ లో భారతదేశ మాన్య రాష్ట్రపతి ఆధికారిక పర్యటన దరిమిలా ద్వైపాక్షిక సంబంధాల లో చోటు చేసుకొన్న విస్తృతి ని గురించి చర్చించారు.
భారతదేశానికి మరియు సైప్రస్ కు మధ్య 2018-19 లో ద్వైపాక్షిక వ్యాపారం 464 మిలియన్ యుఎస్ డాలర్ల మేరకు నమోదయింది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ ల యొక్క బలాలకు మరియు సామర్థ్యాల కు అనుగుణం గా ద్వైపాక్షిక వ్యాపారం మరియు పెట్టుబడి పరిమాణాన్ని పెంపొందింప చేసుకోవలసిన అవసరం ఉందని నేత లు ఉభయులు స్పష్టం చేశారు.
ఐరాస భద్రత మండలి ని విస్తరించిన పక్షం లో అందులో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం తో పాటు, ఎన్ఎస్ జి మరియు ఇతర అంతర్జాతీయ వేదిక ల లో భారతదేశ అభ్యర్ధిత్వాన్ని సమర్ధిస్తున్న సైప్రస్ ప్రభుత్వాని కి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. దీనికి బదులు గా రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ యొక్క స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రత కు, ఇంకా ఏకత కు భారతదేశం నిరంతరం మద్ధతు ను ఇస్తుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
అంతర్జాతీయ ఉగ్రవాదం సమస్య సహా ప్రాంతీయ ప్రాముఖ్యం మరియు అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల ను గురించి కూడా ఇరువురు నేతలూ చర్చించారు. ఇంటర్‌నేశనల్ సోలర్ అలయన్స్ లో చేరవలసిందిగా అధ్యక్షుడు శ్రీ అనాస్తాసియాదెస్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానం పలికారు.
**
(रिलीज़ आईडी: 1586460)
आगंतुक पटल : 124