మంత్రిమండలి

అహ‌మాదాబాద్ మెట్రో రైల్ ప్రోజెక్టు రెండో ద‌శ కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

ఈ ప్రోజెక్టు లో రెండు కారిడార్లు.. మోతేరా స్టేడియ‌మ్ నుండి మ‌హాత్మా మందిర్ వ‌ర‌కు మ‌రియు జిఎన్ఎల్‌యు నుండి జిఐఎఫ్‌టి సిటీ వ‌ర‌కు.. భాగం గా ఉంటాయి.

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2019 9:16PM by PIB Hyderabad

దిగువన పేర్కొన్న ప్ర‌తిపాద‌న‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర‌ మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది:

1.  అహమ‌దాబాద్ మెట్రో రైల్ ప్రోజెక్టు రెండో ద‌శ ను అమ‌లు లోకి తీసుకు రావ‌డం;  దీనిలో మొత్తం 28.254 కిలోమీటర్ల పొడ‌వైన రెండు కారిడార్లు భాగం గా ఉంటాయి.  ఒక‌టో కారిడార్ 22.838 కి.మీ. మేర మోతెరా స్టేడియ‌మ్ నుండి మ‌హాత్మా మందిరం వ‌ర‌కు ఉంటుంది.  రెండో కారిడార్ 5.416 కి.మీ పొడ‌వు తో జిఎన్ఎల్‌యు నుండి జిఐఎఫ్‌టి సిటీ వ‌ర‌కు ఉంటుంది.  ఈ కారిడార్ ల నిర్మాణానికి మొత్తం 5384.17 కోట్ల రూపాయ‌ల వ్య‌యం అవుతుంది. 

2.  ఈ ప్రోజెక్టు కు సంస్థాగ‌త స‌ర్దుబాటు మ‌రియు న్యాయ సంబంధ స్వ‌రూపం.  

3.  ప్రోజెక్టు మంజూరు కు ష‌ర‌తులు 

ప్ర‌యోజ‌నాలు:

ఈ ప్రోజెక్టు అమ‌ల‌యితే అహ‌మ‌దాబాద్ కు, గాంధీన‌గ‌ర్ కు ఎంతో అవ‌స‌ర‌మైన‌టువంటి అద‌న‌పు ప్ర‌జా ర‌వాణా సంబంధిత మౌలిక స‌దుపాయాలు  స‌మ‌కూరుతాయి.

**


(రిలీజ్ ఐడి: 1565450) సందర్శకుల సూచీ సంఖ్య : : 142
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada