మంత్రిమండలి
అంతరిక్ష విభాగం పరిధి లో ఒక కొత్త కంపెనీ ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
19 FEB 2019 9:26PM by PIB Hyderabad
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ.. ‘ఇస్రో’) కేంద్రాలు మరియు అంతరిక్ష విభాగం (డిఒఎస్) లో భాగమైన యూనిట్ లు చేపడుతున్న పరిశోధన మరియు అభివృద్ధి [ ఆర్ & డి ] కార్యకలాపాల ను వాణిజ్య సరళి లో వినియోగించుకోవడం కోసం డిఒఎస్ పరిధి లో ఒక నూతన కంపెనీ ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ముఖ్యాంశాలు:
ఐఎస్ఆర్ఒ కార్యక్రమాల ను వాణిజ్య సరళి లో ఆచరణాత్మకం చేసేందుకు ఈ దిగువన పేర్కొన్న రంగాలు / మార్గాలు అవకాశాల ను అందిస్తాయి:
1. చిన్న ఉపగ్రహాల కు సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని పరిశ్రమ కు బదలాయించడం. ఇందుకోసం కొత్త కంపెనీ డిఒఎస్/ ఐఎస్ఆర్ఒ ల నుండి లైసెన్సు ను తీసుకోవలసివుంటుంది. పరిశ్రమల కు కంపెనీ సబ్-లైసెన్సు ను ఇవ్వాలి;
2. ప్రైవేటు రంగం సహకారం తో చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్ఎల్‌వి)ని తయారు చేయడం;
3. పరిశ్రమ ద్వారా పోలర్ ఎస్ఎల్‌వి ని ఉత్పత్తి చేయడం;
4. ప్రయోగం, ఇంకా అప్లికేశన్స్ సహా అంతరిక్ష ఆధారిత ఉత్పత్తుల ను మరియు సేవల ను తయారు చేయడం, విక్రయించడం;
5. డిఒఎస్ లో భాగమైన యూనిట్ లు మరియు ఇస్రో కేంద్రాలు అభివృద్ధిపరచిన సాంకేతిక విజ్ఞానం బదిలీ;
6. కొన్ని ఉప సాంకేతిక పరిజ్ఞానాల ను మరియు ఉత్పత్తుల ను భారతదేశం లో, ఇంకా విదేశాల లో విక్రయించడం; మరియు
7. భారత ప్రభుత్వం యోగ్యమైనదని భావించిన మరే ఇతర విధినైనా నిర్వర్తించడం.
**
(Release ID: 1565547)
Visitor Counter : 326