మంత్రిమండలి

ప‌బ్లిక్ సెక్ట‌ర్ లోని ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీ ల విషయం లో 2016 డిసెంబర్ 28వ తేదీ నాడు మంత్రివర్గం తీసుకొన్న నిర్ణ‌యం- అందు లో కోరినటువంటి మార్పు మేరకు, అమలు కై ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 17 JUL 2019 4:19PM by PIB Hyderabad

ఈ క్రింద ప్ర‌స్తావించిన నిర్ణ‌యాల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది:

(i)       పిఎస్‌యు ల భూమి ని ప్ర‌భుత్వ ఏజెన్సీల‌ కు విక్ర‌యించ‌డాని కి సంబంధించి 2016వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ నాడు తీసుకొన్న మునుప‌టి నిర్ణ‌యం లో మార్పు చేయ‌డం మ‌రియు దాని కి బ‌దులు గా భూమి ని 2018వ సంవత్సరం జూన్ 14వ తేదీ నాటి స‌వ‌రించిన డిపిఇ యొక్క మార్గ‌ద‌ర్శ‌క సూత్రాల కు అనుగుణం గా భూవిక్ర‌యాన్ని అనుమ‌తించ‌డం; 

మ‌రియు 

(ii)       ఈ దిగువన పేర్కొన్న వివ‌రాల మేర‌కు ఉద్యోగుల అప్పుల ను (చెల్లింపు జ‌ర‌గ‌ని జీతం - రూ.158.35 కోట్లు + విఆర్ఎస్ రూ.172.00 కోట్లు) తీర్చ‌డం కోసం రూ.330.35 కోట్ల మేర బ‌డ్జెట‌రీ స‌పోర్టు ను రుణం రూపం లో  అంద‌జేయ‌డం:

ఎ. ఐడిపిఎల్ కు - రూ. 6.50 కోట్లు.

బి. ఆర్‌డిపిఎల్ కు - రూ. 43.70 కోట్లు.

సి. హెచ్ఎఎల్‌  కు - రూ. 280.15 కోట్లు.

(iii)       ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ లు నాలుగింటి మూసివేత/ వ్యూహాత్మ‌క విక్ర‌యం కు సంబంధించిన ఆస్తుల అమ్మ‌కం తో పాటు చెల్లించ‌వ‌ల‌సి ఉన్న‌టువంటి అప్పుల‌ ను తీర్చ‌డం తో స‌హా అన్ని నిర్ణ‌యాల‌ ను తీసుకోవ‌డం కోసం ఒక మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేయ‌డం.
 
ప్ర‌ధాన ప్ర‌భావం:

హిందుస్తాన్ యాంటిబయొటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్), రాజస్తాన్ డ్రగ్స్ ఎండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఆర్‌డిపిఎల్‌), ఇంకా ఇండియన్ డ్రగ్స్ ఎండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడిపిఎల్) ఉద్యోగుల విఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ను అందించ‌డం తో పాటు వారి కి చెల్లింపు జ‌ర‌గ‌న‌టువంటి జీతాల‌ను చెల్లించడం లో 330.35 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట‌రీ స‌పోర్టు ల‌భించ‌నుండ‌టం స‌హాయ‌కారి కానుంది.  ఈ యొక్క పిఎస్‌యు ల లోని వేయి మంది కి పైగా ఉద్యోగుల ఇక్క‌ట్టుల‌ ను తీర్చేందుకు ఈ నిర్ణ‌యం దోహ‌దం చేస్తుంది.

ఆర్‌డిపిఎల్ ను, ఐడిపిఎల్ ను మూసివేయాల‌ని, బిసిపిఎల్ లో మ‌రియు హెచ్ఎఎల్ లో వ్యూహాత్మ‌క విక్ర‌యాలు జ‌ర‌పాల‌ని 2016వ సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 28వ తేదీ నాడు మంత్రివ‌ర్గం తీసుకొన్న నిర్ణ‌యాన్ని అమ‌లు ప‌ర‌చే ప్ర‌క్రియ ను శీఘ్ర‌త‌రం చేసేందుకు గాను మంత్రుల సంఘాన్ని ఒక‌దాని ని ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.

**



(Release ID: 1579299) Visitor Counter : 209