మంత్రిమండలి

అరుణాచ‌ల్‌ ప్ర‌దేశ్‌ కు చెందిన షెడ్యూల్డు తెగ‌ ల జాబితా లో స‌వ‌ర‌ణ‌ కై రాజ్యాంగ (షెడ్యూల్డు తెగ‌ ల ) ఆదేశం (స‌వ‌ర‌ణ‌) బిల్లు 2018కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 02 JAN 2019 5:45PM by PIB Hyderabad

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ యొక్క షెడ్యూల్డు తెగ‌ల (ఎస్‌ టి) జాబితా లో మార్పులు చేసేందుకుగాను రాజ్యాంగం లోని (షెడ్యూలు తెగ‌ ల‌) ఆదేశం, 1950 లో కొన్ని స‌వ‌ర‌ణ‌ లను తీసుకురావడానికి వీలు గా  రాజ్యాంగ (షెడ్యూల్డు తెగ‌ ల‌) ఆదేశం (స‌వ‌ర‌ణ‌) బిల్లు, 2018ని  పార్ల‌మెంటు లో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ షెడ్యూల్డు తెగ‌ ల జాబితా లో కింద తెలిపిన మార్పు లను చేయ‌డం జ‌రుగుతుంది:

i.  క్రమ సంఖ్య 1 లో ‘అబొర్’ ప‌దాన్ని తొల‌గించడం జరుగుతుంది; దీనికి కారణం ఇదే విధం గా క్రమ సంఖ్య 16 లోని ‘ఆది’కి మల్లేనే ఉంది కాబట్టి.
ii. క్రమ సంఖ్య 6 లో ‘ఖాంప్తి’ యొక్క స్థానం లో ‘తాయీ ఖామ్తీ’ ప‌దాన్ని చేర్చడం జరుగుతుంది
iii. క్రమ సంఖ్య 8 లో మిశ్మి- కామన్ (మిజు మిశ్మీ), ఇదు ( మిశ్మీ), ఇంకా త‌రావో (డిగారూ మిశ్మీ)లను చేర్చడం
iv.  క్రమ సంఖ్య 9 లో ‘మొమ్బా’ స్థానం లో మొన్పా, మెమ్బా, స‌ర్ తాంగ్‌, స‌జోలోంగ్‌ (మిజీ) లను చేర్చడం.
v.  అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ యొక్క షెడ్యూల్డు తె గ‌ల జాబితా లో క్రమ సంఖ్య 10 లో ‘ఏదైనా నాగా తెగ’ అన్న పదాల స్థానం లో ‘నాక్టే’, ‘తాంగ్ సా’, ‘తుత్సా’, ‘వాంచో’ ప‌దాలను చేర్చడం.

ప్రతిపాదిత స‌వ‌ర‌ణ‌ ల తాలూకు ఔచిత్యం ఇదీ:

i.  ‘అబొర్’ ను తొల‌గించడం- నకలు కు స్వస్తి పలకడం
ii.  ఖాంప్తి ని తొలగించడం- వేరే ప‌దం చేర్పు- ఖాంప్తి పేరు తో షెడ్యూల్డు తెగ‌ ఏదీ లేదు.
iii.  మిశ్మి- కామన్‌, ఇదు, ఇంకా త‌రావో లను చేర్చడం- వీటి లో కేవలం ‘మిశ్మి’ని చేర్చడం జరిగింది.  ఈ విధమైనటువంటి సముదాయం ఏదీ లేన‌ట్టు స‌మాచారం.
iv.  మోన్పా, మెమ్బా, స‌ర్ తంగ్‌, వాంచో లను చేర్చడం- వీటి లో ‘ఏదైనా నాగా  తెగ’ను చేర్చడం జరిగింది.  రాష్ట్రం లో కేవలం ఇవే  నాగా తెగ‌లు గా ఉన్నట్టు సమాచారం.
v.  ‘నోక్టే’, ‘తాంగ్ సా’, ‘తుత్సా’, ‘వాంచో’లను చేర్చడం- రాష్ట్రం లో కేవలం ఈ నాగా తెగ‌ లు అని సమాచారం ఉంది.

ఈ బిల్లు చ‌ట్ట రూపం దాలిస్తే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ లోని షెడ్యూల్డు తెగ‌ ల  స‌వ‌రించిన జాబితా లో నూత‌నం గా చేరిన సముదాయాలకు చెందిన వారు ప్ర‌స్తుత ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ ను పొంద‌గ‌లుగుతారు.  ఈ తరహా ప్రముఖ ప్రయోజనాల లో కొన్ని ఏవంటే-  పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్ శిప్‌, నేశన‌ల్ ఓవ‌ర్ సీస్ స్కాల‌ర్ శిప్‌, నేశన‌ల్ ఫెలో శిప్‌, అత్యున్న‌త స్థాయి విద్య‌, నేశన‌ల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ , డివెల‌ప్‌మెంట్ కార్పొరేశన్ నుండి రాయితీ తో కూడిన రుణాలు, ఇంకా ఎస్‌ సి, ఎస్‌ టి బాల బాలిక‌ ల‌కు వసతిగృహ‌ స‌దుపాయం.  వీటి కి అదనం గా,  వీరు ప్ర‌భుత్వ విధానాని కి అనుగుణం గా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ లోను, విద్యా సంస్థ‌ ల‌ ప్రవేశాల లోను  రిజ‌ర్వేశన్ ల యొక్క ప్రయోజనాలను కూడా పొంద‌డానికి హక్కుదారులు అవుతారు.


**
 


(Release ID: 1558399) Visitor Counter : 298