మంత్రిమండలి

ఇండియా, కిర్గిస్తాన్ మ‌ధ్య‌న కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబ‌డి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

Posted On: 12 JUN 2019 8:06PM by PIB Hyderabad

ఇండియా, కిర్గిస్తాన్ దేశాలు చేసుకున్న ద్వైపాక్షిక పెట్టుబ‌డుల ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

ఈ ద్వైపాక్షిక ఒప్పందం కార‌ణ‌గా ఇరు దేశాల మ‌ధ్య‌న పెట్టుబ‌డుల ప్ర‌వాహం పెరుగుతుంది. అంతే కాదు ఇరు దేశాల్లో పెట్టుబ‌డులు పెట్టే పెట్టుబ‌డిదారులకు ఈ ఒప్పందం కార‌ణంగా త‌గిన భ‌ద్ర‌త ల‌భిస్తుంది. 

***(Release ID: 1574494) Visitor Counter : 136