మంత్రిమండలి

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన అహ్మ‌దాబాద్‌, ల‌క్నో, మంగ‌ళూరు విమానాశ్ర‌యాల‌ను ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్యం ద్వారా లీజుకు ఇచ్చే ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Posted On: 03 JUL 2019 4:39PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న ఈరోజు స‌మావేశ‌మైన కేంద్ర  కేబినెట్ , ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కి చెందిన అహ్మ‌దాబాద్‌, అక్నో ,మంగ‌ళూరు విమానాశ్ర‌యాల‌ను  పబ్లిక్, ప్రైవేట్ భాగ‌స్వామ్యం కింద గ‌రిష్ఠ బిడ్డ‌ర్‌గా నిలిచిన మెస్స‌ర్స్ అదాని ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు   ఈ  మూడు విమానాశ్ర‌యాల‌కు సంబంధించి కార్య‌క‌లాపాల కొన‌సాగింపు, నిర్వ‌హ‌ణ‌, అభివృద్ధికి సంబంధించి పిపిపి ప‌ద్ధ‌తిలో , బిడ్ డాక్యుమెంట్‌లోని నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం 50 సంవ‌త్స‌రాల  లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 
ప్ర‌భావం.....
 ఈ ప్రాజెక్టులు సేవ‌లు అందించ‌డంలో స‌మ‌ర్ధ‌త‌, నైపుణ్యం, ఎంట‌ర్‌ప్రైజ్‌, వృత్తిప‌ర‌మైన నైపుణ్యాల‌ను తీసుకురావ‌డంతోపాటు ప‌బ్లిక్ రంగానికి అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డుల‌ను తీసుకురావ‌డానికి ఉప‌క‌రిస్తాయి. ఇది ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కి  రాబ‌డి పెంపొందిస్తుంది. ఇది ఎఎఐ సంస్థ‌కు టైర్‌-2, టైర్ -3 సిటీలలో  ఈరంగంలో ఉపాధి క‌ల్ప‌న‌, సంబంధిత‌ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నకు వీలు క‌ల్పిస్తుంది.



(Release ID: 1576973) Visitor Counter : 141